Idly Kadai postponed : 'ఇడ్లీ కడై' మూవీ రిలీజ్ పోస్ట్ పోన్... అజిత్ కోసమే ధనుష్ వెనక్కి తగ్గుతున్నాడా?
Idly Kadai postponed : ధనుష్ దర్శకత్వం వహించిన 'ఇడ్లీ కడై' ఏప్రిల్ 10న విడుదల కావాల్సి ఉంది. అజిత్ కుమార్ 'గుడ్ బ్యాడ్ అగ్లీ'తో క్లాష్ కారణంగా ఈ మూవీని వాయిదా వేసినట్లు సమాచారం.

కోలీవుడ్ స్టార్ ధనుష్ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఇడ్లీ కడై' అనే కొత్త మూవీ సమ్మర్ కానుకగా ఏప్రిల్ 10న రిలీజ్ కాబోతుందని అఫీషియల్ గా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. కానీ తాజాగా కోలీవుడ్ లో వినిపిస్తున్న వార్తల ప్రకారం 'గుడ్ బ్యాడ్ అగ్లీ'తో క్లాష్ అవ్వకుండా ఉండడానికి ధనుష్ తన మూవీని వాయిదా వేసినట్టుగా తెలుస్తోంది.
'ఇడ్లీ కడై' రిలీజ్ పోస్ట్ పోన్
ధనుష్ దర్శకత్వంలో రూపొందుతున్న నాల్గవ సినిమా 'ఇడ్లీ కడై'. ఇందులో ధనుష్ హీరోగా నటిస్తుండగా, నిత్యామీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో 'తిరుచిత్రంబలం' మూవీ తర్వాత ధనుష్, నిత్యమీనన్ మరోసారి ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేయబోతున్నారు. షాలిని పాండే ఇందులో మరో హీరోయిన్ గా కన్పించనుంది. ధనుష్ - ఆకాష్ భాస్కరన్ వండర్ బార్ ఫిలిమ్స్ బ్యానర్ పై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జీవి ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. అయితే ఈ మూవీని ఏప్రిల్ 10న థియేటర్లలోకి తీసుకురాబోతున్నామని ఎప్పుడో ప్రకటించారు. కానీ ఇటీవల కాలంలో మూవీ వాయిదా పడబోతోంది అనే వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. 'జాబిలమ్మ నీకు అంత కోపమా' సినిమా ఈవెంట్లో మూవీ పోస్ట్ పోన్ అయ్యే అవకాశం లేదని మేకర్స్ క్లారిటీ కూడా ఇచ్చారు. కానీ తాజాగా మరోసారి 'ఇడ్లీ కడై' మూవీ అజిత్ కొత్త మూవీ 'గుడ్ బ్యాడ్ అగ్లీ' కారణంగా వాయిదా పడనుందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై అఫీషియల్ గా అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది.
Also Read: తండ్రిని కొడుకు ఎందుకు హత్య చేయాలనుకున్నాడు? - ఓటీటీలోకి వచ్చేస్తోన్న 'రామం రాఘవం', ఎందులోనో తెలుసా!
'విడామూయార్చి' మూవీ తర్వాత కోలీవుడ్ స్టార్ తల అజిత్ కుమార్ నటించిన మరో కొత్త యాక్షన్ థ్రిల్లర్ 'గుడ్ బ్యాడ్ అగ్లీ' థియేటర్లోకి రాబోతోంది. ఈ వేసవిలోనే మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన టీజర్ రిలీజ్ కాగా, టీజర్ లో ఈ మూవీని ఏప్రిల్ 10న సమ్మర్ కానుకగా రిలీజ్ చేయబోతున్నామని అనౌన్స్ చేశారు. ఇందులో త్రిష - అజిత్ మరోసారి జంటగా తెరపై సందడి చేయబోతున్నారు. మరోవైపు అదే తేదీన 'ఇడ్లీ కడై' మూవీ రిలీజ్ ఉండడంతో, రెండు సినిమాల మధ్య క్లాష్ రాకుండా ఉండడానికి ధనుష్ వెనకడుగు వేయబోతున్నాడని అంటున్నారు.
ధనుష్ దర్శకత్వంలో అజిత్?
అజిత్ కోసం ధనుష్ ఇలా బాక్స్ ఆఫీస్ బరిలో నుంచి తప్పుకోవడానికి కారణం వేరే ఉందని అంటున్నారు. ప్రస్తుతం కోలీవుడ్లో ధనుష్, అజిత్ ఇద్దరూ స్టార్ హీరోలే. కానీ త్వరలోనే ధనుష్ దర్శకత్వంలో అజిత్ కుమార్ హీరోగా నటించబోతున్నట్టు టాక్ నడుస్తోంది. ధనుష్ సొంత నిర్మాణ సంస్థ వండర్ బార్ పిక్చర్స్ బ్యానర్స్ లో అజిత్ కుమార్ హీరోగా నటించే అవకాశం ఉందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇంకా టైటిల్ ఖరార్ చేయని ఈ సినిమాకి అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తారని అంటున్నారు. దీనిపై కూడా ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.





















