అన్వేషించండి

Devara Interview: జాన్వీ డైలాగ్‌తో షాక్... ఇరిటేట్ చేసిన సీన్ అదే... దాస్, టిల్లుతో జూనియర్ ఎన్టీఆర్ ఇంటర్వ్యూ వచ్చేసింది

‘దేవర’ ప్రమోషన్ లో భాగంగా టిల్లు, విశ్వక్ సేన్ చేసిన ఫుల్ ఇంటర్వ్యూ రిలీజ్ అయ్యింది. హీరో ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ సినిమాకు సంబంధించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించారు.

Devara  Full Interview: యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘దేవర’. ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం జోరుగా ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అందులో భాగంగా స్టార్ బాయ్ టిల్లు, మాస్ కా దాస్  విశ్వక్ సేన్.. ఎన్టీఆర్, కొరటాలను స్పెషల్ ఇంటర్వ్యూ చేశారు. ఇప్పటికే ఈ ఇంటర్వ్యూకు సంబంధించి ప్రోమో విడుదలై నెట్టింట వైరల్ కాగా, తాజాగా ఫుల్ ఇంటర్వ్యూ విడుదల అయ్యింది. ఈ సినిమాకు సంబంధించి ఎన్టీఆర్, కొరటాల శివ పలు కీలక విషయాలు వెల్లడించారు.

కాన్ఫిడెంట్లీ నర్వస్ గా ఫీలవుతున్నా- ఎన్టీఆర్

‘దేవర’ సినిమా విషయంలో కాన్ఫిడెంట్లీ నర్వస్ గా ఫీలవుతున్నట్లు చెప్పారు ఎన్టీఆర్. “ఈ సినిమా కోసం చాలా ఎఫర్ట్ పెట్టాం. ఈ సినిమాలో నాకు చాలా ఇష్టమైన పాయింట్ ఉంది. కమర్షియల్ సినిమాల్లో ఏ హీరోయినా ధైర్యం చెప్పడానికి వస్తాడు. తనతో పాటు తోటి వారిని  ముందుక తీసుకెళ్తాడు. ఈ సినిమాలో ధైర్యం ఎక్కువగా ఉన్నవాడిని భయపెట్టడమే పాయింట్.  ప్రతి వాడికి ధైర్యంతో పాటు భయం కూడా ఉండాలనే పాయింట్ నాకు బాగా నచ్చింది. శివ అన్ని సినిమాల్లో మాదిరిగానే ఈ సినిమాలో మెసేజ్ ఉంటుంది. ఈ మూవీ చాలా ఇంటెన్సివ్ గా ఉంటుంది. అందుకే బాగా కాన్ఫిడెంట్ గా ఉన్నాను. అదే సమయంలో నర్వస్ గా ఉన్నాను” అని ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు.

నాకు అకౌంటబులిటీ అనేదే భయం-కొరటా శివ

నాకు ఈ సినిమా విషయంలో ఎలాంటి భయం లేదని, అకౌంటబులిటీయే అసలు భయం అన్నారు దర్శకుడు కొరటాల. “తాడు బొంగరం లేని వాడిని నాకు  ఫియర్ ఏముంది? నేను ఎత్తుకున్న ఎమోషన్ రైట్ ట్రాక్ లో వెళ్తుందా? లేదా?  అనేది చూస్తాను. వందల మందిని ఒక్క తాటి మీదికి తీసుకొచ్చి సినిమా చేస్తాను. భయం అనే దానికి ఛాన్స్ లేదు. నాకు అకౌంటబులిటీ అనేదే భయం. ఇంక వేరే భయం లేదు. ఉండదు కూడా” అన్నారు.

జాన్వీని చూసి షాక్ అయ్యాం- ఎన్టీఆర్

హీరోయిన్ జాన్వీ కపూర్ ఈ సినిమా కోసం ఎంతో కష్టపడిందని ఎన్టీఆర్ అన్నారు. ఆమె పెద్ద హీరోయిన్ అవుతుందని భావిస్తున్నట్లు చెప్పారు. “ఈ సినిమా కోసం జాన్వీ చాలా కష్టపడింది. రెండు పేజీల డైలాగ్ ను టపటప చెప్పేసింది. నేను ఒక్క నిమిషం ఆగిపోయా. శివ కూడా షాక్ అయ్యాడు. ఎక్స్ ప్రెషన్స్, యాక్టివిటీస్, పాజ్ లు అద్భుతంగా చేసింది. ‘దావూదీ’ సాంగ్ కోసం చాలా కష్టపడింది. హాస్పిటల్ నుంచి వచ్చి నేరుగా ఈ పాట చేసింది. ఆమె ఓ పెద్ద నటి అవుతుంది. ఈ సినిమాలో ఆమె లవ్ స్టోరీ చాలా పెద్దగా ఉంటుంది. ఈ సినిమాలో కాస్త తక్కువ ఉంటుంది. రెండో భాగంలో చాలా కీలకంగా ఉంటుంది” అని చెప్పుకొచ్చారు.

