అన్వేషించండి

Nivetha Thomas: ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టండి చూద్దాం - అప్పట్లో ఎన్టీఆర్‌తో రొమాన్స్, ఇప్పుడు చిన్న సినిమాతో రీ ఎంట్రీ!

Nivetha Thomas: దక్షణాది కథానాయిక నివేదా థామస్ దాదాపు రెండేళ్ల తర్వాత తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆమె నటించిన '35 - చిన్న కథ కాదు' సినిమా త్వరలోనే విడుదల కానుంది. 

Nivetha Thomas: సౌత్ హీరోయిన్ నివేదా థామస్ తెలుగు తెర మీద కనిపించి రెండేళ్లు దాటిపోయింది. ఒకప్పుడు వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులను అలరించిన ఈ బ్యూటీ.. కారణాలు తెలియదు కానీ ఇటీవల కాలంలో సినిమాలు బాగా తగ్గించేసింది. చివరగా ఆమె 2022లో 'శాకినీ డాకినీ' అనే చిత్రంలో నటించింది. చాలా గ్యాప్ తర్వాత ఇప్పుడు '35 - చిన్న కథ కాదు' అనే చిన్న సినిమాతో టాలీవుడ్ లోకి రీఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయింది. ప్రమోషన్స్ లో భాగంగా రెగ్యులర్ గా ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ, సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. 

దగ్గుబాటి రానా సమర్పణలో సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో రూపొందిన చిత్రం '35 - చిన్న కథ కాదు'. నంద కిషోర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నివేదా థామస్ లీడ్ రోల్ ప్లే చేస్తోంది. అప్పుడెప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్, టీజర్, ఇతర పోస్టర్స్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలో ఫ్రెండ్ షిప్ డే స్పెషల్ గా 'సయ్యారే సయ్యా' అనే సాంగ్ ను రిలీజ్ చేసారు. తాజాగా ఈ పాటకు నివేదా ఓ రీల్ చేసి తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. 'నా బడ్డీతో సయ్యారే సయ్యారింగ్' అని దీనికి ఓ కూడా క్యాప్షన్ పెట్టింది.

''మన తోబుట్టువులు, స్నేహితులు, కుటుంబ సభ్యులతో ప్రతిధ్వనింపజేసే పాట. అన్ని విషయాలు ఆహ్లాదకరంగా ఉంటాయి'' అంటూ నివేదా థామస్ తన తమ్ముడితో గడిపిన ఆనందకరమైన క్షణాలను, ఫన్నీ మూమెంట్స్ ను పంచుకుంటుంది. చిన్నప్పటి ఫోటోలు, కలిసి అల్లరి చేస్తున్న పిక్స్, వర్షంలో డ్యాన్స్ చేస్తున్న వీడియో, చిన్నపిల్లల్లా మారి ఆటలు ఆడుకుంటున్న వీడియోలతో కలిపి ఎడిటి చేసిన ఈ రీల్ ఆకట్టుకుంటోంది. అందరూ ఇలానే తమ బడ్డీలతో వీడియోలు చేసి తనను ట్యాగ్ చేయాలని నివేదా కోరింది. వాటిల్లో సూపర్ ఫన్నీగా ఉన్న వాటిని తన ఇన్స్టా స్టోరీలో షేర్ చేస్తానని, అవన్నీ 35 ఆల్బమ్ లో యాడ్ చేయబడతాయని పేర్కొంది. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Nivetha Thomas (@i_nivethathomas)

'35 - చిన్న కథ కాదు' సినిమాలో నివేదా థామస్ పెళ్ళై ఇద్దరు పిల్లలు ఉన్న గృహిణి సరస్వతి పాత్రలో కనిపించనుంది. తల్లి పాత్రలో నటించడం ఒక పెద్ద సవాలు అని చెబుతోంది. ఆమెతో పాటుగా ప్రియదర్శి పులికొండ, విశ్వదేవ్ రాచకొండ ప్రధాన పాత్రలు పోషించారు. గౌతమి, భాగ్యరాజ్, అనన్య, కృష్ణ తేజ తదితరులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. వివేక్ సాగర్ సంగీతం సమకూర్చిన ఈ సినిమాకి నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీ నిర్వహించారు. ముందుగా ఈ చిత్రాన్ని స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 25న తెలుగు తమిళ మలయాళ భాషల్లో విడుదల చేయాలని భావించారు. కానీ ఇప్పుడు మేకర్స్ మరో డేట్ కోసం ట్రై చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. 

