Jawan: అరె ఏంట్రా ఇది - ‘జవాన్’ ప్రేక్షకులకు ఊహించని షాక్, గంటన్నరలో సినిమా ఫినిష్? ఇంతకీ ఏమైంది?
‘జవాన్’ రిలీజ్ అయిన ప్రతీ థియేటర్ దగ్గర ఒక పండగ వాతావరణం కనిపిస్తోంది. కానీ ఒక థియేటర్ దగ్గర మాత్రం ప్రేక్షకులు అసహనంతో కనిపించారు.
ఒక స్టార్ హీరో సినిమాకు యావరేజ్ టాక్ వస్తేనే.. దాని కలెక్షన్స్ ఒక రేంజ్‌లో ఉంటాయి. ఇక ఆ మూవీకి మౌత్ టాక్ కూడా బాగుంటే.. ఇక దానిని థియేటర్లలో చూడడానికి ప్రేక్షకులకు అంతా ఎంతో ఆసక్తి చూపిస్తారు. ప్రస్తుతం బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ నటించిన ‘జవాన్’ సినిమా విషయంలో కూడా ఇదే జరుగుతోంది. ఇప్పటికే ఈ ఏడాది ‘పఠాన్’తో వచ్చి హిట్ కొట్టాడు షారుఖ్. కానీ ‘జవాన్’.. దానికి మించిన హిట్ అయ్యేలా ఉంది. నార్త్ స్టేట్స్‌లో ఏ థియేటర్ దగ్గర చూసినా.. ‘జవాన్’ సందడి కనిపిస్తోంది. కానీ ఒక థియేటర్ వద్ద మాత్రం తమ టికెట్ డబ్బులు రిటర్న్ ఇచ్చేయాలి అంటూ ఓ ప్రేక్షకులరాలు నిరసన చేయడం మొదలుపెట్టింది. అసలు దానికి కారణం ఏంటో ఆమె సోషల్ మీడియాలో చెప్పుకొచ్చింది.
థియేటర్ వద్ద రచ్చ..
‘జవాన్’ రిలీజ్ అయిన ప్రతీ థియేటర్ దగ్గర ఒక పండగ వాతావరణం కనిపిస్తోంది. కానీ ఒక థియేటర్ దగ్గర మాత్రం ప్రేక్షకులు అసహనంతో కనిపించారు. ముఖ్యంగా అందులో ఒక మహిళ మాత్రం టికెట్ డబ్బులు తిరిగి ఇచ్చేయాలి అంటూ గొడవపడడం మొదలుపెట్టింది. ఎందుకని ప్రశ్నించగా అసలు విషయం బయటపెట్టింది. తను ‘జవాన్’ చూడడానికి వెళ్లిన థియేటర్‌లో మ్యానేజ్మెంట్ ఫస్ట్ హాఫ్‌కు బదులుగా సెకండ్ హాఫ్‌ను ప్రసారం చేసిందని వాపోయింది. ఇంటర్వెల్ సమయానికి విలన్ కథ పూర్తవ్వడంతో అసలు సెకండ్ హాఫ్‌లో ఇంక సినిమా ఏముంటుంది అని ఆడియన్స్ ఆశ్చర్యపోయారట. కాసేపటి తర్వాత వారికి అర్థమయ్యింది ఏంటంటే అప్పటివరకు యాజమాన్యం స్క్రీనింగ్ చేసింది ‘జవాన్’ ఫస్ట్ హాఫ్ కాదని, సెకండ్ హాఫ్ అని. దీంతో థియేటర్ దగ్గర రచ్చ మొదలయ్యింది.
షారుఖ్‌ను కూడా ట్యాగ్..
ఆ గొడవను అదుపు చేయడానికి థియేటర్ యాజమాన్యం.. ప్రేక్షకులు అడిగినట్టుగా టికెట్ డబ్బులు రిటర్న్ ఇచ్చేయడంతో పాటు వారికోసం మరో ‘జవాన్’ షో కోసం టికెట్లు ఏర్పాటు చేసింది. సోషల్ మీడియాలో కూడా ఒక ప్రేక్షకురాలు ఈ సంఘటన గురించి చెప్పుకొచ్చింది. ‘ట్రోల్ అయిపోయింది మొత్తం. చాలా ఏళ్ల తర్వాత నేను షారుఖ్ ఖాన్ సినిమాను థియేటర్‌లో చూడడానికి వెళ్లినప్పుడు ఏం జరిగిందో ఈ వీడియో చూసి తెలుసుకోండి’ అంటూ మొత్తం వీడియోను షేర్ చేసింది. కేవలం ఒక టికెట్ మాత్రమే కాదు.. ప్రేక్షకులందరి టికెట్స్‌ను రిఫండ్ చేయాలని థియేటర్ యాజమాన్యాన్ని ట్యాగ్ చేసింది. అంతే కాకుండా మీ ఫ్యాన్స్‌కు ఏమైందో చూడండి అంటూ షారుఖ్‌ను కూడా ఈ పోస్ట్‌లో ట్యాగ్ చేసింది ఆ మహిళ. అయితే, ఈ ఘటన లండన్‌లో చోటుచేసుకున్నట్లు సమాచారం.
రూ.300 కోట్ల క్లబ్‌లో..
మామూలుగా పెద్ద హీరోల సినిమాలు విడుదలయినప్పుడు ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు జరిగినా.. ‘జవాన్’ మూవీకి వస్తున్న రెస్పాన్స్ వల్ల ఇలాంటి విషయాలను ప్రేక్షకులు పట్టించుకోవడం లేదు. ఈ మూవీ విడుదలయ్యి కేవలం అయిదేళ్లు మాత్రమే అయినా.. అప్పుడే రూ.300 కోట్ల క్లబ్‌లో చేరిపోయింది. ‘జవాన్’లో షారుఖ్‌కు జోడీగా నయనతార నటించగా.. విజయ్ సేతుపతి విలన్ రోల్‌లో కనిపించాడు. సంజయ్ దత్, దీపికా పదుకొనె లాంటి స్టార్లు గెస్ట్ రోల్స్‌లో నటించారు. సాన్య మల్హోత్రా, ప్రియమణి, రిధి డోగ్రా వంటి భామలు.. కథలో కీలకంగా నిలిచే పాత్రల్లో కనిపించారు.
Also Read: మహేష్ బాబుకు బాకీ ఉన్నా, త్వరలోనే రుణం తీర్చుకుంటా - ఎస్ జే సూర్య
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial