అన్వేషించండి

Lenin Box Office Collection Day 3: లెనిన్ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లు... అయ్యగారి కెరీర్‌లో నంబర్ వన్ - అఖిల్ దూకుడు

Lenin First Weekend Collection: అక్కినేని అఖిల్ కెరీర్ బెస్ట్ కలెక్షన్లు సాధిస్తూ బాక్స్ ఆఫీస్ బరిలో దూసుకు వెళుతోంది 'లెనిన్'. మూడు రోజుల్లో ఈ సినిమా ఎన్ని కోట్లు కలెక్ట్ చేసింది? అనేది చూస్తే... 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • అఖిల్ 'లెనిన్' తొలి వీకెండ్ 37 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.
  • మూడు రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్లు 25.45 కోట్లు చేరాయి.
  • సినిమాకు ఓవర్సీస్, కర్ణాటకల నుండి కూడా మంచి వసూళ్లు.

Akhil Akkineni Lenin Three Days Collection: అక్కినేని అఖిల్ కథానాయకుడిగా నటించిన 'లెనిన్' సినిమా ఆయన కెరీర్ బెస్ట్ కలెక్షన్లు సాధిస్తోంది. బాక్సాఫీస్ బరిలో దూకుడు చూపిస్తూ మొదటి మూడు రోజుల్లో భారీ వసూళ్ళు సాధించింది. ఈ సినిమా కలెక్షన్లు రోజు రోజుకూ పెరుగుతూ ఉండటం గమనార్హం. ఫస్ట్ వీకెండ్ 'లెనిన్' ఎన్ని కోట్లు కలెక్ట్ చేసింది? ఆదివారం ఎన్ని కోట్లు వచ్చాయి? అనేది చూస్తే...

'లెనిన్' ఫస్ట్ వీకెండ్ @ 37 కోట్లు!
Lenin Three Days India Net Collection: 'లెనిన్' కలెక్షన్లు స్టడీగా ఉన్నాయి. ఓపెనింగ్ వీకెండ్ అయితే డైలీ కలెక్షన్లలో గ్రోత్ కనిపించింది. ఫస్ట్ వీకెండ్ 37 కోట్లకు పైగా వసూళ్ళను రాబట్టింది. ఇండియాలో గ్రాస్ ఎంత? ఓవర్సీస్ గ్రాస్ ఎంత? అనేది చూస్తే...

  • థియేటర్లలో 'లెనిన్' విడుదలైన మూడో రోజు (ఆదివారం) ఇండియాలో రూ. 9.65 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించింది. రెండో రోజు కలెక్షన్లు (రూ. 8.65 కోట్ల)తో పోలిస్తే 11.6 శాతం పెరిగాయి.
  • 'లెనిన్'కు మొదటి రోజు (శుక్రవారం) రూ. 7.15 కోట్ల నెట్ వచ్చింది. మూడు రోజులు ముగిసే సరికి ఇండియాలో రూ. 25.45 కోట్ల నెట్ రాబట్టింది. ఇండియా గ్రాస్ చూస్తే... రూ. 29.27 కోట్లు సాధించింది.
  • ఓవర్సీస్ మార్కెట్‌లో ఆదివారం 'లెనిన్'కు 2 కోట్ల గ్రాస్ వచ్చింది. దాంతో ఫస్ట్ వీకెండ్ ఓవర్సీస్ గ్రాస్ రూ. 7.80 కోట్లకు చేరుకుంది.
  • ప్రపంచవ్యాప్తంగా 'లెనిన్' ఓపెనింగ్‌ వీకెండ్ గ్రాస్ రూ. 37.07 కోట్లకు చేరింది.

Also Read: Bandla Ganesh Vs Prakash Raj - దిగజారుతూ ఉండండి... ఏపీ ప్రభుత్వంపై ప్రకాష్ రాజ్ ఫైర్ - బండ్ల గణేష్ స్ట్రాంగ్ కౌంటర్

కర్ణాటకలోనూ 'లెనిన్'కు మంచి కలెక్షన్లు!
రెండు తెలుగు రాష్ట్రాలు... ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 'లెనిన్'కు భారీ కలెక్షన్స్ వస్తున్నాయి. కర్ణాటక నుంచి కూడా చెప్పుకోదగ్గ రీతిలో వసూళ్ళు వస్తుండటం గమనార్హం. ఆదివారం తెలుగు రాష్ట్రాల నుంచి రూ. 9.50 కోట్ల గ్రాస్ రాగా... కర్ణాటక నుంచి రూ. 1.25 కోట్లు, తమిళనాడు నుంచి రూ. 15 లక్షలు, రెస్టాఫ్ ఇండియా నుంచి రూ. 20 లక్షల గ్రాస్ వచ్చింది. థియేటర్లలో ఆదివారం (64.19 శాతం) ఆక్యుపెన్సీ కూడా బావుంది. విశాఖ (84.8 శాతం), వరంగల్ (81 శాతం), హైదరాబాద్ (77.5 శాతం) నగరాల్లో ఎక్కువ ఆక్యుపెన్సీ కనిపించింది. హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి.

Also ReadGautam Ghattamaneni At The Odyssey Premier Mumbai - ముంబైలో మహేష్ తనయుడు... క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' ప్రీమియర్‌లో!

అఖిల్ అక్కినేని సరసన భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించగా... ప్రమోద్ పంజు విలన్ రోల్ చేశారు. రమేష్ ఇందిరా, రాంకీ, సునీల్, బ్రహ్మాజీ, ఈశ్వరి రావు ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు తమన్ అందించిన నేపథ్య సంగీతం, పాటలు ప్లస్ అయ్యాయి. సూర్యదేవర నాగవంశీ, అక్కినేని నాగార్జున నిర్మించిన ఈ సినిమాకు మురళీకిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించారు.