ఇక నివేదా థామస్ విషయానికొస్తే, మలయాళ ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించింది. 'మధ్య వేనల్' అనే చిత్రంలో సపోర్టింగ్ క్యారక్టర్ చేసిన నివేదా.. 2011లో 'చెప్ప కురిష్' సినిమాతో లీడ్ యాక్ట్రెస్ గా మారింది. హీరోయిన్ పాత్రలే కాకుండా ప్రాధాన్యమున్న ఇతర పాత్రల్లోనూ నటించింది. 'దృశ్యం' తమిళ్ రీమేక్ లో కమల్ హాసన్ కూతురిగా, 'దర్బార్' చిత్రంలో రజనీకాంత్ కుమార్తెగా, 'జిల్లా' మూవీలో మోహన్ లాల్ డాటర్ గా నటించింది. నాని 'జెంటిల్ మెన్' మూవీతో టాలీవుడ్‌లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన నివేద.. నిన్ను కోరి, జై లవకుశ, బ్రోచేవారెవరురా, 118, వి, వ‌కీల్‌ సాబ్‌ సినిమాలతో మంచి పేరు తెచ్చుకుంది. చివరగా 2023లో 'ఎంతాడ సాజి' అనే మలయాళ మూవీలో కనిపించింది. ఈ మధ్య కాలంలో కాస్త బొద్దుగా మారిన ఈ బ్యూటీ ఇప్పుడు '35 చిన్న కథ కాదు' చిత్రంతో తెలుగు ఆడియన్స్‌ను పలకరించబోతోంది. మరి ఈ సినిమా ఆమెకు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి. 

Also Read: సందీప్ రెడ్డి వంగా అవన్నీ తప్పని నిరూపించాడు - 'యానిమల్' డైరెక్టర్‌ను ఆకాశానికి ఎత్తేసిన రామ్ గోపాల్ వర్మ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Indiramma Houses: అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు, రైతుల నుంచి ప్రతి గింజ కొంటాం: మంత్రి పొంగులేటి
అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు, రైతుల నుంచి ప్రతి గింజ కొంటాం: మంత్రి పొంగులేటి
Rohit Sharma: మరోసారి తండ్రైన రోహిత్ శర్మ, బాబుకు జన్మనిచ్చిన రితికా - ఆస్ట్రేలియాకు హిట్ మ్యాన్ !
మరోసారి తండ్రైన రోహిత్ శర్మ, బాబుకు జన్మనిచ్చిన రితికా - ఆస్ట్రేలియాకు హిట్ మ్యాన్ !
Jhansi Fire Accident: యూపీలోని ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం, 10 మంది చిన్నారులు సజీవదహనం
యూపీలోని ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం, 10 మంది చిన్నారులు సజీవదహనం -
IND vs SA 4th T20I Highlights: తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Indiramma Houses: అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు, రైతుల నుంచి ప్రతి గింజ కొంటాం: మంత్రి పొంగులేటి
అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు, రైతుల నుంచి ప్రతి గింజ కొంటాం: మంత్రి పొంగులేటి
Rohit Sharma: మరోసారి తండ్రైన రోహిత్ శర్మ, బాబుకు జన్మనిచ్చిన రితికా - ఆస్ట్రేలియాకు హిట్ మ్యాన్ !
మరోసారి తండ్రైన రోహిత్ శర్మ, బాబుకు జన్మనిచ్చిన రితికా - ఆస్ట్రేలియాకు హిట్ మ్యాన్ !
Jhansi Fire Accident: యూపీలోని ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం, 10 మంది చిన్నారులు సజీవదహనం
యూపీలోని ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం, 10 మంది చిన్నారులు సజీవదహనం -
IND vs SA 4th T20I Highlights: తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
Andhra News: ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Sabarimala Temple: శబరిమల అయ్యప్ప దర్శనాలు ప్రారంభం - ఏ సమయాల్లో దర్శించుకోవచ్చంటే?
శబరిమల అయ్యప్ప దర్శనాలు ప్రారంభం - ఏ సమయాల్లో దర్శించుకోవచ్చంటే?
Musi River: అచ్చం మూసీలాగే దక్షిణ కొరియాలోని హాన్ నది - పరిశీలించిన తెలంగాణ శాసన బృందం
అచ్చం మూసీలాగే దక్షిణ కొరియాలోని హాన్ నది - పరిశీలించిన తెలంగాణ శాసన బృందం
Embed widget