Actress : రెండు సార్లు చావు అంచులదాకా వెళ్లొచ్చిన స్టార్ హీరోయిన్... కెరీర్ పీక్స్ ఉన్నప్పుడే సినిమాలకు గుడ్ బై
Actress : ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఇండస్ట్రీని ఊపేసిన సొట్టబుగ్గల సుందరి లైఫ్ ను యాక్సిడెంట్లు పూర్తిగా మార్చేశాయి. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే ఈ హీరోయిన్ రెండు ప్రమాదాల బారి నుంచి తప్పించుకుంది.

Herione : సెలబ్రిటీలకు ఎంత పాపులారిటీ ఉంటే అంత ప్రమాదం పొంచి ఉంటుంది. ప్రమాదం ఏ వైపు నుంచి ముంచుకొస్తుందో తెలియదు. ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన సొట్ట బుగ్గల సుందరి, రెండుసార్లు తన జీవితంలో చావు అంచుల వరకూ వెళ్లి వచ్చింది. సినిమా ఇండస్ట్రీలో కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే సినిమాలకు గుడ్ బై చెప్పి, ప్రస్తుతం తన పర్సనల్ లైఫ్ ను సంతోషంగా గడుపుతోంది. ఆ హీరోయిన్ మరెవరో కాదు ప్రీతి జింటా.
మొదటిసారి సునామీ గండం
రీసెంట్ గా సైఫ్ అలీ ఖాన్ పై జరిగిన దాడి, తృటిలో ఆయనకు తప్పిన ప్రమాదం నుంచి బయట పడి, గాయాలతో బయటపడ్డ సంగతి తెలిసిందే. అయితే ఇలా చావు అంచుల వరకూ వెళ్లి తిరిగి వచ్చిన బాలీవుడ్ స్టార్స్ చాలామంది ఉన్నారు. అందులో 90 దశకంలో హిందీ చిత్రసీమను ఊపేసిన హీరోయిన్ ప్రీతి జింటా కూడా ఒకరు. సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, అమీర్ ఖాన్ లాంటి స్టార్ హీరోలతో కలిసి బ్లాక్ బస్టర్ సినిమాలు చేసిన ఈ హీరోయిన్ ను డింపుల్ గర్ల్ అని పిలుచుకుంటారు. 'రాజకుమారుడు' సినిమాతో ఈ బ్యూటీ తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరైన సంగతి తెలిసిందే. ఈరోజు ప్రీతి జింటా 50వ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమె రెండు సార్లు ప్రాణాపాయం నుంచి ఎలా బయటపడింది అనే ఇంట్రెస్టింగ్ విషయం మరోసారి చర్చనీయాంశమైంది.
ప్రీతి జింటా సిమ్లాలో పుట్టింది. 1975 జనవరి 31న ఈ అమ్మడు జన్మించింది. అయితే ఆర్మీ ఆఫీసర్ అయిన ఆమె తండ్రి ఓ ప్రమాదంలో చనిపోయారు. అదే ప్రమాదంలో గాయపడ్డ ఆమె తల్లి రెండేళ్ల పాటు మంచాన పడింది. ప్రీతి చిన్న వయసులో ఉండగానే తల్లి కూడా చనిపోయింది. ఆ ఎఫెక్ట్ ప్రీతి జింటాపై గట్టిగానే పడింది. ఆమె బోర్డింగ్ స్కూల్లో చదువు సాగించి, సినిమాను కెరీర్ గా ఎంచుకుంది. 2004లో ఈ బ్యూటీ రెండు ప్రమాదాల నుంచి తృటిలో తప్పించుకుంది.
2004 టైమ్ లో వచ్చిన సునామీలో తాను కూడా చిక్కుకుపోయానని, ఆ సునామీలో తన స్నేహితులను కోల్పోయానని స్వయంగా ప్రీతి జింటా ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. "ఆ సునామీలో నేను చనిపోతానని అనుకున్నాను. కానీ ఆ టైంలో నా స్నేహితులు చాలా మంది చనిపోయారు. నేను మాత్రం అదృష్టం కొద్ది బ్రతికి పోయాను. దీంతో నేను ఎందుకు బ్రతికానా అని ఆలోచిస్తూ ఇంటికి తిరిగి వచ్చాను. ఇక వచ్చిన తర్వాత నా జీవితంలో నేను నిజంగా ఏం కోరుకుంటున్నానో అదే చేయాలని డిసైడ్ అయ్యాను" అని చెప్పింది.
2004 పేలుడులో సీన్ రిపీట్
ఇక ఈ సంఘటనలు మర్చిపోకముందే ప్రీతి జింటా మరో ప్రమాదాన్ని తన కళ్లారా చూసింది. శ్రీలంకలోని కొలంబోలో 2004లో జరిగిన టెంమిటేషన్ అనే మ్యూజిక్ కాన్సెప్ట్ లో ప్రీతిజింతాతో పాటు పలువురు బాలీవుడ్ ప్రముఖులు పాల్గొన్నారు. కానీ సడన్గా అక్కడ జరిగిన పేడోడులో చాలామంది కనుమూశారు. ఈ ఘటనలో ప్రీతిజింతా తో పాటు మిగతా ప్రముఖులు తృటిలో స్థాపించుకున్నారు. ఇక సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగిన ప్రీతి జింటా 2018లో సినిమాలకు గుడ్ బై చెప్పింది. అలాగే ఐపీఎల్ పంజాబ్ టీం ఫ్రాంచెస్ ఉండగా బిజీగా గడుపుతోంది. లాహోర్ 1947 అనే సినిమాలో కనిపించబోతోంది. ప్రస్తుతం జీన్స్ గుడ్ నైట్ తో ఉంటున్న ప్రీతి జింటా సరోగసి ద్వారా ఇద్దరు పిల్లలకు తల్లి కూడా అయింది.
Also Read : రాజమౌళి - మహేష్ మూవీ కోసం ప్రియాంక చోప్రాకు భారీ రెమ్యూనరేషన్... స్టార్ హీరోల రేంజ్లో డిమాండ్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

