రణ్ బీర్, సాయి పల్లవి, యశ్ కాంబోలో 'రామాయణం' - 2024లో షూటింగ్ స్టార్ట్
నితీష్ తివారి తెరకెక్కిస్తున్న 'రామాయణం' ప్రాజెక్టులో శ్రీరాముడిగా రణబీర్ కపూర్ సీతగా సాయి పల్లవి రావణుడిగా కేజీఎఫ్ హీరో యశ్ నటిస్తున్నట్లు సమాచారం. ఈ మూవీ కోసం యశ్ జూలై లో డేట్స్ కేటాయించారు.
బాలీవుడ్ ఫిలిం మేకర్ ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన 'ఆదిపురష్' ఈ ఏడాది బాక్స్ ఆఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే. రామాయణం ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించారు. దర్శకుడు ఓం రౌత్ రామాయణ కథకు మోడ్రన్ టచ్ ఇచ్చి అనవసరమైన గ్రాఫిక్స్, వీఎఫెక్స్ వాడి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. దీంతో 'ఆదిపురుష్' దెబ్బకి మళ్లీ ఏ దర్శకుడు రామాయణం జోలికి వెళ్లడేమో అనుకుంటున్న సమయంలో మరోసారి బాలీవుడ్ లో అదే దిశగా అడుగులు పడుతున్నాయి. ఈసారి బాలీవుడ్ గ్రేట్ ఫిలిం మేకర్ నితీష్ తివారి రామాయణాన్ని విజువల్ వండర్ గా తెరకెక్కించబోతున్నారు.
ఈ ప్రాజెక్టు ప్రకటించినప్పుడు ఇందులో ఎవరెవరు నటిస్తున్నారనే అంశంపై సినీ లవర్స్ లో ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే సినిమాలో రాముడిగా రణబీర్ కపూర్, సీతగా ఆలియా భట్ నటిస్తుందని మొదట వార్తలు వినిపించాయి. అంతేకాకుండా 'కేజిఎఫ్' స్టార్ ఎయశ్స్ సైతం ఈ ప్రాజెక్టులో భాగం కాబోతున్నాడని న్యూస్ వచ్చింది. దీంతో ఈ కాంబోలో సినిమా పడితే బ్లాక్ బస్టర్ కాయమంటూ సినీ లవర్స్ ఆనందం వ్యక్తం చేశారు. రాముడి గా రణబీర్ కపూర్ ను జ్ సీతగా అలియా భట్, రావణుడిగా యశ్ ని ఊహించుకున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఆలియా భట్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్టు తెలుస్తోంది.
ఆమె స్థానంలో న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవిని తీసుకున్నారు. రణబీర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతగా నటించబోతున్నట్లు సమాచారం. ఈ క్రమంలోని ప్రీ ప్రొడక్షన్ పనులను వేగవంతం చేసి మరో రెండు నెలల్లో సెట్స్ పైకి తీసుకెళ్లబోతున్నారట. నిజానికి మొదట ఈ ప్రాజెక్టు కోసం సాయి పల్లవిని తీసుకుంటున్నారని వినిపించినప్పటికీ, ఆ తర్వాత ఆలియా పేరు తెరపైకి రావడంతో సాయి పల్లవి ఈ ప్రాజెక్ట్ లో లేనట్లే అని భావించారు. కానీ ఇప్పుడు అనూహ్యంగా మళ్ళీ సాయి పల్లవి వేరే వినిపించడం ఫాన్స్ లో సంతోషాన్ని నింపింది. రామాయణంలో సీత పాత్రకు సాయి పల్లవి పూర్తిగా న్యాయం చేస్తుందని ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు రావణుడిగా కేజీఎఫ్ హీరో యశ్ పాత్ర పై గత కొద్ది రోజులుగా అనేక సందేహాలు నెలకొన్నాయి. మొదట్లో యశ్ పేరు కన్ఫర్మ్ అయిందని, ఆ తర్వాత ఆయన సినిమా చేస్తారా? లేదా అన్న అనుమానాలు కూడా వ్యక్తం అయ్యాయి. అయితే తాజా సమాచారం ప్రకారం రావణాసురుడిగా నటించేందుకు యశ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. అంతేకాదు ఫస్ట్ పార్ట్ కోసం ఏకంగా 15 రోజులు కాల్ షీట్స్ కూడా కేటాయించాలని రెండో భాగంలో ఎక్కువ డేట్స్ ఇచ్చేలా యశ్ అంగీకారం తెలిపారట. నితీష్ తివారి తెరకెక్కిస్తున్న ఈ రామాయణంలో దశకంఠుడి ఎంట్రీని క్లైమాక్స్ లో చూపించి ఆ తర్వాత తెరకెక్కరున్న సీక్వెల్ లో యశ్ మీద ఎక్కువ కథ నడిచేలా కథను రాసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
మూడు భాగాలుగా రాబోతున్న ఈ సినిమా మొదటి భాగం షూటింగ్ 2024 ఫిబ్రవరి నెలలో ప్రారంభం కానుంది. నితీష్ తివారి ఫస్ట్ పార్ట్ లో ఎక్కువగా శ్రీరాముడు, సీత మధ్య బాండింగ్ పై దృష్టి సారించనున్నారు. ఈ క్రమంలోనే రణబీర్, సాయి పల్లవి 2024 ఫిబ్రవరి నుంచి ఆగస్టు వరకు చిత్రీకరణలో పాల్గొంటారు. ఆ తర్వాత రావణుడి పార్ట్ కి సంబంధించిన షూటింగ్ ఉంటుంది. ఇందుకు యష్ జూలై నుంచి చిత్రీకరణలో పాల్గొననున్నట్లు సమాచారం.
Also Read : రజనీకాంత్ కొత్త మూవీ షూటింగ్ షురూ, ఫుల్ జోష్ లో సూపర్ స్టార్ ఫ్యాన్స్
Join Us on Telegram: https://t.me/abpdesamofficial