Shama Sikander: షూటింగ్‌లో హీరో అలా పట్టుకోగానే షాకయ్యా... ఇండస్ట్రీలో లైంగిక వేధింపులపై బాలీవుడ్ నటి కామెంట్స్
టీవీ యాక్టర్ షామా సికందర్ ఇండస్ట్రీలో తనకు ఎదురైన లైంగిక వేధింపులు గురించి నోరు విప్పింది. ఓ యాడ్ షూటింగ్ లో స్టార్ హీరో అసభ్యంగా హగ్ చేసుకున్నట్లు వెల్లడించింది.
![Shama Sikander: షూటింగ్‌లో హీరో అలా పట్టుకోగానే షాకయ్యా... ఇండస్ట్రీలో లైంగిక వేధింపులపై బాలీవుడ్ నటి కామెంట్స్ Actress Shama Sikander made shocking revelation stating that superstar hugged her inappropriately during an ad shoot Shama Sikander: షూటింగ్‌లో హీరో అలా పట్టుకోగానే షాకయ్యా... ఇండస్ట్రీలో లైంగిక వేధింపులపై బాలీవుడ్ నటి కామెంట్స్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/09/20/c273588b5da8a62bb48239065ea6e6371726827205887544_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Shama Sikander About Sexual Harassment: ప్రముఖ టీవీ నటి, హాట్ బ్యూటీ షామా సికిందర్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. సినిమాలతో పాటు పలు టీవీ షోలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. నాలుగు పదుల వయసులోనూ అందాలతో అలరిస్తుంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీలో తనకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. ఒక యాడ్ షూటింగ్ లో సూపర్ స్టార్ తనను అసభ్యంగా ప్రవర్తించాడని వెల్లడించింది. ఆ తర్వాత మళ్లీ ఎప్పుడూ తనతో నటించకూడదని నిర్ణయించుకున్నట్లు చెప్పుకొచ్చింది.
ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..?
ఓ కంపెనీకి చెందిన యాడ్ షూట్ లో తనకు ఎదురైన ఘనటతో చాలా ఏడ్చానని చెప్పింది షామా సికిందర్. “ఓ కంపెనీకి చెందిన కమర్షియల్ యాడ్ లో నన్ను నటించాలని కోరారు. నేను సరే అన్నాను. షూట్ కు వెళ్లే ముందు సీన్ వివరించారు. నిజానికి ముందుగా తను ఎలాంటి కౌగిలింతలు ఉండవని చెప్పారు. కానీ, కొన్ని కారణాలతో ఒక హగ్ సీన్ ను పెట్టారు. ఆదే నాకు ఇబ్బంది కలిగింది. ఆ యాడ్ నగలకు సంబంధించినది. భర్త తన భార్యకు నగలు కొనిస్తాడు. ఆ నగలను చూసి ఆనందంతో భర్తను కౌగిలించుకుంటుంది. నేను భార్యగా, సదరు హీరో నా భర్తగా నటిస్తున్నాడు. షూట్ కొనసాగుతుండగా, అతడు నన్ను అసభ్యంగా కౌగిలించుకున్నాడు. నేను చాలా ఇబ్బందిగా ఫీలయ్యాను. చాలా మంది నటులతో కలిసి పని చేశాను. కానీ, ఎప్పుడూ నాకు ఇలాంటి పరిస్థితి ఎదురుకాలేదు. అప్పుడే నేను ఓ నిర్ణయం తీసుకున్నాను. ఇకపై అతడితో ఎప్పుడూ కలిసి నటించకూడదు అనుకున్నాను” అని చెప్పుకొచ్చింది. జరిగినది తలచుకొని ఆ రాత్రంతా ఏడ్చానన్నది.
ఇంతకీ షామా సికిందర్ ఎవరంటే?
షామా సికిందర్ 10 ఏండ్ల వయసులోనే బాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. 'ప్రేమ్ అగ్గన్' మూవీతో కెరీర్ మొదలు పెట్టింది. కానీ, ఎక్కువగా చిత్రాలు చేయలేదు. కొన్ని సినిమాలకే పరిమితం అయ్యింది. ఇంకా చెప్పాలంటే.. 1998లో ఒకటి, 1999లో మరొక సినిమా చేసింది. ఆ తర్వాత ఇండస్ట్రీ నుంచి కొంత గ్యాప్ తీసుకుంది. 2002 నుంచి మళ్ళీ సెకెండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. మొత్తంగా ఓ పది సినిమాల్లో నటించింది. సినిమాలతో పోల్చితే టీవీ షోలతో బాగా పాపులర్ అయ్యింది. షామా డ్యాన్స్ రియాలిటీ షోలతో పేరు తెచ్చుకున్నారు. ‘యే మేరీ లైఫ్ హై’, ‘CID’, ‘బట్లీవాలా హౌస్ నెం. 43’, ‘కాజల్’, ‘సెవెన్’, ‘బాల్ వీర్ జండ్ మాన్ మే హై విశ్వాస్’ లాంటి టీవీ షోలతో మంచి గుర్తింపు పొంది. పలు వెబ్ సిరీస్ లలోనూ ఆమె నటించి గుర్తింపు తెచ్చుకుంది.
View this post on Instagram
Also Read: కంగువలో సూర్య ఫైట్స్... ఏనుగు దంతాలతో కుమ్మేసి, పాము బాణాలతో కాటేసి... రెప్ప వేయకుండా చూడాలంతే
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)