Entertainment Top Stories Today: వీరమల్లు కోసం పవన్, దాస్ & టిల్లుతో ఎన్టీఆర్ ఇంటర్వ్యూ, ఇంకా... నేటి సినీ టాప్ న్యూస్
Entertainment News Today In Telugu: ఎన్టీఆర్, శివతో యంగ్ హీరోస్ చిట్ చాట్ నుంచి పవన్ 'హరిహర వీరమల్లు' అప్డేట్ ఇంకా సూపర్ స్టార్ మీద హిందీ నటి కామెంట్స్ వరకు... ఇవాళ్టి టాప్ ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్!

ఏపీ ఎన్నికలకు కొన్నాళ్ల ముందు నుంచే రాజకీయ వార్తలతో ప్రజల ముందుకు వస్తున్న పవన్ కళ్యాణ్ సినిమాకు సంబంధించిన సాలిడ్ అప్డేట్ ఒకటి ఈ రోజు వచ్చింది. దేవర ప్రచార కార్యక్రమాలతో కొన్ని రోజుల నుంచి ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఎన్టీఆర్ ఇవాళ మరో ఇంటర్వ్యూ తో మన ముందుకు వచ్చారు. సూపర్ స్టార్ మీద బాలీవుడ్ నటి షామా సికిందర్ కామెంట్స్ నుంచి కొరియన్ వెబ్ సిరీస్ క్విట్ కేం టీజర్ వరకు ఇవాల్టి టాప్ ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్ ఏంటో చూడండి
వీరమల్లు చిత్రీకరణకు వస్తున్న జనసేనాని
ప్రస్తుత ఏపీ ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొంత విరామం తర్వాత మళ్లీ ముఖానికి మేకప్ వేసుకోనున్నారు. ఏఎం రత్నం సమర్పణలో తెరకెక్కుతున్న చారిత్రాత్మక సినిమా 'హరిహర వీరమల్లు' చిత్రీకరణలో వచ్చేవారం నుంచి ఆయన పాల్గొంటారు. విజయవాడలో ఈ సినిమా కోసం ప్రత్యేకంగా సెట్స్ వేశారు.
(హరిహర వీరమల్లు చిత్రీకరణలో పవన్ ఎప్పుడు పాల్గొంటారు? ఈ వార్తకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)
ఫ్యాన్ బాయ్స్ దాస్ అండ్ టిల్లుతో దేవర
టాలీవుడ్ ఇండస్ట్రీలో మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులలో యువ హీరోలు విశ్వక్ సేన్, సిద్దు జొన్నలగడ్డ కూడా ఉన్నారు. 'దేవర' విడుదల సందర్భంగా తమ అభిమాన కథానాయకుడితో పాటు ఆ చిత్ర దర్శకుడు కొరటాల శివతో వాళ్ళిద్దరూ ముచ్చటించారు. సినిమా గురించి పలు ఆసక్తికరమైన విశేషాలను వెల్లడించారు.
(విశ్వక్, సిద్దుతో ఎన్టీఆర్ చిట్ చాట్ వీడియో చూడడంతో పాటు వార్తను చదవడం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)
బాలీవుడ్ సూపర్ స్టార్ పాడు బుద్ధి బయటపెట్టిన షమా!
టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో జానీ మాస్టర్ వ్యవహారం హాట్ టాపిక్ అయింది. మలయాళ పరిశ్రమ గురించి హేమ కమిటీ రిపోర్ట్ దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ తరుణంలో బాలీవుడ్ బడా స్టార్ మీద నటి షమా సికందర్ చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. ఒక యాడ్ చిత్రీకరణలో తనకు ఎదురైన చేదు అనుభవాల గురించి ఆమె తాజాగా వెల్లడించారు.
(షమా సికందర్ ఏం చెప్పారు? లైంగిక వేధింపుల గురించి ఆవిడ ఏమన్నారు? తెలుసుకోవడం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)
కొరియన్ సూపర్ హిట్ సిరీస్ 'స్క్విడ్ గేమ్ 2' టీజర్
నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో సూపర్ హిట్ అయిన వెబ్ సిరీస్ లిస్ట్ తీస్తే... కొరియన్ థ్రిల్లర్ 'స్క్విడ్ గేమ్' తప్పకుండా ముందు వరుసలో ఉంటుంది. ఆ ఓటీటీలో హయ్యస్ట్ స్ట్రీమింగ్ వ్యూస్ దక్కించుకున్న నాన్ ఇంగ్లీష్ వెబ్ సిరీస్ జాబితాలో దానిదే మొదటి స్థానం. ఇప్పుడు దానికి సీక్వెల్ వస్తుంది. ఈ రోజు ఫస్ట్ టీజర్ విడుదల చేయడంతో పాటు రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు.
(స్క్విడ్ గేమ్ సీజన్ 2 టీజర్ చూడడంతో పాటు మరిన్ని వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)
లడ్డు గాని పెళ్లి... 'మ్యాడ్ 2'లో కిరాక్ సాంగ్!
ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ కథానాయకుడిగా... సంగీత్ శోభన్, రామ్ నితిన్ ఇతర కీలక పాత్రల్లో నటించిన 'మ్యాడ్' ప్రేక్షకులను విపరీతంగా నవ్వించడంతో పాటు బాక్స్ ఆఫీస్ పనిలో భారీ విషయం సాధించింది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ వస్తోంది. అందులో తొలి పాట 'లడ్డు గాని పెళ్లి' ఈ రోజు విడుదల అయ్యింది. సంగీత దర్శకుడు భీమ్స్ మరోసారి మంచి ఎనర్జిటిక్ బీట్ ఇచ్చారు.
('లడ్డు గాని పెళ్లి' లిరికల్ వీడియో చూడడంతో పాటు దీనికి సంబంధించిన వార్త కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

