అన్వేషించండి

Father's Day Special: ఫాదర్స్‌ డే స్పెషల్ - తండ్రి సెంటిమెంట్‌తో వచ్చిన మోడ్రన్‌ సినిమాలివే!

ప్రపంచంలో స్వార్థం లేని ప్రేమ ఏదైనా ఉందంటే అది తల్లిదండ్రుల ప్రేమ. తల్లి నవమోసాలు మోస్తా నాన్న తన జీవితం వరకు మోస్తాడు. తన పిల్లల సంతోషం, భవిష్యత్తు కోసం ఎంత కష్టాన్నైనా ఇష్టంగా అనుభవిస్తాడు...

Father's Day 2024 Special: ప్రపంచంలో స్వార్థం లేని ప్రేమ ఏదైనా ఉందంటే అది తల్లిదండ్రుల ప్రేమ. తల్లి నవమోసాలు మోస్తా నాన్న తన జీవితం వరకు మోస్తాడు. తన పిల్లల సంతోషం, భవిష్యత్తు కోసం ఎంత కష్టాన్నైనా ఇష్టంగా అనుభవిస్తాడు. పిల్లలు జీవితంలో ఎదగడానికి నాన్న వారధిలా మారతాడు. కొడుకుకైనా, కూతురికైనా తొలి హీరో నాన్నే. తన చివరి ఊపిరి వరకు పిల్లల కోసమే తపించే నాన్న ప్రేమ వెలకట్టలేనిది. అలాంటి తండ్రి ప్రాముఖ్యతను తెలిజేసేలా జరుపుకునేందుకు ప్రత్యేకంగా రోజే ఫాదర్స్‌ డే. మదర్స్‌ డేలా ఈ రోజుకు ప్రత్యేకమైన తేదీ అంటూ ఏం లేదు.

కానీ ప్రతి ఏడాది జూన్‌ మూడవ ఆదివారం ఫాదర్స్‌ డే ఇండియాతో పాటు పలు దేశాలు సెలబ్రేట్‌ చేసుకుంటాయి. ఇక మరికొద్ది రోజుల్లో ఫాదర్స్‌ డే రానుంది. ఈ సందర్భంగా తెరపై ఫాదర్ సెంటిమెంట్ అంటే మోడ్రన్ డేస్‌లో గుర్తుకు వచ్చే సినిమాలేవో ఒకసారి చూద్దాం. తండ్రికొడుకుల ఆప్యాయత, తండ్రికూతురు అనురాగం ప్రపంచంలోనే ప్రత్యేకమైనది. అవన్ని కళ్లకు కట్టేలా చూపిస్తూ వెండితెరపై ఎన్నో సినిమాలు ఆవిష్కృతం అయ్యాయి. 'ఆకాశమంత'లో ఓ తండ్రి కూతురి ఆనందం, సంతోషంగా ఎంత దూరమైన వెళతాడు అని చూపించారు. కొడుకు భవిష్యత్తు కోసం పడే ఆరాటం, ఈ జర్నీలో కొడుకు కంటే ముందే ఆ తండ్రి వేసే అడుగు 'బొమ్మరిల్లు'లో చూపించారు. అలా వెండితెరపై తండ్రికూతురు, తండ్రికొడుకుల అనుబంధాన్ని ఎమోషనల్‌గా చూపించారు. అవేంటంటే

