అన్వేషించండి

Ram Gopal Varma: సందీప్ రెడ్డి వంగా అవన్నీ తప్పని నిరూపించాడు - 'యానిమల్' డైరెక్టర్‌ను ఆకాశానికి ఎత్తేసిన రామ్ గోపాల్ వర్మ

Ram Gopal Varma: రామ్ గోపాల్ వర్మ 'యానిమల్' డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాను ప్రశంసించారు. భారీ వీఎఫ్ఎక్స్, భారీ ప్రొడక్షన్ కాస్ట్ లేకుండానే సక్సెస్ సాధించి అందరినీ ఆశ్చర్యపరిచాడని మెచ్చుకున్నారు.

Ram Gopal Varma on Sandeep Reddy Vanga's Animal: టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన హిందీ మూవీ 'యానిమల్'. బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్, రష్మిక మందన్న నటించిన ఈ యాక్షన్ డ్రామా.. బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. వైలెంట్ కంటెంట్ మరీ ఎక్కువ ఉందనే విమర్శలు వచ్చినప్పటికీ 2023లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 917 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తాజాగా ఈ చిత్రాన్ని మెచ్చుకున్నారు. భారీ బడ్జెట్ పెట్టకుండా, స్పెషల్ ఎఫెక్ట్స్‌పై ఆధారపడకుండా బ్లాక్‌ బస్టర్‌ రూపొందించడంలో సందీప్ సక్సెస్ అయ్యారని కొనియాడారు. 

రామ్ గోపాల్ వర్మ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో భారీ సినిమాలు, ఫిలిం మేకింగ్ పై తన అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రస్తుతం అధిక బడ్జెట్ ప్రాజెక్ట్‌లలో నటిస్తున్న స్టార్స్ అంతా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని చెప్పారు. హీరోల మధ్య పోటీ ఉంటుందని, ప్రతి బిగ్ స్టార్ తన ఫ్యాన్ ఫాలోయింగ్ ను మార్కెట్‌ను విస్తరించుకోవాలని కోరుకుంటాడని, అందుకే పెద్ద పెద్ద సినిమాలు తీయాలని అనుకుంటాడని అన్నారు. టెక్నికల్ గా భారీ వీఎఫ్ఎక్స్, భారీ ప్రొడక్షన్ డిజైన్ కాస్ట్ ద్వారానే అది సాధ్యమవుతుందని ఆ బిగ్ స్టార్స్ భావిస్తారని ఆర్జీవీ విశ్లేషించారు. అయితే దీనికి విరుద్ధంగా అధిక బడ్జెట్ ఖర్చు చేయకుండా 'యానిమల్' లాంటి సినిమా తీసాడని సందీప్ రెడ్డి వంగాను ప్రశంసించారు వర్మ. 

“సందీప్ రెడ్డి వంగా బిగ్ స్టార్స్ అభిప్రాయాలు తప్పని నిరూపించాడు. ఎందుకంటే ‘యానిమల్’ అతి తక్కువ ఖర్చుతో రూపొందించిన చిత్రం. మీరు రణబీర్ కపూర్‌ నటించిన ‘బ్రహ్మాస్త్ర’ లేదా ‘శంషేరా’లతో పోల్చి చూస్తే, నిర్మాణ వ్యయం పరంగా ‘యానిమల్’ అత్యంత తక్కువ బడ్జెట్ మూవీ. కానీ బిగ్ ప్రొడక్షన్ వాల్యూస్ అని పిలవబడే చిత్రాల కంటే చాలా బెటర్ గా పెరఫార్మ్ చేసింది. కాబట్టి ఇక్కడ కఠినమైన వేగవంతమైన రూల్స్ ఏమీ లేవు” అని రామ్ గోపాల్ వర్మ తెలిపారు. అయితే 'యానిమల్' సక్సెస్ ఇతర ఫిలిం మేకర్స్ ఇదే మార్గాన్ని ఫాలో అవుతారా అని అడిగితే మాత్రం వర్మ సందేహించారు.

“యానిమల్ హిట్టైంది కదా అని అందరూ ఫాస్ట్ గా, తక్కువ ఖర్చుతో సినిమాలు తీసి ఇంకా ఎక్కువ డబ్బు సంపాదించగలరా? అంటే.. నా ఉద్దేశ్యం ప్రకారం గతంలో భారీ నిర్మాణ విలువలతో చాలా సినిమాలు నిర్మించబడ్డాయి. కానీ ‘యానిమల్’ వచ్చి మనల్ని ఆశ్చర్యపరిచింది. ‘యానిమల్‌’ లాంటి సినిమాల వైపు ఆలోచించడానికి కొంత సమయం పడుతుంది. అమీర్ ఖాన్ 25 ఏళ్ళక్రితమే చిన్న సినిమాలు చేస్తూనే పెద్ద సినిమాలు చేసారు. కానీ ఇప్పుడు ఒక్క పర్సన్ కూడా అది ఫాలో అయినట్లు నాకు కనిపించడం లేదు” అని రామ్ గోపాల్ వర్మ చెప్పారు. వివిధ రకాలైన ప్రేక్షకులు వివిధ రకాల చిత్రాలను ఇష్టపడతారని, ఒకే రకమైన ఆడియన్స్ కు ‘గదర్ 2’ ‘యానిమల్’ రెండూ నచ్చడాన్ని తాను నమ్మలేకపోతున్నానని ఆర్జీవీ అన్నారు. 

