Dhanush Mrunal Thakur Wedding: ధనుష్, మృణాల్ ఠాకూర్ పెళ్లి ముహూర్తం ఖరారైందా? అసలు నిజం ఏమిటంటే??
Dhanush Mrunal Thakur Wedding Date: పాన్ ఇండియా స్థాయిలో ఫాలోయింగ్ ఉన్న ధనుష్, హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ప్రేమలో ఉన్నారని కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు వాళ్ళ వెడ్డింగ్ డేట్ వచ్చింది.

పాన్ ఇండియా స్థాయిలో ఫాలోయింగ్ ఉన్న కోలీవుడ్ స్టార్ ధనుష్. సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తెతో విడిపోయాక ఒంటరిగా ఉంటున్నారు. ఈ హీరోతో మృణాల్ ఠాకూర్ చాలా కాలంగా డేట్ చేస్తున్నారని రూమర్స్ వినిపిస్తున్నాయి. తాజా రూమర్స్ ప్రకారం... ఈ జంట రాబోయే లవర్స్ డే (వాలెంటైన్స్ డే - ఫిబ్రవరి 14)న వివాహం చేసుకోబోతున్నారట. అయితే, మృణాల్ లేదా ధనుష్ ఈ రూమర్స్ పై స్పందించలేదు.
ధనుష్-మృణాల్ పెళ్లి చేసుకోబోతున్నారా?
ఫ్రీ ప్రెస్ జర్నల్ నివేదిక ప్రకారం... సన్నిహితుల సమక్షంలో ఈ ప్రేమికుల రోజు నాడు ధనుష్, మృణాల్ ఠాకూర్ వివాహం చేసుకోవాలని ఆలోచిస్తున్నారట. వివాహ వేడుకలో సన్నిహిత కుటుంబ సభ్యులు, స్నేహితులు మాత్రమే పాల్గొంటారట. ధనుష్, మృణాల్ వివాహం గురించి వస్తున్న రూమర్స్ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. అయితే ఇద్దరిలో ఎవరూ ఇంకా ఈ పుకార్లను ధృవీకరించలేదు లేదా ఖండించనూ లేదు.
Also Read: సినిమా డిజాస్టర్... దెబ్బకు 15 కోట్ల రెమ్యూనరేషన్ తగ్గించుకున్న హీరో
అసలు డేటింగ్ రూమర్స్ ఎందుకు వచ్చాయి?
మృణాల్ ఠాకూర్, ధనుష్ లవ్ అఫైర్ గురించి చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. హిందీలో మృణాల్ ఠాకూర్ నటించిన 'సన్ ఆఫ్ సర్దార్ 2' ప్రీమియర్‌లో ధనుష్ కనిపించడంతో వీళ్ళిద్దరి రిలేషన్‌షిప్, డేటింగ్ రూమర్స్ ప్రారంభం అయ్యాయి. ఇంతకు ముందు ధనుష్ సినిమా 'తేరే ఇష్క్ మే' షూటింగ్ ఫినిష్ అయిన సందర్భంగా ఇచ్చిన పార్టీలోనూ మృణాల్ హాజరు కావడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే... ఇన్స్టాగ్రామ్‌లో ధనుష్ సోదరీమణులు డాక్టర్ కార్తీక కార్తీక్, విమల గీతాలను మృణాల్ ఫాలో అవుతున్నారు.
ధనుష్‌తో డేటింగ్ గురించి మృణాల్ ఏమన్నారు?
గత సంవత్సరం ధనుష్‌తో తన డేటింగ్ రూమర్స్, ఊహాగానాలపై మృణాల్ ఠాకూర్ స్పందిస్తూ... ''ధనుష్ నాకు ఓ మంచి స్నేహితుడు" అని చెప్పారు. ధనుష్ విషయానికి వస్తే... ఐశ్వర్య రజనీకాంత్‌తో అతని మొదటి వివాహం జరిగింది. 18 సంవత్సరాలు వైవాహిక బంధం తర్వాత 2022లో విడిపోతున్నట్లు ప్రకటించారు. వీరిద్దరూ 2003లో వచ్చిన 'కధల్ కొండెన్' సినిమా షూటింగ్‌లో కలిశారు. వారికి యాత్ర, లింగా - ఇద్దరు కుమారులు ఉన్నారు.
Also Read: NTR Dragon: ఎన్టీఆర్ 'డ్రాగన్'లో బాలీవుడ్ నటుడు... అప్పుడు రణబీర్ తండ్రిగా, ఇప్పుడు?





















