అన్వేషించండి

Allu Arjun : అప్పుడు ముఖ్యమంత్రి, ఇప్పుడు డైరెక్టర్ పేరు మర్చిపోయిన బన్నీ... తగ్గేదే లే అంటూ దారుణంగా ట్రోలింగ్

ఈరోజు ఢిల్లీ వేదికగా 'పుష్ప 2' సక్సెస్ మీట్ జరిగిన సంగతి తెలిసిందే. ఆ ఈవెంట్ లో అల్లు అర్జున్ దర్శకుడు సుకుమార్ పేరును చెప్పడంతో తడబడడంపై విమర్శలు విన్పిస్తున్నాయి.

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం మంచి క్రేజ్ ఉన్న హీరోలలో అల్లు అర్జున్ కూడా ఒకరు. 'పుష్ప' మూవీ ఈ హీరోకి నేషనల్ అవార్డుతో పాటు తెచ్చిన పాపులారిటీ అంతా ఇంతా కాదు. అల్లు అర్జున్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏకంగా ప్రపంచవ్యాప్తంగా పెరిగింది 'పుష్ప' సినిమాతోనే. దీనంతటికీ కారణం సుకుమార్ అని చెప్పాలి. కానీ తాజాగా జరిగిన ఈవెంట్లో అల్లు అర్జున్ ఏకంగా డైరెక్టర్ పేరును మర్చిపోవడంతో ఏకీపారేస్తున్నారు నెటిజెన్లు. 

అప్పుడు ముఖ్యమంత్రి పేరు, ఇప్పుడు డైరెక్టర్ పేరు... 
అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన పాన్ ఇండియా మూవీ 'పుష్ప 2' డిసెంబర్ 5న భారీ ఎత్తున థియేటర్లలో రిలీజ్ అయ్యింది. ఈ సినిమా రిలీజ్ అయిన ఆరు రోజుల్లోనే 1000 కోట్లు కొల్లగొట్టి ఆల్ టైం రికార్డును క్రియేట్ చేసిన సినిమాగా చరిత్రను సృష్టించింది. ఈ సందర్భంగా మేకర్స్ థ్యాంక్స్ మీట్ నిర్వహిస్తూ అభిమానులకు కృతజ్ఞతలు చెబుతున్నారు. తాజాగా అల్లు అర్జున్ ఢిల్లీలో జరిగిన సక్సెస్ మీట్ లో మాట్లాడుతూ అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. అయితే ఈ సందర్భంలో అల్లు అర్జున్ సినిమా సక్సెస్ కు ప్రధాన కారణం డైరెక్టర్ బండి సుకుమార్ రెడ్డి అంటూ సుకుమార్ పేరును తప్పుగా పలకడం మరో వివాదానికి దారి తీసింది. 

సుకుమార్ అసలు పేరు బండ్రెడ్డి సుకుమార్. ఆయన టైటిల్ కార్డులో మాత్రం బి సుకుమార్ అని ఉంటుంది. కానీ అల్లు అర్జున్ మాట్లాడుతూ బండి సుకుమార్ రెడ్డి అని సుకుమార్ పేరు పలకడంలో తడబడడం ఇప్పుడు విమర్శలకు దారి తీసింది. అయితే అంతకుముందు తెలుగు థాంక్స్ మీట్ లో అల్లు అర్జున్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. కానీ ఆ టైంలో ఆయన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరును కూడా మర్చిపోయాడు. 

అల్లు అర్జున్ పై తీవ్ర విమర్శలు 
నలుగురికి ఆదర్శవంతంగా ఉండాల్సిన ఒక సెలబ్రిటీ ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి పేరునే మర్చిపోవడం ఏంటి ? అంటూ రీసెంట్ గా అల్లు అర్జున్ పై నెగిటివ్ కామెంట్స్ వినిపించాయి. ఇక ఇప్పుడు హిందీ ప్రెస్ మీట్ తర్వాత తనకు ఇంతటి స్థాయిని ఇచ్చిన డైరెక్టర్ పూర్తి పేరు కూడా సరిగ్గా తెలియదా ? అంటూ ఈ సందర్భంగా నెటిజెన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. సినిమాలో హీరో ఎలివేషన్ కోసం వాడిన 'తగ్గేదే లే' డైలాగును ఇప్పుడు బన్నీపై ట్రోలింగ్ కోసం వాడుతూ ఆడేసుకుంటున్నారు నెటిజన్లు. మొత్తానికి అల్లు అర్జున్ 'పుష్ప 2' రిలీజ్ టైం నుంచి వరుసగా వివాదాల బారిన పడుతున్నారు. 