గతంలోనూ సోషల్ మీడియా వేదికగా 'యానిమల్' చిత్రాన్ని, డైరెక్టర్ సందీప్ వంగాను ప్రశంసించారు వర్మ. ప్రేక్షకులపై ఈ సినిమా గట్టి ప్రభావమే చూపిస్తుందని, బాక్సాఫీస్‌ రన్ ముగిసిన తర్వాత కూడా చాలా ఏళ్ళు ఈ మూవీ గురించి వాదనలు కొనసాగుతాయని అన్నారు. ‘యానిమల్‌’ అనేది సినిమా కాదని, ఓ సోషల్‌ స్టేట్‌మెంట్‌ అని కొనియాడారు. ‘యానిమల్‌’ కథ, తండ్రీ కొడుకుల అనుబంధం ఏమంత ఎక్కలేదు కానీ, అలాంటి పాత కథా వస్తువుల్ని తీసుకొని సందీప్ మునుపెన్నడూ చూడని సీన్లని అద్భుతంగా చూపించాడు. సినిమా అంటే ఇలాగే ఉండాలని అనుకునే డైరెక్టర్లందరికీ ఫ్యూజులు ఎగిరిపోయేలా ఒక ఎలక్ట్రిక్‌ షాక్ ఇచ్చాడు. వాళ్ళు నమ్మే చాదస్తపు నైతిక విలువులన్నింటినీ తన చీపురు కట్టతో ఊడ్చి ఎత్తి చెత్త బుట్టలో పడేశాడు. ఇప్పటివరకూ అందరూ నమ్ముతున్న సినీ సంప్రదాయాలన్నింటినీ ఎడమ కాలి బూటుతో తన్ని రక్తాలు కక్కుకునేలా చేశాడు. బాలీవుడ్‌, టాలీవుడ్‌లోని ప్రతి సినిమా ఆఫీస్‌లోనూ 'యానిమల్' సినిమా టాపిక్ ఒక దెయ్యంలా ఆవహించి, ఇకపై వారు తీయబోయే ప్రతి సినిమానీ పీడిస్తుందని ఆర్జీవీ పోస్ట్ చేసారు.

Also Read: ఇండిపెండెన్స్ డే వార్ - అందరికీ హిట్టు కావలెను!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Flat Screen Vs Curved Screen: ఫ్లాట్ స్క్రీన్, కర్వ్‌డ్ స్క్రీన్ - ఈ రెండిట్లో ఏది ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవడం బెస్ట్!
ఫ్లాట్ స్క్రీన్, కర్వ్‌డ్ స్క్రీన్ - ఈ రెండిట్లో ఏది ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవడం బెస్ట్!
The Rana Daggubati Show: రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Flat Screen Vs Curved Screen: ఫ్లాట్ స్క్రీన్, కర్వ్‌డ్ స్క్రీన్ - ఈ రెండిట్లో ఏది ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవడం బెస్ట్!
ఫ్లాట్ స్క్రీన్, కర్వ్‌డ్ స్క్రీన్ - ఈ రెండిట్లో ఏది ఉన్న స్మార్ట్ ఫోన్ తీసుకోవడం బెస్ట్!
The Rana Daggubati Show: రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
Ranji Trophy 2024: రంజీ ట్రోఫీ చరిత్రలో మరో అద్భుతం, ప్రత్యర్థి టీమ్ మొత్తాన్ని ఆలౌట్ చేసిన ఒకే ఒక్కడు
రంజీ చరిత్రలో మరో అద్భుతం, ప్రత్యర్థి టీమ్ మొత్తాన్ని ఆలౌట్ చేసిన ఒకే ఒక్కడు
Royal Enfield Goan Classic 350: మరో వారంలో కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ - ఎప్పుడు లాంచ్ కానుందంటే?
మరో వారంలో కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ - ఎప్పుడు లాంచ్ కానుందంటే?
Best Winter Train Rides in India : వింటర్​ ట్రిప్​కి ఇండియాలో ఇవే బెస్ట్​.. ట్రైన్ జర్నీ చేస్తే మంచి ఎక్స్​పీరియన్స్ మీ సొంతం
వింటర్​ ట్రిప్​కి ఇండియాలో ఇవే బెస్ట్​.. ట్రైన్ జర్నీ చేస్తే మంచి ఎక్స్​పీరియన్స్ మీ సొంతం
Jyotula Nehru: ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్న జ్యోతుల నెహ్రూ - వైసీపీ సభ్యుల కన్నా ఘాటుగానే ప్రశ్నిస్తున్నారు  !
ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్న జ్యోతుల నెహ్రూ - వైసీపీ సభ్యుల కన్నా ఘాటుగానే ప్రశ్నిస్తున్నారు !
Embed widget