ఈ సినిమాలో ఆ సీక్వెన్స్ ఇరిటేట్ చేసింది- కొరటాల శివ

ఈ సినిమాలో ‘ఆయుధపూజ’ పాట చాలా ఇరిటేట్ చేసిందన్నారు దర్శకుడు కొరాట. ఈ పాట ఫస్ట్ షెడ్యూల్ లో ప్లాన్ చేస్తే.. దానితోనే గుమ్మడికాయ కొట్టాల్సి వచ్చిందన్నారు. ఈ సినిమాలో ఆర్ట్ డైరెక్టర్ సాబు పనితీరు అద్భుతం అన్నారు. “ఈ సినిమాలో ఆర్ట్ డైరెక్టర్ సాబు పనితీరు అద్భుతం. ఎవరైనా సినిమా షూటింగ్ కోసం బోట్లు తీసుకొస్తారు.  ఆయన మాత్రం కొత్త బోట్లనే తయారు చేశారు. పూల్ సెట్  లోనే కాదు. ఆయన తయారు చేసిన బోట్లతో గోవాలో సముద్రంలోనూ షూట్ చేశాం” అంటూ ప్రశంసలు కురిపించారు. ఇక ‘దేవర’ సినిమా ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకురానుంది.  

Read Also: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ క్రేజీ అప్‌డేట్... షూటింగ్ స్టార్ట్‌ చేసేది ఎప్పుడో చెప్పేసిన ‘దేవర’

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Rains: వాయుగుండం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
వాయుగుండం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
Telangana News: తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ - కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ - కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
YS Jagan On Power Deals: సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
Social Media Ban: 16 ఏళ్లలోపు పిల్లలకు నో సోషల్ మీడియా - ఆస్ట్రేలియాలో కొత్త రూల్ - ఇండియాకు కూడా వస్తుందా?
16 ఏళ్లలోపు పిల్లలకు నో సోషల్ మీడియా - ఆస్ట్రేలియాలో కొత్త రూల్ - ఇండియాకు కూడా వస్తుందా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ISKCON Monk Chinmoy Krishna Das Arrest In Bangladesh | బంగ్లాదేశ్ లో మైనార్టీలపై హింసకు ఇదే నిదర్శనం | ABP DesamKCR Send off Madireddy Srinivas | ఆత్మీయుడిని అమెరికాకు పంపించిన కేసీఆర్ | ABP Desamతిరుచానూరులో శాస్త్రోక్తంగా ధ్వజారోహణంఎస్పీకి ఊరి జనం ఊరేగింపు, వారి ఆగ్రహాన్ని ఎలా పోగొట్టారు?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Rains: వాయుగుండం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
వాయుగుండం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
Telangana News: తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ - కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ - కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
YS Jagan On Power Deals: సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
Social Media Ban: 16 ఏళ్లలోపు పిల్లలకు నో సోషల్ మీడియా - ఆస్ట్రేలియాలో కొత్త రూల్ - ఇండియాకు కూడా వస్తుందా?
16 ఏళ్లలోపు పిల్లలకు నో సోషల్ మీడియా - ఆస్ట్రేలియాలో కొత్త రూల్ - ఇండియాకు కూడా వస్తుందా?
Minister Konda Surekha: మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్ - పరువు నష్టం కేసులో నాంపల్లి కోర్టు సమన్లు
మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్ - పరువు నష్టం కేసులో నాంపల్లి కోర్టు సమన్లు
Honda SP 125: ట్యాంక్ ఫుల్ చేస్తే 700 కిలోమీటర్లు - రూ.ఐదు వేలు కట్టి తీసుకెళ్లిపోవచ్చు - సూపర్ ఆఫర్!
ట్యాంక్ ఫుల్ చేస్తే 700 కిలోమీటర్లు - రూ.ఐదు వేలు కట్టి తీసుకెళ్లిపోవచ్చు - సూపర్ ఆఫర్!
Ram Gopal Varma: 'నా కోసం వెతుకుతున్నారని ఆనంద పడే వారికి ఓ బ్యాడ్ న్యూస్' - కేసులపై ఆర్జీవీ సంచలన ట్వీట్స్
'నా కోసం వెతుకుతున్నారని ఆనంద పడే వారికి ఓ బ్యాడ్ న్యూస్' - కేసులపై ఆర్జీవీ సంచలన ట్వీట్స్
Telangana News: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు బిగ్ అలర్ట్ - మార్కుల విధానంలో కీలక మార్పులు
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు బిగ్ అలర్ట్ - మార్కుల విధానంలో కీలక మార్పులు
Embed widget