రాజకీయాల్లోకి ఎంట్రీ అంటూ రూమర్స్ 
ఇదిలా ఉండదా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రాజకీయాల్లోకి రాబోతున్నారు అంటూ తాజాగా పుకార్లు షికార్లు చేశాయి. ఆయన పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ను కలిసారని, ఈ మేరకు త్వరలోనే అల్లు అర్జున్ రాజకీయ ఎంట్రీ ఉంటుందని వార్తలు వినిపించాయి. ఆ వార్తలపై స్పందించిన అల్లు అర్జున్ టీం అవన్నీ పుకార్లు మాత్రమేనని కొట్టిపారేసింది. ఇలాంటి తప్పుడు వార్తలను వ్యాప్తి చేయకుండా ఉండాలని మీడియాతో పాటు ప్రతి ఒక్కరిని కోరుతున్నట్టుగా తెలిపారు. ఈ మేరకు అల్లు అర్జున్ టీం సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ ను షేర్ చేసింది.

Read Also : Nayanthara: లేడీ సూపర్ స్టార్ ట్యాగ్ వద్దని అడుకున్నా... మహిళ సక్సెస్ అయితే మగాళ్లు చూడలేరు - నయనతార వివాదాస్పద కామెంట్స్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Amaravati: రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
Mohanbabu New Audio: టీవీ9 రిపోర్టరే తప్పు చేశాడు - అయినా కొట్టినందుకు చింతిస్తున్నా - మరో సంచలన ఆడియో రిలీజ్ చేసిన మోహన్ బాబు
టీవీ9 రిపోర్టరే తప్పు చేశాడు - అయినా కొట్టినందుకు చింతిస్తున్నా - మరో సంచలన ఆడియో రిలీజ్ చేసిన మోహన్ బాబు
World Chess Champion: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ విజేతగా యువ కెరటం గుకేశ్ - అతిపిన్న వయస్కుడిగా రికార్డు
ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ విజేతగా యువ కెరటం గుకేశ్ - అతిపిన్న వయస్కుడిగా రికార్డు
Viral News: ఒక్క రోజులో 100 మంది మగాళ్లతో శృంగారం - మోడల్ సాహసం - యూట్యూబ్‌లో కూడా పెట్టిందోచ్ !  వీడియో
ఒక్క రోజులో 100 మంది మగాళ్లతో శృంగారం - మోడల్ సాహసం - యూట్యూబ్‌లో కూడా పెట్టిందోచ్ ! వీడియో
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

విజయవాడ హైదరాబాద్ మధ్యలో త్వరలో హైపర్‌లూప్‌ ట్రైన్ఇండీ కూటమిలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్న వైసీపీరాజ్యసభకు మెగాస్టార్ చిరంజీవి, త్వరలోనే నామినేషన్!ప్రియుడిని పెళ్లి చేసుకున్న కీర్తి సురేశ్, ఫొటోలు వైరల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati: రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
Mohanbabu New Audio: టీవీ9 రిపోర్టరే తప్పు చేశాడు - అయినా కొట్టినందుకు చింతిస్తున్నా - మరో సంచలన ఆడియో రిలీజ్ చేసిన మోహన్ బాబు
టీవీ9 రిపోర్టరే తప్పు చేశాడు - అయినా కొట్టినందుకు చింతిస్తున్నా - మరో సంచలన ఆడియో రిలీజ్ చేసిన మోహన్ బాబు
World Chess Champion: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ విజేతగా యువ కెరటం గుకేశ్ - అతిపిన్న వయస్కుడిగా రికార్డు
ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ విజేతగా యువ కెరటం గుకేశ్ - అతిపిన్న వయస్కుడిగా రికార్డు
Viral News: ఒక్క రోజులో 100 మంది మగాళ్లతో శృంగారం - మోడల్ సాహసం - యూట్యూబ్‌లో కూడా పెట్టిందోచ్ !  వీడియో
ఒక్క రోజులో 100 మంది మగాళ్లతో శృంగారం - మోడల్ సాహసం - యూట్యూబ్‌లో కూడా పెట్టిందోచ్ ! వీడియో
Happy Birthday Rajinikanth: మాస్ డ్యాన్స్‌తో ఇరగదీసిన తలైవర్ - ‘కూలీ’ నుంచి చికిటు వైబ్ వచ్చేసింది!
మాస్ డ్యాన్స్‌తో ఇరగదీసిన తలైవర్ - ‘కూలీ’ నుంచి చికిటు వైబ్ వచ్చేసింది!
Tirumala: తిరుమల ఘాట్ రోడ్డులో పడిన బండరాళ్లు - భక్తులను అలర్ట్ చేసిన టీటీడీ
తిరుమల ఘాట్ రోడ్డులో పడిన బండరాళ్లు - భక్తులను అలర్ట్ చేసిన టీటీడీ
Mohan Babu discharge: ఆస్పత్రి నుంచి మోహన్ బాబు డిశ్చార్జ్ - హత్యాయత్నం కేసులో అరెస్టు చేస్తారా ?
ఆస్పత్రి నుంచి మోహన్ బాబు డిశ్చార్జ్ - హత్యాయత్నం కేసులో అరెస్టు చేస్తారా ?
Mahindra Thar Discount: మహీంద్రా థార్‌పై భారీ ఆఫర్ - ఏకంగా రూ.మూడు లక్షల వరకు తగ్గింపు!
మహీంద్రా థార్‌పై భారీ ఆఫర్ - ఏకంగా రూ.మూడు లక్షల వరకు తగ్గింపు!
Embed widget