నాన్నకు ప్రేమతో మూవీ

మోడ్రన్‌ డేస్‌లో తల్లిదండ్రులను సైతం లెక్క చేయకుండ తమ జీవితం తమదే అనుకునే పిల్లలు ఉన్నారు. అలాంటి రోజుల్లోనే ఓ తండ్రి-కొడుకుల నిజమైన బంధాన్ని తెలియజేస్తూ తెరకెక్కిన చిత్రమే నాన్నకు ప్రేమతో. చేతికి ఉన్న ఐదు వేళ్లు కూడా ఒకేరకంగా ఉండవు.. అలాగే ఒకే తండ్రికి పెట్టిన పిల్లలు కూడా ఒకేలా ఆలోచించలేరు. ఒకరు మనకేందుకే అది మానాన్న బాధ అనుకుంటే.. తండ్రిని పగను తన పగగా భావించిన పోరాటం చేస్తాడు మరో కొడుకు. క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌, మ్యాన్‌ ఆఫ్‌ మాసెస్‌ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో 2016లో తెరకెక్కిన చిత్రమిది. సంపన్నుడైన తన తండ్రిని ఓ వ్యక్తి నమ్మకం పేరుతో మోసం చేసిన ఆస్తిని అంతా కాజేస్తాడు. తన ముగ్గురు పిల్లలతో రోడ్డున పడ్డ ఆ తండ్రి తన కష్టం తెలియకుండ పిల్లలను పెంచుకుంటాడు. కానీ ఆ తండ్రి పడుతున్న ఆవేదనను కొడుకుగా ఎన్టీఆర్‌ తెలుసుకుని అతడిపై రివేంజ్‌ తీసుకుంటాడు.

సన్నాఫ్ సత్యమూర్తి

తండ్రి ఆస్తినే కాదు ఆయన బాధ్యతను కూడా పంచుకునే కొడుకు ప్రేమే 'సన్నాఫ్‌ సత్యామూర్తి'. ఎన్నో విలువతో కూడిన ఓ బిలియనీర్‌ ఆకస్మాత్తుగా చనిపోతారు. దీంతో అప్పటి వరకు విలాసవంతంగా బతికే కొడుకు ఆ కుటుంబానికి ఆధారం అవుతాడు. ఓ పక్క అప్పులు, మరోపక్క తన తండ్రి అతడి స్నేహితుడికి అమ్మిన భూమిని తిరిగి ఇప్పించే బాధ్యత. అవన్ని వదిలేస్తే ఆ కొడుకు సంతోషంగా ఉన్న ఆస్తితో బతికేయచ్చు. కానీ తండ్రి విలువలు, పరువు కోసం ఆస్తి మొత్తానికి ఇచ్చేసి సాధారణ జీవితం గడుపతాడు. మా నాన్న అన్నింటిలోనూ టాప్ ఉండాలని తనకు సంబంధం లేని భూమి వివాదాన్ని కూడా తిర్చాలనుకుంటాడు. చివరికి ఆ భూమిని అమ్మిన వ్యక్తి నిజాయితి ఇచ్చేసి తన తండ్రి విలువని కాపాడే కొడుకు కథే ఈ సన్నాఫ్‌ సత్యమూర్తి సినిమా. అల్లు అర్జున్‌ హీరోగా ప్రకాశ్‌ రాజ్‌, రాజేంద్ర ప్రసాద్‌ కీలక పాత్రలో 2015లో వచ్చిన ఈ సినిమా త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వం వహించారు. 

బొమ్మరిల్లు 

ప్రకాశ్‌ రాజ్‌ తండ్రి, హీరో సిద్ధార్థ్‌ కొడుకుగా 2008లో వచ్చిన ఈ చిత్రం పూర్తి ఎమోషనల్‌ డ్రామాగా ఆడియన్స్‌ని ఆకట్టుకుంది. సంపన్నుడైన తండ్రి తన కొడుకు భవిష్యత్తు కోసమే ఎప్పుడు ఆలోచిస్తుంటాడు. పెళ్లి వయసు వచ్చిన తన కొడుకి ఏ డ్రెస్‌ దగ్గరి నుంచి అన్ని పర్ఫెక్ట్‌గా ఇవ్వాలనుకుంటాడు. ఆటలోనూ కొడుకు ఓడిపోకుడదని ఆ తండ్రే చేయిపట్టి ఆడిస్తాడు. ఆఫీసులో ఎండీగా వెళ్తిన కొడుకుకు ఎలాంటి భారం లేకుండా ముందుగానే ఆ వర్క్ పూర్తి చేస్తాడు. అంతగ తన ప్రేమతో ఆ కొడుకును ఉక్కరిబిక్కిరి చేస్తాడు. ఓ తండ్రి తన పిల్లల కోసం ఇంతగా ఆలోచిస్తాడా? అని చూపించిన తండ్రి-కొడుకుల బంధం కథే ఇది. డైరెక్టర్‌ భాస్కర్‌ తెరకెక్కించిన ఈ చిత్రం అప్పట్లో మంచి విజయం సాధించింది. 

