అన్వేషించండి

Fahadh Faasil: ‘పుష్ప’ నన్ను ఎక్కడికో తీసుకెళ్తుందని అనుకోవడం లేదు, నా బలం మలయాళం సినిమా - ఫాహద్ ఫాజిల్

Fahadh Faasil: ‘పుష్ప’లో ఎస్పీ పాత్రలో నటించాడు మలయాళం యాక్టర్ ఫాహద్ ఫాజిల్. ఇది టాలీవుడ్‌లో తన డెబ్యూ మూవీ అయినా దీని వల్ల తన కెరీర్ మలుపు తిరుగుతుందని తాను నమ్మడం లేదని స్టేట్‌మెంట్ ఇచ్చాడు ఫాహద్.

Fahadh Faasil About Pushpa: అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘పుష్ప’.. అందులో నటించిన యాక్టర్స్ కెరీర్లను మలుపు తిప్పింది. అందరినీ ప్యాన్ ఇండియా యాక్టర్స్‌ను చేసింది. దేశవ్యాప్తంగా ఈ మూవీ, ఇందులోని సాంగ్స్ ఓ రేంజ్‌లో హిట్ అవ్వడంతో ‘పుష్ప 2’ కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. అయితే ‘పుష్ప 1’ కోసం మలయాళంలో స్టార్ హీరో అయిన ఫాహద్ ఫాజిల్‌ను రంగంలోకి దించారు సుకుమార్. కానీ అందులో తను చేసిన పాత్ర వల్ల తనకు ఏమీ లాభం కలగలేదని ఓపెన్‌గా షాకింగ్ స్టేట్‌మెంట్ ఇచ్చాడు ఫాహద్ ఫాజిల్.

చిన్న రోల్..

ఫాహద్ ఫాజిల్.. మలయాళంలో ఒక బ్రాండ్‌ను క్రియేట్ చేసుకున్నాడు. తను నటిస్తే చాలు.. సినిమా హిట్ అనుకునే మేకర్స్ కూడా ఉన్నారు. అలాంటి యాక్టర్‌ను ‘పుష్ఫ’ కోసం తెలుగులోకి తీసుకొచ్చాడు సుకుమార్. అందులో ఎస్పీ భన్వర్ సింగ్ షెకావత్‌గా లాస్ట్‌లో ఎంట్రీ ఇచ్చి అలరించాడు ఫాహద్. కానీ తన యాక్టింగ్‌కు స్కోప్ ఇచ్చే సీన్ మూవీలో లేదు. అంతే కాకుండా తన పాత్రకు కూడా ఎక్కువ నిడివి లేదు. దీంతో ఫాహద్ తెలుగు ఫ్యాన్స్ అంతా ఈ విషయంలో డిసప్పాయింట్ అయ్యారు. అయితే ‘పుష్ప 2’లో మాత్రం ఫాహద్ రోల్ చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని సుకుమార్ మాటిచ్చారు. తాజాగా ‘పుష్ప’లో తన రోల్‌పై ఫాహద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

అభిమానంతో మాత్రమే..

‘‘పుష్ప వల్ల నాకు ఏదో మంచి జరిగిందని నేను అనుకోవడం లేదు. సుకుమార్‌కు కూడా అదే చెప్తాను. ఇందులో దాచిపెట్టాల్సింది ఏమీ లేదు. నేను నిజాయితీగా ఉండాలి. నేను ఇక్కడ నాకు నచ్చిన పని చేస్తున్నాను. దేనిని తక్కువ చేసి చూడడం లేదు. పుష్ప తర్వాత ప్రేక్షకులు నా నుండి ఎలాంటి మ్యాజిక్ ఆశించడం లేదు. అది సుకుమార్‌పై ఉన్న అభిమానంతో చేసింది మాత్రమే. నా బలం మలయాళం సినిమాలోనే ఉంది. అది చాలా స్పష్టంగా తెలుస్తోంది కూడా. అదే నాకు చాలా ఎగ్జైట్మెంట్ ఇస్తుంది. ‘పుష్ప’ అనేది నన్ను ఎక్కడికో తీసుకెళ్తుంది అని నేను అనుకోవడం లేదు, నమ్మడం లేదు’’ అని ఓపెన్‌గా చెప్పేశాడు ఫాహద్ ఫాజిల్.

ముఖ్యం కాదు..

ఫాహద్ ఫాజిల్‌ను తన ఫ్యాన్స్ అంతా పాన్ ఇండియా స్టార్ అంటుంటారు. తన సినిమాలు కేవలం మలయాళంలో విడుదలయినా కూడా సౌత్ ప్రేక్షకులు మొత్తాన్ని తన యాక్టింగ్‌తో ఆకట్టుకున్నాడు ఫాహద్. దీనిపై ఈ హీరో స్పందించాడు. ‘‘నేను కేవలం యాక్టర్‌ను మాత్రమే. పాన్ ఇండియా లాంటి ట్యాగ్స్‌తో నాకు సంబంధం లేదు. నేను నమ్మిన పనిని చేసుకుంటూ వెళ్లిపోతాను. నా సినిమా మంచి బిజినెస్ చేస్తుందా లేదా అన్నది కూడా నాకు ముఖ్యం కాదు. నేను ఇక్కడ చేస్తున్న సినిమాలను ఇంకా ఎక్కడా చేయలేను. తమిళ, హిందీలో నేను సినిమాలు చేయాలనుకుంటే కచ్చితంగా ఇలా మాత్రం ఉండదు’’ అని చెప్పుకొచ్చాడు ఫాహద్ ఫాజిల్.

