అన్వేషించండి

Bandla Ganesh Vs Prakash Raj: దిగజారుతూ ఉండండి... ఏపీ ప్రభుత్వంపై ప్రకాష్ రాజ్ ఫైర్ - బండ్ల గణేష్ స్ట్రాంగ్ కౌంటర్

Prakash Raj On Janasena: రావణ్ అరెస్టులో జనసేనపై ప్రకాష్ రాజ్ విమర్శలకు బండ్ల గణేష్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇద్దరి మధ్య సోషల్ మీడియాలో మాటల యుద్ధం మళ్ళీ మొదలైంది.

యూట్యూబర్ 'ప్రశ్న' రావణ్ అలియాస్ జోసెఫ్ బచ్చలకూరి అరెస్ట్ (Prashna Ravan Arrest Latest News) విషయంలో ఏపీ ప్రభుత్వం, మరీ ముఖ్యంగా జనసేనాని పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మీద నటుడు ప్రకాష్ రాజ్ (Prakash Raj) ప్రశ్నలు సంధిస్తూ ఉన్నారు. విమర్శల పర్వం కొనసాగిస్తూ ఉన్నారు. ప్రకాష్ రాజ్ ట్వీట్ చేసిన ప్రతిసారీ నటుడు - నిర్మాత బండ్ల గణేష్ (Bandla Ganesh) స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ వస్తున్నారు. ఆదివారం సోషల్ మీడియా వేదికగా మరోసారి ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. ఒకరిపై మరొకరు చేస్తున్న విమర్శలు ఇటు సినిమా, అటు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. లేటెస్ట్ ట్విట్టర్ వార్ ఏమిటి? అనే అంశంలోకి వెళితే...

ప్రకాష్ రాజ్ భయపడ్డారా?
మీరు దిగజరుతూ ఉండండి!
యూట్యూబర్ రావణ్ అరెస్ట్ మీద ఉపా చట్టం కేసు నమోదు చేయడంపై ప్రకాష్ రాజ్ ముందు నుంచి అభ్యంతరం వ్యక్తం చేస్తూ వీడియోలు చేస్తున్నారు. అయితే, రావణ్ ఫోన్ నుంచి డేటా తీసిన తర్వాత ప్రకాష్ రాజ్ మౌనంగా ఉండటంతో... ఏవో లొసుగులు బయట పడ్డాయని, ఆయన భయపడిపోయారంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేశారు కొందరు. వీటికి సమాధానంగా ఆదివారం ఓ వీడియో విడుదల చేశారు ప్రకాష్ రాజ్. అందులో జనసేనపై, అలాగే ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

Also Read: Maa Inti Bangaram Enters 100 Crore Club - వంద కోట్ల క్లబ్బులో 'మా ఇంటి బంగారం'... అరుదైన రికార్డ్ క్రియేట్ చేసిన సమంత

ఏపీలో కూటమి ప్రభుత్వంపై, ప్రజాప్రతినిధులపై ప్రకాష్ రాజ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. "దిగజారండి... దిగజారండి... దిగజారుతూనే ఉండండి" అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి. తాను మౌనంగా లేనని... ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు కొన్ని మీడియా ఛానళ్ల తీరును గమనిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. సోషల్ మీడియాలో అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ప్రకాష్ రాజ్ తెలిపారు. ఇంకా "ఇది మీ దిగజారుడుతనానికి ఆరంభం మాత్రమే... మీరు ఎంత అరిచినా నాలాంటి ప్రశ్నించే గొంతును ఆపలేరు" అని ఆయన స్పష్టం చేశారు.

Also ReadGautam Ghattamaneni At The Odyssey Premier Mumbai - ముంబైలో మహేష్ తనయుడు... క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' ప్రీమియర్‌లో!

ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలకు బండ్ల గణేష్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ''నీ పని నువ్వు చూసుకో... తెలుగు ప్రజలకు నీ సర్టిఫికెట్లు అవసరం లేదు" అంటూ బండ్ల చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. తెలుగు ప్రజల మనోభావాలకు విరుద్ధంగా ప్రకాష్ రాజ్ చేస్తున్న విమర్శలు ఉన్నాయని ఆయన మండిపడ్డారు. అలాగే... ''పైసా కొట్టు… డైలాగ్ పట్టు! ప్రకాశ్ రాయ్ అలియాస్ ప్రకాష్ రాజ్ ఫ్రమ్: కర్ణాటక'' అంటూ బండ్ల గణేష్ చేసిన సెటైరికల్ ట్వీట్ జనాల దృష్టిని ఆకర్షించింది. అలాగే, ప్రకాష్‌ రాజ్‌ను ఎనీ టైమ్ మనీగా అభివర్ణించారు. అకౌంట్‌లో డబ్బులు పడితే ఆయన స్వరం మారుతుందున్నారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ - ఇద్దరికీ బండ్ల గణేష్ చాలా సన్నిహితుడు. సోషల్ మీడియాలో వాళ్ళకు మద్దతుగా నిలుస్తున్నారు. ప్రకాష్ రాజ్ విమర్శలు చేసిన ప్రతిసారీ కౌంటర్లు ఇస్తూ వస్తున్నారు. 'జస్ట్ అస్కింగ్' అంటూ ప్రకాష్ రాజ్ వస్తుంటే... ఆయనకు బండ్ల గణేష్ ఇచ్చే కౌంటర్లు వైరల్ అవుతున్నాయి.

