అన్వేషించండి

Pushpa 3 The Rampage: 'పుష్ప 3'లో విలన్ ఎవరు... షెకావత్తా, ప్రతాప్ రెడ్డా? పుష్పరాజ్ ఢీ కొట్టేది ఎవర్ని?

Pushpa 3 Antagonist: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులకు 'పుష్ప 2' మాంచి కిక్ ఇచ్చింది. కామన్ ఆడియన్స్‌కు సినిమా నచ్చింది. ఇప్పుడు 'పుష్ప 3' గురించి డిస్కషన్ మొదలైంది. అందులో విలన్ ఎవరు?

Allu Arjun's Pushpa 3 Villain?: విలన్ ఎంత పవర్ ఫుల్ అయితే హీరోయిజం అంత బాగా ఎలివేట్ అవుతుందని దర్శక రచయితలు నమ్మే సూత్రం. దర్శక ధీరుడు రాజమౌళికి ముందు, వెనుక ఎంతో మంది తీసిన సినిమాల్లో ఆ ఫార్ములా ఫాలో అయ్యారు. పూరి జగన్నాథ్ వంటి దర్శకులు 'బిజినెస్‌మేన్' వంటి సినిమాల్లో విలనిజం లేకుండా హీరోయిజం ఎలివేట్ చేశారు. ఇప్పుడు 'పుష్ప 2'లో క్రియేటివ్ జీనియస్, లెక్కల మాస్టారు సుకుమార్ కూడా అంతే! కానీ, ఈ సినిమా విడుదలైన వెంటనే సీక్వెల్ విలన్ గురించి డిస్కషన్ మొదలయ్యేలా చేశారు. 

'పుష్ప 3'లో విలన్ ఎవరు? ఇద్దరిలో మెయిన్ ఎవరు?
Who is antagonist in Pushpa 3 The Rampage?: 'పుష్ప 2: ది రూల్'లో పుష్పరాజ్ రూలింగ్‌కు, అతనికి ఎదురే లేదన్నట్టు చూపించారు. 'పుష్ప 2'లో అల్లు అర్జున్, ఫహాద్ ఫాజిల్ మధ్య బలమైన సన్నివేశాలు ఉంటాయని భావించారు. పుష్పకు భన్వర్ సింగ్ షెకావత్ గట్టి పోటీ ఇస్తాడని అనుకున్నారు. కానీ, అటువంటి సీన్లు సినిమాలో లేవు. 

ఇప్పుడు ప్రేక్షకులు అందరూ మాట్లాడుతున్న గంగమ్మ జాతరలో గానీ, క్లైమాక్స్ ముందు వచ్చే కోట ఫైటులో గానీ భన్వర్ సింగ్ షెకావత్ లేరు. కానీ, హీరోయిజం ఒక రేంజ్‌లో వర్కవుట్ అయ్యింది. అసలు ఇప్పుడు 'పుష్ప 2'లో విలన్ ఎవరు? అనేది డిస్కషన్ పాయింట్ కాదు. ఆ మాటకు వస్తే... విలన్ గురించి ఎవరూ ఆలోచించడం లేదు. కానీ, 'పుష్ప 3'లో విలన్ గురించి డిస్కషన్ మొదలైంది.

'పుష్ప 2'లో దర్శకుడు సుకుమార్ ఇంట్రడ్యూస్ చేసిన కొత్త క్యారెక్టర్ ప్రతాప్ రెడ్డి. అందులో జగపతి బాబు నటించారు. ఆయన తమ్ముడిగా ఆదిత్య మీనన్, తమ్ముడి కుమారుడిగా తారక్ పొన్నప్ప నటించారు. సినిమాలో వాళ్ళ క్యారెక్టర్లు ఏమిటి?  వాళ్ళు ఏం చేశారు? అనేది ఇప్పుడు చెప్పడం భావ్యం కాదు. కానీ, సినిమా చివరకు వచ్చేసరికి పుష్ప రాజ్, ప్రతాప్ రెడ్డి మధ్య సత్సంబంధాలు ఉండవు. ఇద్దరి మధ్య చెడుతుంది. దాంతో 'పుష్ప 2'లో మెయిన్ విలన్ ఎవరు అవుతారు? షెకావత్తా? ప్రతాప్ రెడ్డా? అనే డిస్కషన్ మొదలైంది. లేదంటే ఇద్దరితో పాటు 'పుష్ప 2'లో చివరలో వచ్చిన జాలి రెడ్డి (డాలీ ధనుంజయ) అవుతారా? అనేది చూడాలి. 

Also Read: సుక్కూ... ఈ ప్రశ్నలకు సమాధానాలు ఎక్కడ? 'పుష్ప 3'లో చూసుకో అంటావా?


