Bimbisara: 'బింబిసార 2'ను నేను డైరెక్ట్ చేయకపోవడానికి కారణం అదే - దర్శకుడు వశిష్ట
Vissishta : 'బింబిసారా' సీక్వెల్ గురించి డైరెక్టర్ వశిష్ట తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు.
Director Vassista About Bimbisara Sequel : నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన టైం ట్రావెల్ పీరియాడికల్ సోషియో ఫాంటసీ డ్రామా 'బింబిసార' బాక్సాఫీస్ ఎలాంటి సక్సెస్ ని అందుకుందో తెలిసిందే. వశిష్ఠ అనే డెబ్యూ డైరెక్టర్ ఈ సినిమాని తెరకెక్కించాడు. కళ్యాణ్ రామ్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది ఈ చిత్రం. అప్పటివరకు ఎన్నో సంవత్సరాలుగా వరుస అపజయాలు ఎదుర్కొంటున్న కళ్యాణ్ రామ్ కి ‘బింబిసార’ భారీ కం బ్యాక్ ఇచ్చింది. సినిమాలో కళ్యాణ్ రామ్ తన నటనతో అదరగొట్టాడు. 2022లో అత్యధిక కలెక్షన్స్ అందుకోవడంతో పాటూ కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే మైల్ స్టోన్ మూవీగా నిలిచింది.
ఇక ఈ సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు సోషియో ఫాంటసీ కథను వశిష్ట తెరపై ఆవిష్కరించిన విధానం ప్రేక్షకులతో పాటు శని ప్రముఖులను సైతం కట్టిపడేస్తుంది ఈ క్రమంలోనే అతనితో స్టార్ హీరోలు సినిమా చేసేందుకు ఆసక్తి చూపించారు ఇక రెండవ సినిమాకి వశిష్ఠ మెగాస్టార్ చిరంజీవి లాంటి స్టార్ తో సినిమా చేసే అవకాశాన్ని సొంతం చేసుకున్నాడు ఇదిలా ఉంటే బింబిసార చిత్రానికి సీక్వెల్ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. 'బింబిసార' రిలీజ్ టైం లోనే మూవీ టీం సీక్వెల్ ని కన్ఫర్మ్ చేశారు. 'బింబిసార' భారీ విజయాన్ని అందుకోవడంతో సీక్వెల్ పై అంచనాలు పెరిగిపోయాయి. ఈ సీక్వెల్ కోసం నందమూరి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అయితే తాజా ఇంటర్వ్యూలో వశిష్ఠ బింబిసార సీక్వెల్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు." బింబిసార సినిమాతో కల్యాణ్ రామ్ అవకాశం ఇవ్వడం వల్లనే నేను ఇక్కడ ఉన్నాను. కాకపోతే సీక్వెల్ మాత్రం నేను చేయడం లేదు. 'బింబిసార 2' విషయానికి వచ్చేసరికి నా ఐడియాలజీ వేరేగా ఉంది. అంతలో నాకు మెగా స్టార్ ప్రాజెక్టు చేసే ఛాన్స్ కూడా వచ్చింది. బింబిసార సీక్వెల్ విషయంలో నాకు కల్యాణ్ రామ్ గారికి మధ్య గ్యాప్ వచ్చింది అని చాలా మంది ప్రచారం చేశారు.. కాని నాకు మెగా ప్రాజెక్ట్ రావడంతో.. నేను కల్యాణ్ రామ్ గారి అనుమతి తీసుకునే బయటికి వచ్చాను. అంతే తప్ప మా మధ్య ఎలాంటి సమస్య రాలేదు. నేను మాట్లాడిన మాటలు చాలామంది వక్రీకరిస్తున్నారు" అని చెప్పుకొచ్చాడు వశిష్ట.
దీంతో ఈ డైరెక్టర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా బింబిసార సీక్వెల్ ని అనిల్ పాడురి అనే డెబ్యూ డైరెక్టర్ దర్శకత్వం వహించే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. ఈ అనిల్ పాడురి బింబిసార మూవీకి వీఎఫ్ఎక్స్ పనులు చూసుకున్నాడు. అతనే ఇప్పుడు 'బింబిసార 2' స్క్రిప్ట్ పై ఓ టీమ్ తో కలిసి పనిచేస్తున్నట్లు ఇండ్రస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై ఇంకా పూర్తి స్పష్టత రావాల్సి ఉంది. ఇక వశిష్ట ప్రస్తుతం మెగాస్టార్ మూవీతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి 'విశ్వంభర' అనే టైటిల్ ఫిక్స్ చేస్తూ తాజాగా రిలీజ్ చేసిన అనౌన్స్మెంట్ వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది.
Also Read ; రీజినల్ సినిమాతోనే రికార్డుల తాట తీస్తున్న మహేష్ - ఏకంగా 5 సినిమాలతో అరుదైన ఘనత!