Anupallavi Serial Raj Kumar: యాక్షన్ కింగ్ అర్జున్ డైరెక్షన్‌లో నటించే ఛాన్స్ కొట్టేసిన ETV 'అనుపల్లవి' సీరియల్ గోపి
Seetha Payanam Movie: యాక్షన్ కింగ్ అర్జున్ డైరెక్షన్ చేస్తున్న లేటెస్ట్ సినిమా సీతా పయనం. ఇందులో ఒక కీలకమైన క్యారెక్టర్ చేసే ఛాన్స్ ఈ టీవీ సీరియల్ అనుపల్లవిలో గోపి సొంతం చేసుకున్నాడు.

యాక్షన్ కింగ్ అర్జున్ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనది కర్ణాటక అయినా సరే తెలుగు తమిళ హిందీ భాషల్లో అభిమానులను సొంతం చేసుకున్నారు. అర్జున్ హీరో మాత్రమే కాదు... నటుడు, నిర్మాత, దర్శకుడు కూడా! ఆయన దర్శకత్వం వహిస్తున్న తాజా సినిమా 'సీతా పయనం'. అందులో కీలకమైన క్యారెక్టర్ చేసే అవకాశం సీరియల్ ఆర్టిస్టుకు వచ్చింది.
'సీతా పయనం' సినిమాలో రాజ్ కుమార్!
ETV Serials: ఈటీవీ సీరియల్ 'అను పల్లవి' (Anupallavi Serial) గుర్తు ఉందా? ప్రజెంట్ ఆ సీరియల్ టెలికాస్ట్ కావడం లేదు. గత ఏడాది (2024) డిసెంబర్ నెలలో శుభం కార్డు వేశారు. అందులో గోపి క్యారెక్టర్ చేసిన చైల్డ్ ఆర్టిస్ట్ రాజ్ కుమార్ (Child Artist Raj Kumar) గుర్తు ఉన్నారా? ఇప్పుడు ఆ అబ్బాయికి అర్జున్ దర్శకత్వంలో 'సీతా పయనం' సినిమాలో నటించే అవకాశం దక్కింది.
View this post on Instagram
'సీతా పయనం' సినిమాలో తాను నటిస్తున్న విషయాన్ని రాజ్ కుమార్ సోషల్ మీడియాలో కన్ఫర్మ్ చేశాడు. అయితే తన క్యారెక్టర్ ఏమిటి అనే విషయాన్ని ప్రస్తుతానికి సస్పెన్స్ లో ఉంచాడు.
అర్జున్, విశ్వక్ సేన్ మధ్య దూరం పెంచిన సినిమా!
'సీతా పయనం' సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్ కుమార్తె, యంగ్ హీరోయిన్ ఐశ్వర్య లీడ్ రోల్ చేస్తున్నారు. మొదట ఈ సినిమాలో హీరోగా మాస్ కా విశ్వక్ సేన్ (Vishwak Sen)ను ఎంపిక చేశారు అర్జున్. కొన్ని రోజులు అతడితో చిత్రీకరణ చేశారు. కొన్ని సన్నివేశాలు కూడా తీశారు. అయితే అర్జున్, విశ్వక్ మధ్య మనస్పర్ధలు వచ్చాయి. చిత్రీకరణకు విశ్వక్ సేన్ సహకరించడం లేదని, సమయానికి రావడం లేదని అర్జున్ ఆరోపించారు. మరొక హీరోని ఎంపిక చేశారు. తన తప్పేమీ లేదన్నట్లు కొన్ని రోజుల తర్వాత విశ్వక్ స్పందించారు. అది పక్కన పెడితే...
'సీతా పయనం' సినిమా ప్రారంభమై చాలా రోజులు అయింది. హీరో సమస్య కొంత అయితే... ఆ తరువాత ఐశ్వర్య అర్జున్ వివాహం జరగడం, అర్జున్ బిజీ కావడం వల్ల చిత్రీకరణ పూర్తి కావడం కాస్త ఆలస్యం అయింది ఇప్పుడు అర్జున్ తన దృష్టి అంతా ఈ సినిమా మీద పెట్టారని త్వరగా పూర్తిచేసే థియేటర్లలోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారని తెలిసింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