జగపతి బాబుకు మెమరబుల్ రోల్స్ ఇచ్చిన సుక్కు
జగపతి బాబు మీద సుకుమార్ ప్రత్యేక అభిమానం చూపిస్తారు. సీనియర్ హీరో కోసం ఆయన స్పెషల్ రోల్స్ డిజైన్ చేస్తుంటారు. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ 'నాన్నకు ప్రేమతో' కావచ్చు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 'రంగస్థలం' కావచ్చు... సుక్కు దర్శకత్వంలో జగపతి బాబు ఇంతకు ముందు డిఫరెంట్ విలన్ రోల్స్ చేశారు. 'పుష్ప 2'లో జగపతి బాబు స్క్రీన్ టైమ్ తక్కువ అయినా సరే ఆయన లుక్ నుంచి యాక్టింగ్ వరకు కొత్తగా ఉన్నాయి. నటుడిగా ఆయన ప్రయాణంలో ఇది మరొక మైలురాయి అనుకోవచ్చు. పార్ట్ 3లో జగపతి బాబు రోల్ ఉండబోతుందో? మనం వెయిట్ చేయాల్సిందే.

Also Read‘పుష్ప 2’ జాతర ఎపిసోడ్‌కు సౌదీ అరేబియా సెన్సార్ - కర్ణాటకలోనూ కోలుకోలేని షాక్... విషయం ఏమిటంటే?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్‌ను అరెస్టు చేయొద్దు- విచారణకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్
ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్‌ను అరెస్టు చేయొద్దు- విచారణకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్
Vijay Sai Reddy News: కాకినాడ సెజ్‌, పోర్టు అక్రమాల కేసులో కీలక అప్‌డేట్- ముగ్గురిపై ఏపీ సీఐడీ లుక్‌ అవుట్‌ నోటీసులు
కాకినాడ సెజ్‌, పోర్టు అక్రమాల కేసులో కీలక అప్‌డేట్- ముగ్గురిపై ఏపీ సీఐడీ లుక్‌ అవుట్‌ నోటీసులు
Padi Kaushik Reddy Arrest: పోలీసులను దూషించిన కేసులో కౌశిక్ రెడ్డి అరెస్టు
పోలీసులను దూషించిన కేసులో కౌశిక్ రెడ్డి అరెస్టు
Harish Rao Arrest : మాజీ మంత్రి హరీష్ రావు అరెస్టు-కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్తున్న బీఆర్‌ఎస్‌ నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు
మాజీ మంత్రి హరీష్ రావు అరెస్టు-కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్తున్న బీఆర్‌ఎస్‌ నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Naga Chaitanya Sobhita dhulipala wedding Photos | వివాహ బంధంతో ఒక్కటైన నాగచైతన్య శోభితా | ABP DesamAllu Arjun Sandhya Theatre Pushpa 2 | పుష్ప 2 ప్రీమియర్ కోసం సంధ్యా థియేటర్ కు బన్నీ | ABP DesamShinde Suspense in Maharastra | మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవిస్ ఖరారు..కానీ | ABP Desamగోల్డెన్ టెంపుల్‌లో కాల్పుల కలకలం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్‌ను అరెస్టు చేయొద్దు- విచారణకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్
ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్‌ను అరెస్టు చేయొద్దు- విచారణకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్
Vijay Sai Reddy News: కాకినాడ సెజ్‌, పోర్టు అక్రమాల కేసులో కీలక అప్‌డేట్- ముగ్గురిపై ఏపీ సీఐడీ లుక్‌ అవుట్‌ నోటీసులు
కాకినాడ సెజ్‌, పోర్టు అక్రమాల కేసులో కీలక అప్‌డేట్- ముగ్గురిపై ఏపీ సీఐడీ లుక్‌ అవుట్‌ నోటీసులు
Padi Kaushik Reddy Arrest: పోలీసులను దూషించిన కేసులో కౌశిక్ రెడ్డి అరెస్టు
పోలీసులను దూషించిన కేసులో కౌశిక్ రెడ్డి అరెస్టు
Harish Rao Arrest : మాజీ మంత్రి హరీష్ రావు అరెస్టు-కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్తున్న బీఆర్‌ఎస్‌ నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు
మాజీ మంత్రి హరీష్ రావు అరెస్టు-కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్తున్న బీఆర్‌ఎస్‌ నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు
Uber: టైమ్‌కు రాలేదని ఉబెర్‌ను కోర్టుకు లాగిన కస్టమర్ - అంతేనా రూ.54వేల పరిహారం కూడా పొందాడు !
టైమ్‌కు రాలేదని ఉబెర్‌ను కోర్టుకు లాగిన కస్టమర్ - అంతేనా రూ.54వేల పరిహారం కూడా పొందాడు !
Pushpa 2: సుక్కూ... ఈ ప్రశ్నలకు సమాధానాలు ఎక్కడ? 'పుష్ప 3'లో చూసుకో అంటావా?
సుక్కూ... ఈ ప్రశ్నలకు సమాధానాలు ఎక్కడ? 'పుష్ప 3'లో చూసుకో అంటావా?
Vajedu SI Harish Suicide Case: వాజేడు ఎస్సై హరీశ్‌ ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్- పోలీసుల అదుపులో యువతి
వాజేడు ఎస్సై హరీశ్‌ ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్- పోలీసుల అదుపులో యువతి
Yaganti Kshetram News Today: పందెం గెలిచాడు - ప్రాణం పోగొట్టుకున్నాడ-యాగంటి క్షేత్రంలో విషాదం
పందెం గెలిచాడు - ప్రాణం పోగొట్టుకున్నాడ-యాగంటి క్షేత్రంలో విషాదం
Embed widget