Akhanda 2 - Sambarala Yeti Gattu: అప్పుడు 'రూలర్' vs 'ప్రతిరోజూ'... నెక్స్ట్ ఇయర్ 'అఖండ 2' vs 'సంబరాల ఏటిగట్టు'
Dussehra 2025 Movie Releases Telugu: నెక్స్ట్ ఇయర్ విజయ దశమికి థియేటర్లలోకి రావడానికి మూడు సినిమాలు కర్చీఫ్‌లు వేశాయి. అందులో 'అఖండ 2', 'సంబరాల ఏటిగట్టు' మధ్య ఇంట్రెస్టింగ్ కనెక్షన్ ఉంది.
Vijayadashami 2025 Movie Releases Telugu: విజయదశమి... తెలుగు ప్రజలతో పాటు ఉత్తరాది జనాలు సైతం జరుపుకొనే పండుగ. పేర్లు వేర్వేరు కావచ్చు కానీ దేశ వ్యాప్తంగా ఫెస్టివల్ మూడ్ అయితే ఉంటుంది. పండగ సెలవులు ఎక్కువ. ఆల్మోస్ట్ పది రోజులు ఇస్తారు. ఈ కారణం చేత దసరాకు థియేటర్లలోకి రావడానికి రెండు పాన్ ఇండియా తెలుగు సినిమాలు కర్చీఫ్ వేశాయి. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. అది ఏమిటంటే?
అఖండ 2 వర్సెస్ సంబరాల ఏటిగట్టు!
Akhanda 2 vs Sambarala Yetigattu: గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా 'సింహా', 'లెజెండ్', 'అఖండ' వంటి హ్యాట్రిక్ హిట్స్ తర్వాత మాస్ కమర్షియల్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న సినిమా 'అఖండ 2 తాండవం'. పాన్ ఇండియా రిలీజ్ చేసేలా తీస్తున్నారు. ఈ సినిమాను విజయ దశమి సందర్భంగా సెప్టెంబర్ 25న విడుదల చేయనున్నట్లు ఇటీవల అనౌన్స్ చేశారు.
'అఖండ 2 తాండవం'తో పాటు సెప్టెంబర్ 25న మరో పాన్ ఇండియా సినిమా రిలీజ్ కానుంది. అది సాయి దుర్గ తేజ్ హీరోగా నటిస్తున్న 'SYG - సంబరాల ఏటిగట్టు'. ఈ మూవీ వీడియో గ్లింప్స్ లేటెస్టుగా విడుదల చేశారు. పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ బరిలో ఇద్దరు తెలుగు హీరోలు ఒకే రోజు తమ సినిమాలు విడుదల చేస్తుండటం విశేషం.
అప్పుడు 'రూలర్' వర్సెస్ 'ప్రతిరోజూ పండగే'
నందమూరి బాలకృష్ణ, సాయి దుర్గ తేజ్ సినిమాలు ఒకే రోజు థియేటర్లలోకి రావడం వచ్చే ఏడాది దసరా మొదటిసారి కాదు. ఐదేళ్ల క్రితం ఒకసారి వచ్చారు. 'రూలర్' సినిమా డిసెంబర్ 20, 2019లో విడుదల అయ్యింది. అదే రోజు తేజ్ సినిమా 'ప్రతిరోజూ పండగే' కూడా విడుదలైంది. అప్పట్లో ప్రతిరోజూ అందర్నీ నవ్వించి మంచి విజయం అందుకుంది.
విజయ దశమికి రిషబ్ శెట్టి 'కాంతార 2' కూడా!
నందమూరి బాలకృష్ణ 'అఖండ 2', సాయి దుర్గ తేజ్ 'సంబరాల ఏటిగట్టు'తో పాటు వచ్చే ఏడాది విజయ దశమికి థియేటర్లలోకి వస్తున్న సినిమా 'కాంతార: ఛాప్టర్ 1'. అయితే... అది సెప్టెంబర్ 25న కాకుండా అక్టోబర్ 2న విడుదల అవుతోంది. ఇది కన్నడ కథానాయకుడు రిషబ్ శెట్టి నటిస్తుండటంతో పాటు దర్శకత్వం వహిస్తున్న సినిమా.
'కాంతార' పాన్ ఇండియా సక్సెస్ సాధించడంతో ప్రీక్వెల్ ఎలా ఉంటుందో అని ఆడియన్స్ ఆసక్తి చూపిస్తున్నారు. విశేషం ఏమిటంటే... 'కాంతార' ప్రీక్వెల్, 'అఖండ 2' మైథాలజీ టచ్ ఉన్న సినిమాలు. తేజ్ 'సంబరాల ఏటిగట్టు' జానర్ ఏమిటి? కథ ఏమిటి? అనేది ఇంకా రివీల్ చేయలేదు. కానీ, ఆల్రెడీ విడుదల చేసిన వీడియోలో తేజ్ ట్రాన్స్‌ఫర్మేషన్, ఆ విజువల్స్, అజనీష్ నేపథ్య సంగీతం పాన్ ఇండియా స్థాయిలో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాయి. సో... నెక్స్ట్ ఇయర్ దసరాకు ఇంట్రెస్టింగ్ సినిమాలు లైనప్‌లో ఉన్నాయి.
Also Read: కీర్తి సురేష్ కంటే ఆంటోనీ ఎన్నేళ్లు పెద్దోడో తెలుసా... భార్య భర్తల మధ్య ఏజ్ గ్యాప్ ఎంతంటే?