Janaki Vs State Of Kerala: మూవీ టైటిల్ మార్చగలమా? - అనుపమ సినిమాకు మెలిక పెట్టిన సెన్సార్... ఆగ్రహం వ్యక్తం చేసిన డైరెక్టర్
Anupama Parameswaran: 'జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ' మూవీ వివాదం కొనసాగుతోంది. టైటిల్ మార్చాలన్న సెన్సార్ బోర్డు తీరుపై డైరెక్టర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

Director Praveen Narayanan About Janaki Vs State Of Kerala Name Change: గత కొద్ది రోజులుగా అనుపమ పరమేశ్వరన్ లేటెస్ట్ మూవీ 'జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ' మూవీపై వివాదం హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. ఈ మూవీ టైటిల్ మార్చాలని సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ నిరాకరించడంపై డైరెక్టర్ ప్రవీణ్ నారాయణన్ స్పందించారు.
టైటిల్ మార్చడం చాలా కష్టం
అత్యాచార బాధితురాలి నేపథ్యంలో తీసిన మూవీకి 'జానకి' అనే పేరు మార్చాలని సెన్సార్ బోర్డు ఈ మూవీకి సర్టిఫికెట్ నిరాకరించింది. దీనిపై డైరెక్టర్ ప్రవీణ్ స్పందించారు. మూవీ చివరి దశలో ఉందని... ఈ టైంలో టైటిల్ మార్చడం చాలా కష్టమని అన్నారు. 'జానకి అంటే సీతాదేవికి మరోపేరని అందరికీ తెలిసిన విషయమే. ఈ పేరును ఎన్నో విధాలుగా ఉపయోగిస్తారు. ఈ మూవీలో సీతాదేవిని ఎక్కడా కించపరచలేదు. ఎవరి మనోభావాలు దెబ్బతీసేలా మూవీ తీయలేదు.
సెన్సార్ బోర్డు చూసే కోణాన్ని మార్చుకోవాలని కోరుతున్నా. ప్రస్తుతం మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాం. ఈ దశలో పేరు మార్చడం చాలా కష్టం. సెన్సార్ చెప్పిన విధంగా టైటిల్ మారిస్తే చాలా డైలాగ్స్ మార్చాల్సి వస్తుంది.' అని అన్నారు.
Also Read: 'ఆంధీ వచ్చేసింది' - పవన్ 'హరిహర వీరమల్లు'లో మోదీ డైలాగ్... పవర్ స్టార్ పవర్ అట్లుంటది మరి
అసలేంటీ వివాదం?
నటుడు సురేష్ గోపి, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'జానకి వర్సెస్ ది స్టేట్ ఆఫ్ కేరళ'. ఇందులో లాయర్‌గా సురేష్ కనిపించగా... జానకి రోల్‌లో అనుపమ కనిపించనున్నారు. థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన ఈ మూవీపై సెన్సార్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసింది. కోర్ట్ రూమ్ డ్రామా మూవీలో 'జానకి' పేరు వాడడం, సీతాదేవి మరో పేరు కూడా ఇదే కావడంతో సర్టిఫికెట్ ఇచ్చేందుకు నిరాకరించింది. మూవీలో దాడికి గురైన మహిళ పాత్రకు ఆ పేరు పెట్టడం సమంజసం కాదని తెలిపింది. పేరు మార్చాలని కోరింది.
సెన్సార్ కార్యాలయం ఎదుట నిరసన
ఈ చిత్రానికి CBFC సర్టిఫికెట్ జారీ చేసేందుకు జాప్యం వహిస్తుండడంతో నిర్మాతలు హైకోర్టును ఆశ్రయించారు. అటు మలయాళ చిత్ర పరిశ్రమ కూడా సెన్సార్ బోర్డు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటీవల బోర్డు ప్రాంతీయ కార్యాలయం ఎదుట నిరసన తెలిపింది. అమ్మ, ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ కేరళ ఆధ్వర్యంలో మలయాళ సినీ, సీరియల్ ఆర్టిస్టుల సభ్యులు ధర్నాలో పాల్గొన్నారు. సెన్సార్ తీరు సరి కాదని... మూవీ టైటిల్ మారిస్తే చాలా డైలాగ్స్ మార్చాలని అంటున్నారు.
నిర్మాతల పిటిషన్‌పై విచారించిన హైకోర్టు... గతంలోనే ఇలాంటి పేర్లతో చాలా మూవీస్ వచ్చాయని... అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడు ఎందుకని ప్రశ్నించింది. 'జానకి' పేరు గౌరవనీయమైన దేవతగా భావించే సీతాదేవితో సంబంధం ఉండడంతో 1952 యాక్ట్ ప్రకారం ఉల్లంఘనకు దారి తీయొచ్చని తెలిపింది. అందుకే టైటిల్ మార్చాలని సూచించినట్లు తెలిపింది. మరి ఈ వివాదానికి ఎప్పుడు చెక్ పడుతుందో తెలియాల్సి ఉంది.





















