Family Star First Review: 'ఫ్యామిలీ స్టార్' ఫస్ట్ రివ్యూస్ వచ్చేశాయ్ - 'దిల్' రాజు భార్య, హీరో ఫాదర్ సినిమా చూసి ఏమన్నారంటే?
Family Star Movie Review: విజయ్ దేవరకొండ హీరోగా పరశురామ్ దర్శకత్వంలో 'దిల్' రాజు ప్రొడ్యూస్ చేసిన 'ఫ్యామిలీ స్టార్' సినిమా ఫస్ట్ రివ్యూస్ వచ్చేశాయి. మరి, మూవీ ఎలా ఉందో తెలుసుకోండి.
Vijay Devarakonda's Family Star Movie Review: 'ది' విజయ్ దేవరకొండ హీరోగా నటించిన సినిమా 'ఫ్యామిలీ స్టార్'. 'గీత గోవిందం' తర్వాత ఆయనతో దర్శకుడు పరశురామ్ చేసిన చిత్రమిది. కుటుంబ కథా చిత్రాలకు పెట్టింది పేరైన ప్రముఖ నిర్మాత 'దిల్' రాజు, ఆయన సోదరుడు శిరీష్ ప్రొడ్యూస్ చేశారు. అమెరికాలో ఈ రోజు ప్రీమియర్ షోలు పడుతున్నాయి. హైదరాబాద్‌లో మీడియా, ఫ్యామిలీలకు సైతం సినిమా చూపించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే, అంత కంటే ముందు ఒక షో వేశారు. విజయ్ దేవరకొండ, 'దిల్' రాజు ఫ్యామిలీలు సినిమా చూశాయి. మరి, వాళ్ల నుంచి వచ్చిన ఫస్ట్ రివ్యూ ఏంటో తెలుసా?
కొట్టేశారండీ... 'దిల్' రాజు భార్య రివ్యూ!
Family Star movie premiere show report: 'ఫ్యామిలీ స్టార్' సినిమా చూశాక... తన భార్య తేజశ్విని 'కొట్టేశారండీ' అని కాంప్లిమెంట్ ఇచ్చినట్లు నిర్మాత 'దిల్' రాజు తెలిపారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి ఆమె వచ్చిందని, ఆమె జడ్జ్‌మెంట్ పర్ఫెక్ట్ ఉంటుందని ఆయన పేర్కొన్నారు. క్రెడిబుల్ రివ్యూ ఇస్తుందని చెప్పుకొచ్చారు.
Dil Raju daughter Hanshitha Reddy reviews Family Star: 'దిల్' రాజు కుమార్తె, 'బలగం' నిర్మాతలలో ఒకరైన హన్షిత రెడ్డి సినిమా చూశారు. 'విజయ్ దేవరకొండ కిల్డ్ ఇట్' (హీరో కుమ్మేశాడు) అంటూ తనను హన్షిత హాగ్ చేసుకుందని 'దిల్' రాజు తెలిపారు. ఇటువంటి సినిమా వచ్చి చాలా రోజులు అయ్యిందంటూ దర్శకుడికి ఫోన్ చేసి మాట్లాడిందని ఆయన గుర్తు చేసుకున్నారు.
Also Read: విజయ్ దేవరకొండది బలుపా... పొగరా? కాన్ఫిడెన్సా? ఆయన బిహేవియర్ మీద డీటెయిల్డ్ అనాలసిస్
'దిల్' రాజు బయోపిక్... హీరో తండ్రి!
'ఫ్యామిలీ స్టార్' సినిమాలో చాలా సన్నివేశాలు తన జీవితంలో జరిగాయని విజయ్ దేవరకొండ, పరశురామ్ తెలిపారు. 'పెళ్లి చూపులు' ముందు వరకు తన బండిలో పెట్రోల్ మీటర్ చూస్తే ముల్లు రెడ్ కలర్ దాటలేదని విజయ్ తెలిపారు. ఎప్పుడైనా తాను రెండు మూడు వందల రూపాయల పెట్రోల్ కొట్టిస్తే పది రోజులు మనల్ని ఎవడూ ఏమీ చేయలేడనే ఫీలింగ్ ఉండేదని పరశురామ్ చెప్పారు. మిడిల్ ఫ్యామిలీ పర్సన్స్ తమ బయోపిక్ అనుకుంటారని యూనిట్ అంటోంది.
విజయ్ దేవరకొండ తండ్రి గోవర్ధన్ సినిమా చూసి 'దిల్' రాజు బయోపిక్‌లా ఉందని చెప్పారట. ఆ విషయం 'దిల్' రాజే చెప్పారు. విజయ్ దేవరకొండ తమ్ముడు, యంగ్ హీరో ఆనంద్ దేవరకొండకు 'ఫ్యామిలీ స్టార్'లో ఎంటర్టైన్మెంట్ చాలా నచ్చిందని ఆయన చెప్పారు. 'ఫ్యామిలీ స్టార్'లో హీరో హీరోయిన్ల క్యారెక్టరైజేషన్స్ గురించి కొన్ని సంవత్సరాలు మాట్లాడుకుంటారని దర్శకుడు పరశురామ్ చెప్పారు.
Also Read: 'ఫ్యామిలీ స్టార్' సెన్సార్ రిపోర్ట్ - ఆ నాలుగు డైలాగులూ మ్యూట్!
'ఫ్యామిలీ స్టార్' సినిమాలో విజయ్ దేవరకొండ సరసన 'సీతా రామం', 'హాయ్ నాన్న' ఫేమ్ మృణాల్ ఠాకూర్ నటించారు. 'గీత గోవిందం' చిత్రానికి చార్ట్ బస్టర్ ఆల్బమ్ ఇచ్చిన గోపీసుందర్ మరోసారి ఆ మేజిక్ రిపీట్ చేశారు. అమెరికాలో విజయ్ దేవరకొండ బిగ్గెస్ట్ రిలీజ్ 'ఫ్యామిలీ స్టార్' అని చెప్పాలి. సినిమాపై భారీ అంచనాలు ఉండటంతో అడ్వాన్స్ బుకింగ్స్ బావున్నాయి. కలెక్షన్స్ భారీగా వచ్చే అవకాశాలు ఉన్నాయి.