Dulquer Salmaan: దుల్కర్ సల్మాన్ బర్త్‌డే సర్‌ప్రైజ్ - గీతా ఆర్ట్స్‌లో కొత్త సినిమా ప్రకటన, ఆసక్తిగా టైటిల్, ఫస్ట్‌లుక్ పోస్టర్
Dulquer Salmaan: మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తెలుగులో మరో కొత్త సినిమా కమిట్ అయ్యారు. గీతా ఆర్ట్స్, కల్కి 2898 ఏడీ నిర్మాత స్వప్ప సినిమా నిర్మాతలతో ఆకాశంలో ఒక తార చిత్రాన్ని ప్రకటించారు.
Dulquer Salmaan Next Movie With Geetha Arts and Swapna Cinema: మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ బర్త్‌డే సందర్భంగా ఫ్యాన్స్‌కి అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చారు. జూలై 28న దుల్కర్ సల్మాన్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయన సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్ ఇస్తూ అభిమానులను సర్‌ప్రైజ్ చేస్తున్నారు. తాజాగా తెలుగులో ఆయన కొత్త సినిమా ప్రకటన వచ్చింది. నిజానికి మలయాళ హీరో అయినా దుల్కర్ సల్మాన్‌కు తెలుగులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
'మహానటి', 'సితారామం' చిత్రాలతో తెలుగు ఆడియన్స్‌కి మరింత దగ్గర అయ్యాడు దుల్కర్. ఈ హీరో భాషతో సంబంధంలో అన్ని భాషల్లో సినిమా చేస్తూ అసలు సిసలైన పాన్ ఇండియా స్టార్ అనిపించుకుంటున్నారు. ఇక సితారామం తర్వాత తెలుగులో లక్కీ భాస్కర్ అనే ినిమా చేస్తున్న దుల్కర్ తాజాగా మారో తెలుగు సినిమాను ఒకే చేశాడు. కల్కి 2898 ఏడీ నిర్మాతలతో కలిసి దుల్కర్ మరో సినిమా చేయబోతున్నాడు. నేడు ఆయన బర్త్‌డే సందర్భంగా ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా మూవీ ఫస్ట్‌లుక్ పోస్టర్‌తో పాటు టైటిల్ కూడా ప్రకటించారు. ఈ సినిమాకు ఆకాశంలో ఒక తార ఫిక్స్ చేశారు.
Sky is not the limit ✨
— Geetha Arts (@GeethaArts) July 28, 2024
Wishing a blockbuster birthday to our STAR @Dulquer who will enchant us all with a story that makes your heart SOAR ❤️🔥
More updates will fly soon ⏳#AakasamLoOkaTara #AOTMovie#AlluAravind @GeethaArts @Lightboxoffl @SwapnaCinema @VyjayanthiFilms… pic.twitter.com/EL35vSvSHM
ఈ పోస్టర్‌లో దుల్కర్ భుజంపై రెడ్ కలర్ టవల్ వేసుకుని ఆకాశం వైపు చూస్తూ కనిపించారు. అలాగే ఎండిన పోలాల మధ్యలో స్కూల్ యూనిఫాం, బ్యాగ్ ఓ చిన్నారి నిలుచుని ఉంది. చూస్తుంటే ఇది రైతు నేపథ్యంలో సాగే కథ అనిపిస్తుంది. లుక్ పోస్టర్‌తోనే మూవీ ఆసక్తి పెంచారు మేకర్స్. ఇక ఈ సినిమాను గీతా ఆర్ట్స్, స్వప్ప సినిమాస్, లైట్ బాక్స్ నిర్మాణ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను పవన్ సాధినేని దర్శకత్వ వహిస్తున్నారు. పాన్ ఇండియాగా ఈ మూవీ తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లోనూ రిలీజ్ చేయనున్నారు.
కాగా గతంలో వైజయంతీ మూవీస్ బ్యానరల్లో మహానటి, కల్కి 2898 ఏడీ సినిమా చేశాడు. ఇప్పుడు అదే నిర్మాతతో మూడో సినిమా చేయబోతుండట విశేషం. ఇదిలా ఉంటే దుల్కర్ సల్మాన్ ప్రస్తుతం తెలుగులో లక్కీ భాస్కర్ సినిమా చేస్తున్నాడు. వెంకీ అట్లూరి దర్శకత్వంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్ నటిస్తుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫర్ సినిమాస్ బ్యానర్స్‌పై సూర్యదేవర నాగవంశీచ సాయి సౌజన్యలు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. లక్కీ భాస్కర్‌కు జీవీ ప్రకాశ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా సెప్టెంబర్‌లో విడుదల కానుంది.