అన్వేషించండి

Dacoit Collection : డెకాయిట్ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ - అడివి శేష్ మాస్ జాతర కంటిన్యూ అవుతోందిగా...

Dacoit Day 3 Collection : అడివి శేష్ డెకాయిట్ కలెక్షన్స్ మూడో రోజు స్థిరంగా కంటిన్యూ అయ్యాయి. ఫస్ట్ వీకెండ్ తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లోనూ మంచి కలెక్షన్స్ రాబట్టింది.

Adivi Sesh's Dacoit First Weekend Box Office Collection : యంగ్ హీరో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన లేటెస్ట్ రొమాంటిక్  డ్రామా డెకాయిట్ ముందు మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్నా... కలెక్షన్స్ పరంగా చూస్తే దూసుకెళ్తోంది. ఫస్ట్ వీకెండ్ వరల్డ్ వైడ్‌గా సాలిడ్ వసూళ్లు రాబట్టింది. ఇటు ఇండియావ్యాప్తంగా అటు ఓవర్సీస్‌లోనూ అంతే స్థాయిలో నెంబర్స్ నమోదు చేసింది. మరి ఫస్ట్ వీకెండ్ రిపోర్ట్ చూస్తే...

ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ 

డెకాయిట్ వరల్డ్ వైడ్‌గా మూడు రోజుల్లో రూ.34 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్లు రిపోర్ట్స్ ప్రకారం తెలుస్తోంది. ఇండియావ్యాప్తంగా రూ.23.12 కోట్ల గ్రాస్ కలెక్షన్స్, రూ.19.80 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించినట్లు ట్రేడ్ పోర్టల్ సాక్నిల్క్ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 1,13,000కు పైగా టికెట్స్ సేల్ అయినట్లు తెలుస్తోంది. దీంతో సోమవారం కూడా అంతే స్థాయిలో వసూళ్లు ఉండే ఛాన్స్ ఉంది. అటు, హిందీలో 'ధురంధర్ 2' ఎఫెక్ట్‌తో అంతగా ప్రభావం చూపకపోయినా కలెక్షన్స్ మాత్రం కాస్త నిలకడగా ఉన్నాయి.

ఫుల్ రిపోర్ట్

  • ఇండియాలో 3 రోజుల గ్రాస్ కలెక్షన్స్ - రూ.23.12 కోట్లు
  • ఇండియాలో 3 రోజుల నెట్ కలెక్షన్స్ - రూ.19.80 కోట్లు
  • వరల్డ్ వైడ్ 3 రోజుల గ్రాస్ కలెక్షన్స్ - రూ.34 కోట్లు
  • తెలుగు రాష్ట్రాల్లో డే 3 కలెక్షన్స్ - రూ.4.80 కోట్లు
  • ఓవర్సీస్ 3 రోజుల గ్రాస్ కలెక్షన్స్ - రూ.11.65 కోట్లు సాధించినట్లు తెలుస్తోంది.

Also Read : కష్టాల కడలిలో 'ఆశా'... ప్రెగ్నెన్సీ టైంలో ఆత్మహత్యాయత్నం! - ఇబ్బందులను ఓర్చి ఉన్నత శిఖరాలకు

ఈ మూవీకి షానిల్ డియో దర్శకత్వం వహించగా... శేష్, మృణాల్‌లతో పాటు జైన్ మేరీ ఖాన్, ప్రకాష్ రాజ్, సునీల్, అనురాగ్ కశ్యప్, అతుల్ కులకర్ణి తదితరులు కీలకపాత్రలు పోషించారు. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందించగా... అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో ఎస్ఎస్ క్రియేషన్స్, సునీల్ నారంగ్ ప్రొడక్షన్స్ సంస్థలపై సుప్రియ యార్లగడ్డ నిర్మించారు.

స్టోరీ ఏంటంటే?

తను ప్రాణంగా ప్రేమించిన సరస్వతి అలియాస్ జూలియట్ (మృణాల్ ఠాకూర్) వల్ల హరిదాస్ (అడివి శేష్) ఓ మర్డర్ కేసులో ఇరుక్కుంటాడు. ప్రియురాలు చేసిన మోసంతో 13 ఏళ్లు జైలు జీవితం గడపాల్సి వస్తుంది. తన ప్రేయసిపై పగ తీర్చుకోవాలని భావిస్తాడు. ఇషాద్ భాయ్ (అతుల్ కులకర్ణి) సాయంతో పోలీసుల నుంచి తప్పించుకుంటాడు హరిదాస్. ఆ తర్వాత తాను దుబాయ్ వెళ్లేందుకు రూ.60 లక్షలు అవసరం కాగా... ఆ డబ్బు కోసం యత్నిస్తుంటాడు.

 ఇదే టైంలో తన మాజీ ప్రేయసి జూలియట్ భర్త అనారోగ్యంతో ఆస్పత్రి పాలయ్యాడని తెలుసుకుంటాడు. తన భర్త ఆరోగ్యం కోసం ఆమెకు రూ.కోటి కావాలని తెలుసుకుని ఆ అవసరంతో ఆమెను దెబ్బ కొట్టాలని ప్లాన్ చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? భార్యాభర్తలు కావాల్సిన వారు బద్ధ శత్రువులుగా ఎలా మారారు? హరిదాస్‌ను జూలియట్ చేసిన మోసం ఏంటి? ఆమె చేసిన మోసానికి భర్తకు ఉన్న లింకేంటి? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.

 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Agadha Twitter Review - అగధ ట్విట్టర్ రివ్యూ: కాలయంత్రం క్లైమాక్స్ సూపర్... ఎంఎస్ రాజు థ్రిల్లర్ సినిమా ప్రీమియర్స్ రిపోర్ట్
అగధ ట్విట్టర్ రివ్యూ: కాలయంత్రం క్లైమాక్స్ సూపర్... ఎంఎస్ రాజు థ్రిల్లర్ సినిమా ప్రీమియర్స్ రిపోర్ట్
Memu Copulam Series OTT : మెగా బ్రదర్ విలేజ్ కామెడీ సిరీస్ - ఈ ఓటీటీలో ఫ్రీగా చూసెయ్యొచ్చు... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
మెగా బ్రదర్ విలేజ్ కామెడీ సిరీస్ - ఈ ఓటీటీలో ఫ్రీగా చూసెయ్యొచ్చు... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
I'm Game New Release Date : దుల్కర్ సల్మాన్ యాక్షన్ థ్రిల్లర్ పోస్ట్ పోన్ - కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
దుల్కర్ సల్మాన్ యాక్షన్ థ్రిల్లర్ పోస్ట్ పోన్ - కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
Vishwanath And Sons First Review - 'విశ్వనాథ్ అండ్ సన్స్' ఫస్ట్ రివ్యూ: అత్తారిల్లు, మిస్టర్ పర్ఫెక్ట్ గుర్తొస్తాయా? సూర్య సినిమా టాక్ ఎలా ఉందంటే?
'విశ్వనాథ్ అండ్ సన్స్' ఫస్ట్ రివ్యూ: అత్తారిల్లు, మిస్టర్ పర్ఫెక్ట్ గుర్తొస్తాయా? సూర్య సినిమా టాక్ ఎలా ఉందంటే?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adilabad Latest News: నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Embed widget