Predator Badlands Release Date: సైన్స్ ఫిక్షన్ హిస్టరీలోనే డేంజరస్ 'ప్రెడేటర్' - ఈసారి సరికొత్త స్టోరీతో వచ్చేస్తోంది... రిలీజ్ ఎప్పుడో తెలుసా?
Predator Badlands: సైన్స్ ఫిక్షన్ చరిత్రలోనే అత్యంత భయానకమైన పాత్ర 'ప్రెడేటర్'. ఈ ఫ్రాంచైజీలో కీలక మలుపుతో సరికొత్త స్టోరీతో 'ప్రెడేటర్: బ్యాడ్ ల్యాండ్స్' ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Dimitrius koloamatangi's Predator Badlands Release Date: సైన్స్ ఫిక్షన్ హిస్టరీలోనే అత్యంత డేంజరస్, భయానక పాత్రల్లో ఒకటి 'ప్రెడేటర్'. 1987లో ఫస్ట్ టైం సిల్వర్ స్క్రీన్‌పై కనిపించిన యౌట్జా జీవి... 4 దశాబ్దాలుగా ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేస్తూనే ఉంది. ఆ తర్వాత వచ్చిన సిరీస్‌ల్లో... అడవులు, నగరాలు, ఆపై ఇతర గ్రహాల్లోనూ తన వేట సాగిస్తూ ఓ మరిచిపోలేని ఎక్స్‌పీరియన్స్ అందించింది. ప్రస్తుతం తాజాగా మరో సరికొత్త స్టోరీతో ఎంటర్టైన్ చేసేందుకు వచ్చేస్తోంది.
స్టోరీలో కీలక మలుపు
ఈ సిరీస్‌లో 'ప్రెడేటర్: బ్యాడ్‌ల్యాండ్స్' అంటూ ఓ కీలక మలుపుతో రూపొందించారు డైరెక్టర్ డాన్ ట్రాచ్‌టెన్‌బర్గ్. గత వాటి కంటే భిన్నంగా స్టోరీలో కీలక మలుపు ఉన్నట్లు తెలుస్తోంది. వేటగాడే వేటలో చిక్కుకుపోయే కథాంశంతో రూపొందుతోంది. వరల్డ్ వైడ్‌గా నవంబర్ 7న మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ స్టోరీ యువ ప్రెడేటర్ 'డెక్' చుట్టూ తిరుగుతుంది. ఓ ప్రమాదకరమైన గ్రహంలో ఆండ్రాయిడ్ యోధురాలు 'థియా'తో కలిసి జీవన యుద్ధం సాగించాల్సి వస్తుంది. యౌట్జా జాతి సంస్కృతి, విలువలు, నైతికత, బలహీనతల్ని లోతుగా చూపించబోతున్న ఈ చిత్రం, ఈ ఫ్రాంచైజ్‌కు ఓ కొత్త మలుపు ఇవ్వనుందనే ఆశలు ఉన్నాయి.
'ప్రెడేటర్: బ్యాడ్‌ల్యాండ్స్' కేవలం యాక్షన్, థ్రిల్ మాత్రమే కాకుండా, యౌట్జా జీవుల అంతర్ముఖ ప్రపంచాన్ని కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. వేట అంటే ఏమిటి? వేటగాడి నైతిక సరిహద్దు ఎక్కడిదీ? అనే ప్రశ్నలతో సాగబోయే ఈ చిత్రం, ప్రెడేటర్ సిరీస్ అభిమానులందరికీ మిస్ కాకూడని ఎక్స్‌పీరియన్స్ అందించనున్నట్లు తెలుస్తోంది.
Also Read: పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - 'ఉస్తాద్ భగత్ సింగ్' రిలీజ్ అప్పుడేనా?
1987లో గ్రేట్ ఎక్స్‌పీరియన్స్ స్టార్ట్
అర్నాల్డ్ ష్వార్జె నెగర్ ప్రధాన పాత్రలో వచ్చిన తొలి 'ప్రెడేటర్' చిత్రం అమెజాన్ అడవుల్లో కమాండోలు ఎదుర్కొన్న కంటికి కనిపించని భయానక మృగం కథతో ప్రేక్షకులను కుదిపేసింది.
1990లో 'ప్రెడేటర్ 2' – కాంక్రీట్ జంగిల్
ఈసారి లాస్ ఏంజెల్స్ నగరాన్ని వేటస్థలంగా మార్చుకున్న యౌట్జా, గ్యాంగ్‌స్టర్లను, పోలీసులను లక్ష్యంగా చేసుకున్నాడు. మానవ చరిత్రలో ఈ జీవుల ఉనికి ఎంతకాలంగా ఉందో ఈ చిత్రంలో చూపించారు.
2010లో 'ప్రెడేటర్స్' – గేమ్ ప్రిజర్వ్ అండ్ బియాండ్ ప్రెడేటర్స్
ఈ భాగంలో మానవ యోధులను ప్రెడేటర్ల స్వగ్రహానికి తీసుకెళ్లి బంధిస్తారు. అక్కడ వారు సూపర్ ప్రెడేటర్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ కథ యౌట్జా జాతి అంతర్గత విభేదాలను కూడా చూపించింది.
2022లో – ఎ రిటర్న్ టు రూట్స్ ప్రే
1719లో అమెరికాలోని కమాంచీ తెగకు చెందిన యువతి నారు కథతో తెరకెక్కిన “ప్రే”, ప్రెడేటర్ సిరీస్‌కు కొత్త ఊపును తెచ్చింది. కొత్త కాలం, కొత్త దృష్టికోణంతో వేటను చూపిస్తూ అభిమానులను ఆకట్టుకుంది. ఇప్పుడు సరికొత్తగా 'ప్రెడేటర్: ది బ్యాడ్ ల్యాండ్స్'తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇంతకు ముందు వాటి కంటే గ్రేట్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వడం ఖాయమంటూ మూవీ లవర్స్ అంటున్నారు.





