Also Read: ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని అనుకున్నాను, చాలా డిసప్పాయింట్ అయ్యాను - రాజ్ తరుణ్

టాప్ హెడ్ లైన్స్

Manjusha Mukkavilli : మా ఇంటి బంగారంలో సమంత బెస్ట్ ఫ్రెండ్ - అసలెవరీ మంజూష?... రీల్స్ To మూవీస్
మా ఇంటి బంగారంలో సమంత బెస్ట్ ఫ్రెండ్ - అసలెవరీ మంజూష?... రీల్స్ To మూవీస్
Kayadu Lohar : సోషల్ మీడియాకు బ్రేక్ - యంగ్ హీరోయిన్ డెసిషన్... అసలు రీజన్ ఏంటంటే?
సోషల్ మీడియాకు బ్రేక్ - యంగ్ హీరోయిన్ డెసిషన్... అసలు రీజన్ ఏంటంటే?
Allu Arjun : ఆన్ లైన్ కాదు... డైరెక్ట్‌గా హాజరు రావాల్సిందే - అల్లు అర్జున్‌కు కోర్టు ఆర్డర్
ఆన్ లైన్ కాదు... డైరెక్ట్‌గా హాజరు రావాల్సిందే - అల్లు అర్జున్‌కు కోర్టు ఆర్డర్
Balan The Boy Review - 'బాలన్ ది బాయ్' రివ్యూ: 'మంజుమ్మేల్ బాయ్స్' దర్శకుడి కొత్త సినిమా - మలయాళం మూవీ ఎలా ఉందంటే?
'బాలన్ ది బాయ్' రివ్యూ: 'మంజుమ్మేల్ బాయ్స్' దర్శకుడి కొత్త సినిమా - మలయాళం మూవీ ఎలా ఉందంటే?

వీడియోలు

India vs Afghanistan 3rd ODI | చెన్నై వన్డేలో భారత్ క్లీన్ స్వీప్ ఖాయమా?
Shreyanka Patil Ruled Out World Cup | వరల్డ్ కప్ నుండి శ్రేయాంక పాటిల్ అవుట్
Yuvraj Singh as Delhi Capitals Coach IPL 2027 | ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్‌గా యువరాజ్ సింగ్
Chandrababu With Baba Ramdev | ఉండవల్లిలో బాబా రామ్‌దేవ్‌తో సీఎం చంద్రబాబు
Godavari Heroine Anumita Dutta Life Story | గోదావరి సీరియల్ హీరోయిన్ జాను బ్యాక్‌గ్రౌండ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Latest News:
"కాంగ్రెస్ నేతల కాలర్ పట్టుకోండి - ఆత్మహత్యలు చేసుకోవద్దు" రైతులకు కేటీఆర్ సూచన! 
Allu Arjun : ఆన్ లైన్ కాదు... డైరెక్ట్‌గా హాజరు రావాల్సిందే - అల్లు అర్జున్‌కు కోర్టు ఆర్డర్
ఆన్ లైన్ కాదు... డైరెక్ట్‌గా హాజరు రావాల్సిందే - అల్లు అర్జున్‌కు కోర్టు ఆర్డర్
IND vs AFG 3rd ODI Records: రోహిత్ శర్మ, ప్రసిద్ధ్ కృష్ణ కాంబో హ్యాట్రిక్ వికెట్లు, అఫ్గాన్‌తో 3వ వన్డేలో అరుదైన రికార్డ్
రోహిత్ శర్మ, ప్రసిద్ధ్ కృష్ణ కాంబో హ్యాట్రిక్ వికెట్లు, అఫ్గాన్‌తో 3వ వన్డేలో అరుదైన రికార్డ్
Anantapur Temple Hundi Note Viral: అత్తను లేపేయాలని దేవుడికి రూ.20 సుపారీ ఇచ్చారు - కోడలా? అల్లుడా?
అత్తను లేపేయాలని దేవుడికి రూ.20 సుపారీ ఇచ్చారు - కోడలా? అల్లుడా?
IRCTC Booking: ఇండియన్ రైల్వేస్ జ్ఞాపకాల ప్రయాణం.. పట్టాలపై సాగే ప్రయాణం భావోద్వేగాల హరివిల్లు
ఇండియన్ రైల్వేస్ జ్ఞాపకాల ప్రయాణం.. పట్టాలపై సాగే ప్రయాణం భావోద్వేగాల హరివిల్లు
NEET Re-Exam 2026: నాగపూర్ విద్యార్థికి అబుదాబిలో సెంటర్‌! నీట్ రీ ఎగ్జామ్‌కు ముందు ఎన్‌టిఎ నిర్లక్ష్యం!
నాగపూర్ విద్యార్థికి అబుదాబిలో సెంటర్‌! నీట్ రీ ఎగ్జామ్‌కు ముందు ఎన్‌టిఎ నిర్లక్ష్యం!
Breaking News:పోక్సో కేసులో బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌కు బెయిల్ మంజూరు
పోక్సో కేసులో బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌కు బెయిల్ మంజూరు
Sai Krishna Missing Case:కృష్ణలంక స్టేషన్‌లో ఆ రాత్రి ఏం జరిగింది? సాయికృష్ణ కేసులో మిస్టరీ ఛేదించే పనిలో పోలీసులు!
కృష్ణలంక స్టేషన్‌లో ఆ రాత్రి ఏం జరిగింది? సాయికృష్ణ కేసులో మిస్టరీ ఛేదించే పనిలో పోలీసులు!
Embed widget