Daggubati Abhiram Wedding : దగ్గుబాటి వారి ఇంట పెళ్లి సందడి - శ్రీలంకలో రానా తమ్ముడి వివాహ వేడుకలు, పెళ్లి ఎప్పుడంటే?
Daggubati Abhiram : దగ్గుబాటి రానా తమ్ముడు అభిరామ్ పెళ్లి వేడుకలు డిసెంబర్ 6న శ్రీలంకలో జరగబోతున్నాయి.
Abhiram Daggubati Wedding : టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న మరో అగ్ర కుటుంబంలో పెళ్లి బాజాలు మోగబోతున్నాయి. రీసెంట్ గా మెగా ఫ్యామిలీ ఇంట పెళ్లి వేడుక జరిగిన విషయం తెలిసిందే. మెగా బ్రదర్ నాగబాబు కొడుకు హీరో వరుణ్ తేజ్ ఇటీవల హీరోయిన్ లావణ్య త్రిపాఠిని పెళ్లి చేసుకున్నాడు. ఇక త్వరలోనే దగ్గుబాటి ఫ్యామిలీలో కూడా పెళ్లి వేడుక జరగబోతోంది. ఇండస్ట్రీలో ఉన్న అతిపెద్ద సినిమా ఫ్యామిలీలో దగ్గుపాటి ఫ్యామిలీ కూడా ఒకటి. ఈ ఫ్యామిలీ నుంచి హీరోలే కాదు ప్రొడ్యూసర్లు, దర్శకులు కూడా ఉన్నారు. ఇక దగ్గుబాటి వారసులుగా ఇప్పటి తరంలో దగ్గుబాటి రానా అగ్ర హీరోగా ఉండగా, తాజాగా అతని తమ్ముడు అభిరామ్ కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.
ఇక ఇప్పుడు ఈ యంగ్ హీరో పెళ్లి చేసుకోబోతున్నాడు. అది కూడా ఇండియాలో కాదు శ్రీలంకలో. టాలీవుడ్ సీనియర్ నిర్మాతల్లో ఒకరైన దగ్గుబాటి సురేష్ బాబు చిన్న కొడుకు, హీరో రానా దగ్గుపాటి తమ్ముడైన అభిరామ్ పెళ్లికి ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. డిసెంబర్ 6న అభిరామ్ పెళ్లి వేడుకలకు అంతా సిద్ధమైనట్టు తెలుస్తోంది. అందరూ సెలబ్రిటీస్ లాగానే ఈ హీరో కూడా డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నాడు. డెస్టినేషన్ వెడ్డింగ్ అంటే అందరూ ఫారిన్ లో ప్లాన్ చేస్తారు. కానీ అభిరామ్ మాత్రం తన పెళ్లిని శ్రీలంకలో ప్లాన్ చేయడం గమనార్హం. శ్రీలంకలో ఫైవ్ స్టార్ రిసార్ట్ అయిన అనంతర కలుతారాలో అభిరామ్ పెళ్లి వేడుకలు జరగబోతున్నాయి.
టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం డిసెంబర్ 6 రాత్రి 8 గంటల 50 నిమిషాలకు దగ్గుబాటి అభిరామ్ ప్రత్యూష చపరాల మెడలో మూడు ముళ్ళు వేయబోతున్నాడు. ఈ వేడుకలకు సుమారు 200 మందికి పైగా అతిథులు హాజరబోతున్నట్లు తెలుస్తోంది. ఇరు కుటుంబాల బంధుమిత్రులు సన్నిహితులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు సైతం ఈ పెళ్లిలో సందడి చేయబోతున్నారట. కాగా అభిరామ్ వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు అతిధులు సోమవారం శ్రీలంకలో అడుగుపెట్టనున్నారు. దాదాపు మూడు రోజులపాటు ఈ వేడుకలు జరుపబోతున్నారు. సోమవారం రాత్రి పార్టీతో స్టార్ట్ అయి.. సంగీత్ ఆ తర్వాత మంగళవారం సాయంత్రం మెహేంది వేడుక అనంతరం విందు ఏర్పాటు చేయనున్నారు.
ఇక బుధవారం ఉదయం 10 గంటల 30 నిమిషాలకు పెళ్లికూతురు వేడుక నిర్వహించి అనంతరం సాయంత్రం 7 గంటలకు వివాహ వేడుకలు ప్రారంభమవుతాయని, రాత్రి 8 గంటల 50 నిమిషాలకు సుముహూర్తాన్ని నిర్ణయించారని దగ్గుబాటి సన్నిహిత వర్గాల నుంచి సమాచారం అందుతోంది. పెళ్లి తర్వాత దగ్గుబాటి ఫ్యామిలీ హైదరాబాదులో రిసెప్షన్ ను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ రిసెప్షన్ కు సినీ రాజకీయ ప్రముఖులు పెద్ద ఎత్తున హాజరై అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా తేజ దర్శకత్వంలో వచ్చిన 'అహింస' సినిమాతో అభిరామ్ దగ్గుబాటి హీరోగా పరిచయమయ్యాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయింది.
Also Read : హనీమూన్‌కు వెళ్లిన స్టార్ కపుల్ వరుణ్ తేజ్, లావణ్య
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆*T&C Apply