Also ReadVishnu Priya Bhimeneni - సబ్‌స్క్రిప్షన్ రేటు తగ్గించేది లేదు... వెళ్ళి చదువుకోమ్మా - విష్ణుప్రియ కామెంట్స్ వైరల్

Frequently Asked Questions

'లెనిన్' సినిమా మొదటి వారాంతంలో ప్రపంచవ్యాప్తంగా ఎంత వసూలు చేసింది?

'లెనిన్' సినిమా మొదటి వారాంతంలో ప్రపంచవ్యాప్తంగా రూ. 37.07 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఇది అఖిల్ కెరీర్‌లో అత్యుత్తమ కలెక్షన్లలో ఒకటి.

'లెనిన్' మొదటి మూడు రోజుల్లో ఇండియాలో ఎంత నెట్ వసూలు చేసింది?

'లెనిన్' సినిమా మొదటి మూడు రోజుల్లో ఇండియాలో రూ. 25.45 కోట్ల నెట్ వసూలు చేసింది. ఆదివారం కలెక్షన్లు రెండో రోజుతో పోలిస్తే 11.6 శాతం పెరిగాయి.

'లెనిన్' సినిమా ఆదివారం ఏయే ప్రాంతాల నుంచి మంచి వసూళ్లు సాధించింది?

ఆదివారం 'లెనిన్' సినిమాకు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు, మరియు మిగిలిన భారతదేశం నుండి మంచి వసూళ్లు వచ్చాయి. విశాఖ, వరంగల్, హైదరాబాద్‌లలో అధిక ఆక్యుపెన్సీ నమోదైంది.

'లెనిన్' సినిమా మొదటి వారాంతంలో ఓవర్సీస్ మార్కెట్‌లో ఎంత వసూలు చేసింది?

'లెనిన్' సినిమా మొదటి వారాంతంలో ఓవర్సీస్ మార్కెట్ నుండి రూ. 7.80 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఆదివారం ఒక్కరోజే ఓవర్సీస్‌లో 2 కోట్ల గ్రాస్ వచ్చింది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pallaburusu Trailer Review : టూత్ బ్రష్ కోసం కొడుకుపై తండ్రి కేసు - కోర్టు తీర్పు ఏంటి?... పళ్లబురుసు చూడాల్సిందే
టూత్ బ్రష్ కోసం కొడుకుపై తండ్రి కేసు - కోర్టు తీర్పు ఏంటి?... పళ్లబురుసు చూడాల్సిందే
Vishwanath And Sons Story : సరోగేట్ తల్లితో హీరో ఎమోషనల్ లవ్? - సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ స్టోరీ అదేనా?
సరోగేట్ తల్లితో హీరో ఎమోషనల్ లవ్? - సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ స్టోరీ అదేనా?
Dark Comedy Thriller OTT : శవాన్ని కిడ్నాప్ చేసే ఫ్రెండ్స్ - ఓటీటీలోకి వచ్చేసిన డార్క్ కామెడీ డ్రామా... ఎందులో చూడొచ్చంటే?
శవాన్ని కిడ్నాప్ చేసే ఫ్రెండ్స్ - ఓటీటీలోకి వచ్చేసిన డార్క్ కామెడీ డ్రామా... ఎందులో చూడొచ్చంటే?
Korean Kanakaraju Review - కొరియన్ కనకరాజు రివ్యూ: హారర్ కామెడీ నవ్వించిందా? వరుణ్ తేజ్ సినిమా హిట్టా? ఫట్టా?
కొరియన్ కనకరాజు రివ్యూ: హారర్ కామెడీ నవ్వించిందా? వరుణ్ తేజ్ సినిమా హిట్టా? ఫట్టా?
Advertisement

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CBI On NEET Paper Leak: నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
YSRCP Protest On DSC Irregularities: డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ఆందోళనలు!సీబీఐ విచారణకు జగన్ డిమాండ్!
డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ఆందోళనలు!సీబీఐ విచారణకు జగన్ డిమాండ్!
Korean Kanakaraju Review - కొరియన్ కనకరాజు రివ్యూ: హారర్ కామెడీ నవ్వించిందా? వరుణ్ తేజ్ సినిమా హిట్టా? ఫట్టా?
కొరియన్ కనకరాజు రివ్యూ: హారర్ కామెడీ నవ్వించిందా? వరుణ్ తేజ్ సినిమా హిట్టా? ఫట్టా?
Vishwanath And Sons Story : సరోగేట్ తల్లితో హీరో ఎమోషనల్ లవ్? - సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ స్టోరీ అదేనా?
సరోగేట్ తల్లితో హీరో ఎమోషనల్ లవ్? - సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ స్టోరీ అదేనా?
AP NEET MBBS Cutoff Ranks:నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?
నీట్‌లో ఏ ర్యాంకు వస్తే ఏపీలో ఎంబిబిఎస్ సీటు గ్యారంటీ? టాప్‌ కాలేజీల కటాఫ్‌ సంగతేంటీ?
మారుతి గ్రాండ్ విటారా నుంచి బలెనో వరకు సూపర్‌ ఆఫర్లు - రూ.1.55 లక్షల వరకు డిస్కౌంట్
ఇప్పుడు మారుతి కారు కొనేవాళ్లు నక్క తోక తొక్కినట్లే, రూ.లక్షల్లో డిస్కౌంట్లు!
Mohan Bhagwat on Gen-Z: జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
CJP Kya Bolti Public campaign: నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
Embed widget