అన్వేషించండి

Director Vijaya Bhaskar: త‌రుణ్ అందుకే ఫేడ్ ఔట్ అయ్యాడు: దర్శకుడు విజయ్ భాస్కర్

Vijaya Bhaskar: ఒకప్పుడు ఎన్నో హిట్ సినిమాలు ఇచ్చిన త‌రుణ్ ఒక్క‌సారిగా సినిమాల‌కు దూర‌మ‌య్యారు. సిల్వ‌ర్ స్క్రిన్ పై ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. అయితే, దానికి కార‌ణం చెప్పారు డైరెక్ట‌ర్ విజ‌య్ భాస్క‌ర్.

Director Vijaya Bhaskar About Hero Tarun : త‌రుణ్.. ఒక‌ప్పుడు వ‌రుస హిట్ల‌తో టాలీవుడ్ లో దూసుకుపోయిన హీరో. కామెడీ, ఎమోష‌న్స్ జోన‌ర్ ఏదైనా త‌న‌దైన న‌ట‌న‌తో ఎంతోమంది ప్రేక్ష‌కుల‌ను అల‌రించాడు. అభిమానుల‌ను సంపాదించుకున్నాడు. అయితే, ఒక్కసారిగా సినిమాల‌కు దూర‌మ‌య్యారు త‌రుణ్. వ‌రుస ఫ్లాప్ లు రావ‌డం, సినిమాలు స‌రిగ్గా ఆడ‌క‌పోవ‌డంతో ఆయ‌న ఆపేశారు. అయితే, త‌రుణ్ ఒక్క‌సారిగా ఫేడ్ ఔట్ అవ్వ‌డంపై ద‌ర్శ‌కుడు విజ‌య్ భాస్క‌ర్ స్పందించారు. ఇటీవ‌ల ఆయ‌న ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ప‌లు విష‌యాలు పంచుకున్నారు. 

త‌రుణ్ అందుకే ఫేడ్ ఔట్ అయ్యారు.. 

త‌రుణ్ ఫేడ్ ఔట్ అవ్వడానికి కార‌ణం ఏంట‌ని అడిగిన ప్ర‌శ్న‌కి ఆయ‌న ఇలా చెప్పారు. "భ‌లే దొంగ‌లు' సినిమాలో కూడా పెట్టేందుకు ట్రై చేశాను. ఆ సినిమాలో కూడా చాలా ఎంట‌ర్ టైనింగ్ క్యారెక్ట‌ర్. కానీ నిజానికి అంద‌రూ ఆ సినిమా 'బంటి ఔర్ బ‌బ్లీ' రీ మేక్ అనుకుంటారు.. కానీ కాదు. వీళ్లంతా సినిమాలు చూడ‌కుండా రాసేస్తారు. 'బానీ అండ్ క్లైడ్' అనే సినిమాను 'బంటీ అండ్ బబ్లీ'గా తీశారు. జీన్ యాప్ మ‌న్ బ‌దులు అమితాబ్ గారు చేశారు. నేను జ‌గ‌ప‌తి బాబును పెట్టాను. కానీ మ‌న స్టోరీ వేరే, వాళ్ల స్టోరీ వేరు. ఇక్క‌డ చిన్న పిల్ల‌ల క్యారెక్ట‌ర్ ఉంటుంది. హాస్పిట‌ల్ లో ఉంటుంది. ఇలియానా ఆ అమ్మాయిని కాపాడ‌దామా? అని అడుగుతుంది. నా స్టోరీ న‌రేష‌న్ వేరేలా ఉంది. అలా మొత్తం డిఫ‌రెంట్ స్క్రిప్ట్. నేను అప్పుడు త‌రుణ్ కి చెప్పాను చేయ‌మ‌ని. కానీ అవ్వ‌లేదు." 

యాక్ష‌న్ సినిమాలు చేయాల‌నుకున్నాడు.. 

"అంద‌రూ యాక్ష‌న్ సినిమాలు చేసి, ఫైట్లు అవి చేస్తున్నారు. నీకు అక్క‌ర్లేదు అవి. నీ ఆడియెన్స్ నీకు ఉంటారు. నీ సినిమాలు నీకు ఉన్నాయి అని చెప్పాను. మంచి యాక్ట‌ర్ కూడా త‌రుణ్. నేను అప్పుడు ఒక ఉదాహ‌ర‌ణ కూడా చెప్పాను ఒక‌వైపు అమితాబ్ బ‌చ్చ‌న్ సినిమాలు ఆడుతుంటే మ‌రోవైపు అమోల్ పాలేక‌ర్ సినిమాలు కూడా ఆడుతున్నాయి అని చెప్పాను. ఎవ‌రో వేరేవాళ్ల‌లా సినిమాలు చేయాల‌ని ట్రై చేయొద్దు అని చెప్తాను. నేను అందుకే నా సొంతంగా, నాకు అనిపించిన‌ట్లే చేస్తాను. అలా యాక్ష‌న్ సినిమాల కోసం వెయిట్ చేశాడు అనుకుంట‌. రెండు సినిమాలు కూడా చేసిన‌ట్లు ఉన్నాడు. కానీ, అవి పెద్ద‌గా వ‌ర్కౌట్ అవ్వ‌లేదు. కానీ త‌ను చాలా ఇంట‌లిజెంట్. ఒక్కోసారి ఒక్కొక్క‌రికి కొన్ని సెట్ అవుతాయి, కొన్ని సెట్ అవ్వ‌వు. మంచి స్క్రిప్ట్ కోసం వెయిట్ చేస్తున్నాడేమో. చెప్ప‌లేం.. ఎవ్వ‌రికి, ఎప్పుడు, ఎలా టైం వ‌స్తుందో. స్క్రిప్ట్ క‌రెక్ట్ గా సెట్ అయితే.. క‌చ్చితంగా త‌రుణ్ తో సినిమా చేస్తాను" అని విజ‌య్ భాస్క‌ర్ చెప్పారు. 

