(Source: Poll of Polls)
Devara Movie: 'దేవర'లో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం? - ఇదిగో క్లారిటీ!
Devara Movie: చిత్రంలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేయబోతున్నాడంటూ కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ ఇందులో తండ్రి, కొడుకులుగా కనిపిస్తారంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.
Jr NTR Devara Movie: యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ దేవర. కొరటాల శివ దర్శకత్వంతో యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్న ఈ మూవీ భారీ బజ్ నెలకొంది. ట్రిపుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తన్న ఫస్ట్ మూవీ ఇది. దీంతో దేవరపై ఓ రేంజ్‌లో హైప్ క్రియేట్ అయ్యింది. దానికి మూవీ నుంచి వస్తున్న అప్‌డేట్ మరిన్ని ఎక్స్‌పెక్టేషన్స్ పెంచుతున్నాయి. మూవీపై ప్రకటన వచ్చినప్పటి నుంచి దేవరకు సంబంధించి ఏదోక రూమర్, అప్‌డేట్ వార్తల్లో నిలుస్తూనే ఉంది. అందులో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేయబోతున్నాడనేది ఒకటి. మూవీ షూటింగ్ మొదలైన తర్వాత ఎన్టీఆర్ ఇందులో డబుల్ రోల్ చేయబోతున్నట్టు గుసగుసల వినిపించాయి.
అంతా పోస్టర్‌లోనే ఉంది
అంతేకాదు ఇందులో ఎన్టీఆర్ తండ్రి, కొడుకులుగా కనిపిస్తారనే ప్రచారం కూడా ఉంది. అయితే దీనిపై ఇప్పటి వరకు మూవీ టీం నుంచి క్లారిటీ రాలేదు. ఇక ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా రిలీజ్ చేయబోతున్నట్టు ఇటీవల అధికారిక ప్రకటన రావడంతో దీనిపై మరింత గట్టి ప్రచారం జరుగుతుంది. దానికి నిన్న రిలీజ్ అయిన పోస్టర్ మరింత బలాన్ని ఇస్తుంది. రిలీజ్ డేట్‌ను ఆనౌన్స్ చేస్తూ మేకర్స్ నిన్న కొత్త పోస్టర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ కొత్త పోస్టర్‌లో తారక్ యంగ్ లుక్‌లో కనిపించాడు. అంతేకాదు ఫస్ట్ పోస్టర్‌తో చూస్తే ఇందులో అతడి గేటప్ కూడా డిఫరేంట్‌గా ఉంది. ఇక ఈ పోస్టర్ మీద ఉన్న దేవర పేరులో 'వర' ఎర్ర అక్షరాలతో చూపించారు.
Also Read: 'పుష్ప: ది రైజ్' మూవీకి మరో అరుదైన గౌరవం - ఇంటర్నేషన్ వేదికపై స్క్రీనింగ్
అంటే ఇందులో తారక్‌ది డ్యూయెల్ రోల్ అని మూవీ టీం చెప్పకనే చెప్పిందంటున్నారు. ప్రస్తుతం ఇది ఇండస్ట్రీలో హాట్‌టాపిక్ అవుతుంది. ఈ పోస్టర్ చూసి తారక్ ద్విపాత్రాభియనం చేస్తున్నాడనేది నిజమని, దేవ్-వరగా ఎన్టీఆర్ తండ్రి-కొడుకుల పాత్రల్లో అలరించబోతున్నాడని ప్రస్తుతం ప్రచారం మొదలైంది. కాగా ఈ చిత్రంలో ఎన్టీఆర్‌కు జోడిగా బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ నటిస్తుంది. ఈ చిత్రంలోనే ఆమె టాలీవుడ్‌కు పరిచయం కాబోతుంది. ఇక ఇందులో ప్రకాశ్ రాజ్, శ్రీకాంత్, టామ్ షైన్ చాకో, నరైన్ వంటి స్టార్స్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్‌పై మిక్కిలినేని సుధాకర్, హరిక్రష్ణ కే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనిరుద్ సింగీతం అందిస్తుండగా.. శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్‌గా, రత్నవేలు సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు.
#Devara Part 1 releasing on 10.10.24. pic.twitter.com/AK4EvxQBz7
— Jr NTR (@tarak9999) February 16, 2024
దసరాకు దేవర పార్ట్ 1 విడుదల
10.10.2024... అక్టోబర్ 10న 'దేవర' చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. దేవి నవరాత్రుల సందర్భంగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. అక్టోబర్ 10 గురువారం వచ్చింది. లాంగ్ వీకెండ్, ఫెస్టివల్ సీజన్ సినిమాకు కలిసి వస్తుందని చెప్పాలి. 'జనతా గ్యారేజ్' తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా 'దేవర'. ఇందులో ఆయన జోడీగా అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ నటిస్తున్నారు. సైఫ్ అలీ ఖాన్ విలన్ రోల్ చేస్తున్నారు. ఎన్టీఆర్ సోదరుడు నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ సంస్థలపై సినిమా రూపొందుతోంది. కొరటాల శివ సన్నిహిత మిత్రులు మిక్కిలినేని సుధాకర్, కళ్యాణ్ రామ్ బావమరిది హరికృష్ణ .కె నిర్మిస్తున్నారు.