AA22xA6 movie: ఇట్స్ అఫీషియల్... అల్లు అర్జున్ సినిమాలో దీపికా పదుకోన్... అట్లీ గట్టిగా ప్లాన్ చేశాడుగా
Deepika Padukone in AA22 Movie: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వం వహిస్తున్న సినిమాలో హీరోయిన్‌గా దీపికా పదుకోన్‌ను తీసుకున్నట్లు అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు.

Allu Arjun's AA22xA6 movie update: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా అట్లీ దర్శకత్వంలో పాన్ వరల్డ్ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో హీరోయిన్ ఎవరు? అనే ప్రశ్నకు సమాధానం అధికారికంగా లభించింది.
అల్లు అర్జున్ సినిమాలో దీపికా పదుకోన్!
అల్లు అర్జున్ అట్లీ సినిమాకు ఐకాన్ టైటిల్ పరిశీలనలో ఉంది. ఆ విషయంపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. అయితే ఈ రోజు బాలీవుడ్ భామ దీపికా పదుకోన్ సినిమాలో నటిస్తున్నట్లు అనౌన్స్ చేశారు.
బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కథానాయకుడిగా అట్లీ దర్శకత్వం వహించిన జవాన్ సినిమాలో దీపికా పదుకోన్ నటించారు. ఇప్పుడు మరోసారి డైరెక్టర్ అండ్ హీరోయిన్ కాంబినేషన్ రిపీట్ అవుతోంది. అల్లు అర్జున్ దీపిక కాంబినేషన్ ఇదే ఫస్ట్ టైం. సినిమాలో దీపికా నటిస్తున్న విషయాన్ని వెల్లడిస్తూ విడుదల చేసిన వీడియో చూస్తే... ఆవిడ వారియర్ ప్రిన్సెస్ రోల్ చేస్తన్నట్లు అర్థం అవుతోంది. ఆల్రెడీ మోషన్ పిక్చర్ క్యాప్చర్ టెక్నాలజీతో ఆవిడకు సంబంధించి కొన్ని షాట్స్ తీసినట్టు తెలుస్తోంది.
The Queen marches to conquer!❤🔥
— Sun Pictures (@sunpictures) June 7, 2025
Welcome onboard @deepikapadukone✨#TheFacesOfAA22xA6
▶️ https://t.co/LefIldi0M5#AA22xA6 - A Magnum Opus from Sun Pictures💥@alluarjun @Atlee_dir#SunPictures #AA22 #A6 pic.twitter.com/85l7K31J8z
దీపికాతో పాటు సినిమాలో మరో ఇద్దరు హీరోయిన్లకు చోటు ఉందని తెలిసింది. అల్లు అర్జున్ త్రిపుల్ రోల్ చేస్తున్నారని సమాచారం. అందులో ఒకటి ఫాదర్ క్యారెక్టర్ అయితే... మరో రెండు క్యారెక్టర్లు అన్నదమ్ములు అని, అందులో ఒక క్యారెక్టర్ హీరో అయితే మరొక క్యారెక్టర్ విలన్ అని ప్రచారం జరుగుతోంది. దీపికాతో పాటు మిగతా ఇద్దరు హీరోయిన్లను కూడా ఫైనలైజ్ చేసారని టాక్. శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్, 'సీతా రామం' భామ మృణాల్ ఠాకూర్ నటించనున్నట్లు తెలిసింది.
అల్లు అర్జున్ అట్లీ సినిమాను సన్ పిక్చర్స్ సంస్థ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ మూవీ కోసం 600 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించినట్లు చెన్నై సినిమా వర్గాలు చెబుతున్నాయి. ఇండియాలోని భారీ బడ్జెట్ సినిమాలలో ఇది ఒకటి అవుతుందని అంటున్నారు. విజువల్ ఎఫెక్ట్స్ వర్క్స్ కోసం అమెరికా వెళ్లి అక్కడ పాపులర్ కంపెనీలతో అల్లు అర్జున్ అట్లీ మాట్లాడిన సంగతి తెలిసిందే.





















