Faria Abdullah: హైట్ ముఖ్యం కాదట - కాబోయే భర్తలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలో చెప్పిన ఫరియా అబ్దుల్లా
Faria Abdullah: ‘ఆ ఒక్కటి అడక్కు’ మూవీ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న ఫరియా అబ్దుల్లా.. ప్రమోషన్స్‌లో బిజీగా గడిపేస్తోంది. అదే సమయంలో తనకు కాబోయే భర్తలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలో బయటపెట్టింది.
Faria Abdullah About Qualities Of Future Husband: ‘జాతిరత్నాలు’లో చిట్టిగా తెలుగు ప్రేక్షకులకు పరిచమయ్యింది ఫరియా అబ్దుల్లా. సింపుల్‌గా మన ఇంటి అమ్మాయిగా కనిపించే ఫరియా యాక్టింగ్‌కు చాలామంది ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఆ మూవీ తర్వాత తనకు ఎన్ని అవకాశాలు వచ్చినా కూడా తను మాత్రం సెలక్టెడ్‌గా స్క్రిప్ట్స్‌ను ఎంచుకుంటూ ముందుకెళ్తోంది. త్వరలోనే అల్లరి నరేశ్ సరసన ఫరియా అబ్దుల్లా నటించిన ‘ఆ ఒక్కటి అడక్కు’ అనే మూవీ థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమవుతుంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్‌లో బిజీ అయిన ఫరియాకు తనకు కావాల్సిన భర్తలో ఎలాంటి లక్షణాలు ఉండాలి అనే ప్రశ్న ఎదురయ్యింది.
కేవలం ఎంటర్‌టైన్మెంట్..
ఫరియా అబ్దుల్లా అనగానే చాలామంది ప్రేక్షకులకు గుర్తొచ్చేది తన హైట్. కానీ తను మాత్రం తన భర్త తనకంటే హైట్ లేకపోయినా పర్వాలేదని అంటోంది. ‘‘ఐడియల్ హజ్బెండ్ క్వాలిటీస్ అంటే ముందు ఫన్ ఉండాలి. ఫన్ అంటే హైట్ ఓకే.. ఎలా ఉన్నా పర్వాలేదు. ఊరికే జోకులు వేస్తుండాలి. లైఫ్ ఒక జర్నీ కాబట్టి ఆల్రెడీ అందులో చాలా బాధలు, కష్టాలు ఉంటాయి. అందుకే అందులో కొంచెం ఫన్ ఉండాలి. తనతో ఎంటర్‌టైన్మెంట్ ఉండాలి’’ అంటూ మనసులోని మాట బయటపెట్టింది ఫరియా. ఆ సమాధానం విన్న తర్వాత ‘ఆ ఒక్కటి అడక్కు’లో మరో హీరోయిన్‌గా నటించిన జేమీ లివర్.. తానే అబ్బాయి అయ్యింటే కచ్చితంగా ఫరియాను డేట్‌కు తీసుకెళ్లేదాన్ని అని స్టేట్‌మెంట్ కూడా ఇచ్చారు.
హీరోయిన్ అని చెప్పను..
ఒకవేళ ఫరియా అబ్దుల్లా మ్యాట్రిమోనీ సైట్‌లో ప్రొఫైల్ క్రియేట్ చేసి.. అందులో ఒక విషయాన్ని దాచిపెట్టాలి అనుకుంటే ఏం దాచిపెడతారు అని అడగగా.. తను నటి అనే విషయాన్ని దాచిపెడతానని షాకింగ్ స్టేట్‌మెంట్ ఇచ్చింది ఫరియా. అలా ఎందుకు చేస్తుందో కారణం కూడా చెప్పుకొచ్చింది. ‘‘ఎందుకంటే హీరోయిన్ అనగానే ముందే ఒక ఆలోచనతో ఉండిపోతారు. అందుకే ఇంప్రెస్ చేయాలని అనుకుంటారు. ఒకవేళ వాళ్లకు నేను తెలియకపోతే వాళ్లు వాళ్లలాగా ఉండడానికి ప్రయత్నిస్తారు’’ అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది ఫరియా అబ్దుల్లా. ఇక తనకు కాబోయే భర్తలో కావాల్సిన లక్షణాలు ఇవే అంటూ ఫరియా చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
రెండేళ్ల తర్వాత..
ఫరియా అబ్దుల్లా చివరిగా రవితేజ హీరోగా నటించిన ‘రావనాసుర’లో కీలక పాత్రలో కనిపించింది. కానీ తను పూర్తిస్థాయిలో హీరోయిన్‌గా వెండితెరపై కనిపించి రెండేళ్లు అయిపోయింది. చివరిగా సంతోష్ శోభన్‌తో కలిసి ‘లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్’ అనే సినిమాలో నటించింది. ఇక రెండేళ్ల తర్వాత అల్లరి నరేశ్‌తో జోడీకడుతూ ‘ఆ ఒక్కటి అడక్కు’ అనే క్లాసిక్ టైటిల్‌తో తెరకెక్కిన మూవీతో ఆడియన్స్‌ను అలరించడానికి వచ్చేస్తోంది. మల్లి అంకం దర్శకత్వం వహించిన ఈ మూవీతో జేమీ లివర్.. టాలీవుడ్‌లోకి ఎంటర్ అవుతోంది. బాలీవుడ్‌లో ప్రముఖ కామెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్న జానీ లివర్ కూతురే జేమీ లివర్. మే 3న ‘ఆ ఒక్కటి అడక్కు’ ప్రేక్షకుల ముందుకు రానుంది.