ఈ సినిమాలో ఫహాద్ ఫాజిల్ సూరి అనే పాత్రలో హైదరాబాద్ లో నివసించే తండ్రిగా నటిస్తున్నారు. ఇది ఆయనకు మొదటి స్ట్రెయిట్ తెలుగు సినిమా.
Don't Trouble The Trouble Teaser - డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ టీజర్ రివ్యూ: నవ్వుల మేజిక్... ఫాంటసీ కథతో ఫహద్ ఫాజిల్ సినిమా
Don't Trouble The Trouble Teaser Review: హీరోగా ఫహాద్ ఫాజిల్ స్ట్రెయిట్ తెలుగు సినిమా 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్'. నిర్మాతగా రాజమౌళి తనయుడు ఎస్ఎస్ కార్తికేయ తొలి చిత్రమిది. టీజర్ విడుదల చేశారు.

- ఫహాద్ ఫాజిల్ 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్'తో తెలుగులో అరంగేట్రం చేస్తున్నారు.
- టీజర్ విడుదల, అద్భుత శక్తులున్న పాపతో తండ్రి ఫాంటసీ కథ.
- శశాంక్ యేలేటి దర్శకత్వంలో సెప్టెంబర్ 11న చిత్రం విడుదల కానుంది.
- అర్కా మీడియావర్క్స్, ఎస్ఎస్ కార్తికేయ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
మలయాళ స్టార్, పాన్ ఇండియా ప్రేక్షకులకు సుపరిచితుడైన కథానాయకుడు ఫహాద్ ఫాజిల్ (Fahadh Faasil). ఆయన హీరోగా నటించిన మలయాళ సినిమాలను చూసిన తెలుగు ప్రేక్షకులు ఎంతో మంది. 'పుష్ప' సిరీస్‌లో భన్వర్ సింగ్ షెకావత్ పాత్రలో మెప్పించారు. ఇప్పుడు హీరోగా స్ట్రెయిట్ తెలుగు సినిమా 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్'తో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యారు ఫహాద్ ఫాజిల్. ఆ సినిమా టీజర్ విడుదల చేశారు.
నవ్వులే మేజిక్... ఫాంటసీ కథ!
Don't Trouble The Trouble Teaser Review Telugu: 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' టీజర్ చూస్తే... స్టోరీలో మెయిన్ పాయింట్ ఏమిటి? అనేది ఈజీగా అర్థం అవుతుంది. హైదరాబాద్ సిటీలోని ఓ చిన్న ఇంటిలో తన పాపతో కలిసి సూరి (ఫహాద్ ఫాజిల్) నివసిస్తుంటాడు. అయితే... అల్లావుద్దీన్ దీపంలో నుంచి జీనీ బయటకు వచ్చినప్పుడు, ఓ చిన్నారిలో నుంచి అతీంద్రీయ శక్తులు బయటకు వస్తాయి. అవి చూసి హీరో భయపడతాడు. ఆ తర్వాత ఏమైంది? అనేది సినిమా కథ.
'ఓం ఫట్... ఫటా ఫట్... పాని పట్... అలియా భట్' అంటూ 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' టీజర్‌లో మొదటి డైలాగ్‌తో ఫహాద్ ఫాజిల్ తన కామెడీ టైమింగ్ ఎలా ఉంటుందో చూపించారు. పాపతో ఆయన సీన్స్ బావున్నాయి. ఫాంటసీ కథతో రూపొందుతున్న ఈ సినిమాపై టీజర్ అంచనాలు క్రియేట్ చేసింది. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.
View this post on Instagram
సెప్టెంబర్ 11న థియేటర్లలోకి సినిమా...
Don't Trouble the Trouble Release Date: 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' సినిమాకు శశాంక్ యేలేటి దర్శకత్వం వహిస్తున్నారు. 'ప్రేమలు'తో పంపిణీదారుగా ఎస్ఎస్ కార్తికేయ భారీ విజయాన్ని అందుకున్నారు. షోయింగ్ బిజినెస్ సంస్థను స్థాపించి నిర్మాతగా మారారు. సెప్టెంబర్ 11న థియేటర్లలోకి తీసుకు వస్తున్నట్టు వెల్లడించారు. తెలుగుతో పాటు మలయాళ, తమిళ భాషల్లో కూడా సినిమా విడుదల కానుంది. ఈ మూడు భాషల్లో టీజర్ విడుదలైంది.
అర్కా మీడియావర్క్స్, షోయింగ్ బిజినెస్ సంస్థలు కలిసి 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 'బాహుబలి' ఫ్రాంచైజీతో ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న ప్రఖ్యాత నిర్మాతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేనిలతో కలిసి ఎస్ఎస్ కార్తికేయ నిర్మిస్తున్న చిత్రమిది.
Before You Go
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Frequently Asked Questions
ఫహాద్ ఫాజిల్ 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' సినిమాలో ఏ పాత్రలో నటిస్తున్నారు?
'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' సినిమా ఏ జానర్ కథాంశంతో తెరకెక్కుతోంది?
ఇది ఒక ఫాంటసీ కథాంశంతో రూపొందించబడిన సినిమా. ఒక చిన్నారిలో అతీంద్రీయ శక్తులు బయటపడటం, వాటిని చూసి హీరో భయపడటం చుట్టూ కథ తిరుగుతుంది.
'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' సినిమా ఎప్పుడు విడుదలవుతుంది? ఏ భాషల్లో వస్తుంది?
ఈ సినిమా సెప్టెంబర్ 11న థియేటర్లలో విడుదల కానుంది. తెలుగుతో పాటు మలయాళ, తమిళ, హిందీ భాషల్లోనూ రిలీజ్ అవుతుంది.
'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' సినిమా నిర్మాతలు ఎవరు?
అర్కా మీడియావర్క్స్, షోయింగ్ బిజినెస్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. శశాంక్ యేలేటి దర్శకత్వం వహిస్తున్నారు.
ట్రెండింగ్ వార్తలు






