త‌రుణ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ త‌ర్వాత హీరో కూడా చాలా సినిమాల్లో న‌టించాడు. 'నువ్వేకావాలి', 'నువ్వ లేక నేను లేను' లాంటి మంచి మంచి సినిమాలు చేశాడు. ఇక ఇప్పుడు రీ ఎంట్రీ ఇవ్వ‌నున్న‌ట్లు ఇటీవ‌ల ఒక ఇంట‌ర్వ్యూలో ప్ర‌క‌టించారు త‌రుణ్. ఒక వెబ్ సిరీస్, ఒక సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్న‌ట్లు చెప్పారు.    

Also Read: ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టండి చూద్దాం - అప్పట్లో ఎన్టీఆర్‌తో రొమాన్స్, ఇప్పుడు చిన్న సినిమాతో రీ ఎంట్రీ!    

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
Group 2 Exams: ఓ వైపు లక్ష్యం, మరోవైపు మాతృత్వం - పురిటి నొప్పులతోనే గ్రూప్ 2 పరీక్ష రాసిన అభ్యర్థి, కలెక్టర్ ఆదేశాలతో..
ఓ వైపు లక్ష్యం, మరోవైపు మాతృత్వం - పురిటి నొప్పులతోనే గ్రూప్ 2 పరీక్ష రాసిన అభ్యర్థి, కలెక్టర్ ఆదేశాలతో..
Pushpa 2 Collections: రూ.1400 కోట్లు దాటిన ‘పుష్ప 2’ - ఆల్ టైమ్ ఇండియా టాప్-3లోకి ఎంట్రీ!
రూ.1400 కోట్లు దాటిన ‘పుష్ప 2’ - ఆల్ టైమ్ ఇండియా టాప్-3లోకి ఎంట్రీ!
Group 2 Exam: గ్రూప్ 2 పరీక్ష రాస్తుండగా అభ్యర్థికి గుండెపోటు! - భుజాలపై మోసుకెళ్లి కాపాడిన ఎస్సై
గ్రూప్ 2 పరీక్ష రాస్తుండగా అభ్యర్థికి గుండెపోటు! - భుజాలపై మోసుకెళ్లి కాపాడిన ఎస్సై
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అద్దె ఇంట్లో లిక్కర్ తయారీ, ఏ బ్రాండైనా చిటికెలో రెడీ!మనం దేశంలో మగాళ్లకు ఓ న్యాయం.. ఆడవాళ్లకు ఓ న్యాయమా?ఇళయరాజాకు ఘోర అవమానం!నాలుగు కాళ్ళ దెయ్యం దెబ్బకు   ఖాళీ అయిపోయిన గ్రామం..!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
Group 2 Exams: ఓ వైపు లక్ష్యం, మరోవైపు మాతృత్వం - పురిటి నొప్పులతోనే గ్రూప్ 2 పరీక్ష రాసిన అభ్యర్థి, కలెక్టర్ ఆదేశాలతో..
ఓ వైపు లక్ష్యం, మరోవైపు మాతృత్వం - పురిటి నొప్పులతోనే గ్రూప్ 2 పరీక్ష రాసిన అభ్యర్థి, కలెక్టర్ ఆదేశాలతో..
Pushpa 2 Collections: రూ.1400 కోట్లు దాటిన ‘పుష్ప 2’ - ఆల్ టైమ్ ఇండియా టాప్-3లోకి ఎంట్రీ!
రూ.1400 కోట్లు దాటిన ‘పుష్ప 2’ - ఆల్ టైమ్ ఇండియా టాప్-3లోకి ఎంట్రీ!
Group 2 Exam: గ్రూప్ 2 పరీక్ష రాస్తుండగా అభ్యర్థికి గుండెపోటు! - భుజాలపై మోసుకెళ్లి కాపాడిన ఎస్సై
గ్రూప్ 2 పరీక్ష రాస్తుండగా అభ్యర్థికి గుండెపోటు! - భుజాలపై మోసుకెళ్లి కాపాడిన ఎస్సై
Beggars: ఆ నగరంలో భిక్షాటన పూర్తిగా నిషేధం - యాచకులకు డబ్బులిస్తే కేసులు, జనవరి 1 నుంచి అమలు
ఆ నగరంలో భిక్షాటన పూర్తిగా నిషేధం - యాచకులకు డబ్బులిస్తే కేసులు, జనవరి 1 నుంచి అమలు
Pawan Kalyan: పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్  కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్ కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
Gukesh:  గుకేష్‌కు నిర్మలా సీతారామన్ చెక్ మేట్ - సోషల్ మీడియాలో హిలేరియస్ మీమ్స్
గుకేష్‌కు నిర్మలా సీతారామన్ చెక్ మేట్ - సోషల్ మీడియాలో హిలేరియస్ మీమ్స్
Royal Enfield Bikes: త్వరలో మార్కెట్లోకి మూడు కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్ - అన్నీ 650 సీసీ పవర్ ఫుల్ ఇంజిన్లతోనే!
త్వరలో మార్కెట్లోకి మూడు కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్ - అన్నీ 650 సీసీ పవర్ ఫుల్ ఇంజిన్లతోనే!
Embed widget