NTR 31: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ క్రేజీ అప్‌డేట్... షూటింగ్ స్టార్ట్ చేసేది ఎప్పుడో చెప్పేసిన ‘దేవర’
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో ఓ సినిమా తెరకెక్కబోతోంది. ఈ సినిమాకు సంబంధించి జూనియర్ ఎన్టీఆర్ కీలక అప్ డేట్ ఇచ్చారు. షూటింగ్ ఎప్పటి నుంచి ప్రారంభం అవుతుందో చెప్పేశారు.
![NTR 31: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ క్రేజీ అప్‌డేట్... షూటింగ్ స్టార్ట్ చేసేది ఎప్పుడో చెప్పేసిన ‘దేవర’ Jr NTR Prashanth Neel film goes floors On October 21st 2024 NTR 31: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ క్రేజీ అప్‌డేట్... షూటింగ్ స్టార్ట్ చేసేది ఎప్పుడో చెప్పేసిన ‘దేవర’](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/09/20/aab8f5af182c3988de8f7760836c5dd21726813241835544_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
NTR- Prashanth Neel’s Film Update: యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘దేవర’. వచ్చే వారం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్ లో ఎన్టీఆర్ బిజీగా ఉన్నారు. వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాకు హైప్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
ప్రశాంత్ నీల్ మూవీ షూటింగ్ గురించి కీలక అప్ డేట్
‘దేవర’ ప్రమోషన్స్ లో పాల్గొంటున్న జూనియర్ ఎన్టీఆర్... తాజాగా ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ గురించి కీలక విషయాలు వెల్లడించారు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ అక్టోబర్ 21 నుంచి ప్రారంభం అవుతుందన్నారు. “నీల్ సినిమా అక్టోబర్ 21 నుంచి ప్రారంభం అవుతుంది. అయితే, నాతో సంబంధం లేని సన్నివేశాలను ముందుగా షూట్ చేస్తారు. ఆక్టోబర్ 21 నుంచి సుమారు 40 రోజుల పాటు షూటింగ్ నిర్వహిస్తారు. జనవరి 2025 నుంచి నేను షూటింగ్ లో జాయిన్ అవుతాను” అని ఎన్టీఆర్ వెల్లడించారు.
#NTRNeel pic.twitter.com/IO6Mpe7Kxy
— .... (@ynakg2) September 19, 2024
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా పేరు ఖరారు?
ఇక ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాకు సంబంధించి ఇప్పటికే టైటిల్ ఖరారుచేసినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాకు ‘డ్రాగన్’ అని పేరు పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తోంది. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. ప్రశాంత్ నీల్ సినిమా పూర్తయిన తర్వాత ఎన్టీఆర్ ‘దేవర 2’ సినిమా షూటింగ్ లో పాల్గొనే అవకాశం ఉంది.
సెప్టెంబర్ 27న ‘దేవర’ సినిమా విడుదల
ఇక ‘RRR’ సినిమా తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న ‘దేవర’ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో ‘జనతా గ్యారేజ్’ సినిమా తర్వాత వస్తున్న ఈ మూవీపై వ్యాప్తంగా హైప్ క్రియేట్ అయ్యింది. ఈ సినిమా కోసం నార్త్, సౌత్ అనే తేడా లేకుండా అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇందులో ఎన్టీఆర్ డ్యుయెల్ రోల్ పోషిస్తున్నారు. ‘దేవర’ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకురానుంది. తొలి భాగం ఈనెల 27న విడుదల అవుతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకుంది.‘చుట్టమల్లే’, ‘దావూదీ’ లాంటి పాటలు సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ అందించిన సంగీతం అద్భుతంగా అలరిస్తోంది. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.
Read Also: సిద్ధూ జొన్నలగడ్డను పిలిచి మరీ పరువు తీసిన ఎన్టీఆర్... యంగ్ హీరోలతో హిలేరియస్ 'దేవర' ప్రమోషన్స్
Also Read: కంగువలో సూర్య ఫైట్స్... ఏనుగు దంతాలతో కుమ్మేసి, పాము బాణాలతో కాటేసి... రెప్ప వేయకుండా చూడాలంతే
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)