ఆకాశమంత

ప్రతి తండ్రికి కూతురు అంటే ప్రిన్సెస్‌. తన ఏంత పెదరికంలో ఉన్న ఆ కూతురిని యువరాణిలా చూసుకుంటాడు. దానికి నిదర్శనమే ఈ ఆకాశమంతా చిత్రం. ప్రకాశ్‌ రాజ్‌ తండ్రిగా, త్రిష కూతురిగా 2009లో వచ్చిన ఈ చిత్రం పూర్తి ఎమోషనల్‌ డ్రామా సాగింది. ప్రతి తండ్రికూతుళ్లను ఆకట్టుకున్న ఈ చిత్రంలో ఓ కూతురి తండ్రిగా ప్రకాశ్‌ రాజ్‌ ఒదిగిపోయి నటించారు. కూతురు స్కూల్‌కి వెళితే ఏడ్చే తండ్రి కూడా ఉంటారని ఈ సినిమాలో చూపించారు డైరెక్టర్‌  రాధామోహన్. కూతురు పుట్టినప్పటి నుంచి కంటిరెప్పాలా చూసుకునే ఆ తండ్రి.. కూతురి కొన్ని గంటలు కళ్ల ముందు కనిపించదనేదాన్ని కూడా భరించలేడు.

కూతురు స్కూల్‌కు వెళ్లితే ఎక్కడ ఇబ్బంది పడుతుందో అని స్కూల్‌ ముందే కాచుకుని ఉంటాడు. లేచినప్పటి నుంచి పడుకునే వరకు ప్రతి క్షణం ఆమెను కంటిపాపల చూసుకునే తండ్రి, అలాంఇ కూతురు తనని ప్రేమించి వ్యక్తిని పెళ్లి చేసుకుని వెళ్లిపోతుంటే ఆ తండ్రి పడే ఆవేదనే ఈ ఆకాశమంత. కూతురికి సంబంధించిన విషయాన్ని ఎమోషనల్‌గా చూసే ఫాదర్‌, అలా ఉండకూడదంటూ మోడ్రన్‌గా ఆలోచించే కూతురి కథే ఈ ఆకాశమంత. ఇవి మాత్రమే కాదు తండ్రికూతురు, తండ్రి కొడుకుల మధ్య ప్రేమ, ఆప్యాయత, బంధాలు.. మిర్చి, ఆడవారి మాటలకు ఆర్థాలేవేరులే, నువ్వు నాకు నచ్చావ్‌ ఇలా ఎన్నో సినిమాలు వెండితెరపై అలరించాయి. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun: 'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
Devansh: చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
Royal Enfield Bullet 350 Vs Hunter 350: రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్, హంటర్ 350ల్లో ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్ బైక్?
రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్, హంటర్ 350ల్లో ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్ బైక్?
Allu Arjun: అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

8 పల్టీలతో కారుకు ఘోరమైన యాక్సిడెంట్ ఆఖర్లో తమాషా!హైటెన్షన్! మైనర్‌‌ను ఇంట్లో బంధించి అత్యాచారంకరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డిసినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Allu Arjun: 'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
Devansh: చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
Royal Enfield Bullet 350 Vs Hunter 350: రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్, హంటర్ 350ల్లో ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్ బైక్?
రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్, హంటర్ 350ల్లో ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్ బైక్?
Allu Arjun: అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
Government Banned OTT Apps: 18 ఓటీటీ యాప్స్ బ్యాన్ చేసిన ప్రభుత్వం - ఎందుకో తెలుసా?
18 ఓటీటీ యాప్స్ బ్యాన్ చేసిన ప్రభుత్వం - ఎందుకో తెలుసా?
Game Changer : ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
Allu Arjun: బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
Anger On Allu Arjun: 'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
Embed widget