Also ReadVishnu Priya Bhimeneni - సబ్‌స్క్రిప్షన్ రేటు తగ్గించేది లేదు... వెళ్ళి చదువుకోమ్మా - విష్ణుప్రియ కామెంట్స్ వైరల్

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrababu Naidu Narendra Modi Relation Strategy: మోదీపై చంద్రబాబు అంతులేని పొగడ్తలు - విమర్శలు వచ్చినా తగ్గేదే లే - అసలు కారణం ఇదేనా?
మోదీపై చంద్రబాబు అంతులేని పొగడ్తలు - విమర్శలు వచ్చినా తగ్గేదే లే - అసలు కారణం ఇదేనా?
Amalapuram Latest News: అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో రైతులు తిరుగుబాటు- పంట విరామం ప్రకటించిన తాడికోన అన్నదాతలు! 
అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో రైతులు తిరుగుబాటు- పంట విరామం ప్రకటించిన తాడికోన అన్నదాతలు! 
Andhra Pradesh And Telangana Weather: తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
YSRCP Leaders Legal Troubles: వైఎస్సార్‌సీపీ నేతల వరుస కేసులు, ఆజ్ఞాతం - పొలిటికల్ స్ట్రాటజీనా? దూకుడు వికటించిందా?
వైఎస్సార్‌సీపీ నేతల వరుస కేసులు, ఆజ్ఞాతం - పొలిటికల్ స్ట్రాటజీనా? దూకుడు వికటించిందా?
Advertisement

వీడియోలు

Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ వేటు
India Fielding Coach T Dilip Emotional Post | ఫీల్డింగ్ కోచ్‌గా ముగిసిన దిలీప్ ప్రయాణం
Virat Kohli World Record | వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ
Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Udhayanidhi Arrest: ఉదయనిధి అరెస్టుకు కారణం ఏంటీ? టీవీకే చేసిన ఫిర్యాదులో ఏముంది?
ఉదయనిధి అరెస్టుకు కారణం ఏంటీ? టీవీకే చేసిన ఫిర్యాదులో ఏముంది?
Udhayanidhi Arrest: ఉదయనిధి వివాదంపై మద్రాసు హైకోర్టుకు డీఎంకే! కీలక ఆదేశాలు వచ్చేలోపే అరెస్టు!
ఉదయనిధి వివాదంపై మద్రాసు హైకోర్టుకు డీఎంకే! కీలక ఆదేశాలు వచ్చేలోపే అరెస్టు!
Indian Politics Instagram Reels Strategy: ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌తో మారిన రాజకీయం - జెన్ జీ ఓటర్ల పల్స్ పట్టుకునేందుకు నాయకుల బిగ్ స్విచ్!
ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌తో మారిన రాజకీయం - జెన్ జీ ఓటర్ల పల్స్ పట్టుకునేందుకు నాయకుల బిగ్ స్విచ్!
Andhra Pradesh And Telangana Weather: తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
High Uric Acid : యూరిక్ యాసిడ్ పెరగడానికి కారణాలివే.. సమస్యను తగ్గించుకోవాలంటే ఈ ఫుడ్స్ తింటూ ఈ పనులు చేయాలట
యూరిక్ యాసిడ్ పెరగడానికి కారణాలివే.. సమస్యను తగ్గించుకోవాలంటే ఈ ఫుడ్స్ తింటూ ఈ పనులు చేయాలట
బొడ్డు కిందకి చీర కడితే అసభ్యంగా చూడకండి - ఆయుర్వేదం, యోగశాస్త్రంలో ఏముందంటే!
బొడ్డు కిందకి చీర కడితే అసభ్యంగా చూడకండి - ఆయుర్వేదం, యోగశాస్త్రంలో ఏముందంటే!
New Fielding Coach: టీమ్ ఇండియా కొత్త ఫీల్డింగ్ కోచ్ సుభదీప్ ఘోష్.. గంభీర్ వర్క్ మేట్ కు బిసిసిఐ ప్రమోషన్, ఈ మాజీ ప్లేయర్ ట్రాక్ రికార్డ్ తెలుసా!
టీమ్ ఇండియా కొత్త ఫీల్డింగ్ కోచ్ సుభదీప్ ఘోష్.. గంభీర్ వర్క్ మేట్ కు బిసిసిఐ ప్రమోషన్, ఈ మాజీ ప్లేయర్ ట్రాక్ రికార్డ్ తెలుసా!
Amalapuram Latest News: అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో రైతులు తిరుగుబాటు- పంట విరామం ప్రకటించిన తాడికోన అన్నదాతలు! 
అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో రైతులు తిరుగుబాటు- పంట విరామం ప్రకటించిన తాడికోన అన్నదాతలు! 
Embed widget