Nayanthara, Madhavan, Siddharth : నయనతార - మాధవన్ - సిద్ధార్థ్ - ఓ 'టెస్ట్'
Test Movie : నయనతార, మాధవన్, సిద్ధార్థ్ ప్రధాన పాత్రల్లో ఓ సినిమా రూపొందుతోంది. దానికి 'టెస్ట్' టైటిల్ ఖరారు చేశారు.
నయనతార (Nayanthara) కొత్త సినిమాకు సంతకం చేశారు. ప్రస్తుతం హిందీలో షారుఖ్ ఖాన్ సరసన 'జవాన్' (SRK Jawan)లో ఆమె నటిస్తున్నారు. నయన్ చేతిలో మరో రెండు తమిళ చిత్రాలు ఉన్నాయి. ఇప్పుడు మరో సినిమా అంగీకరించారు. అంగీకరించడమే కాదు... సెట్స్ మీదకు తీసుకు వెళ్ళారు. విశేషం ఏమిటంటే... ఈ సినిమాలో ఇద్దరు హీరోలు ఉన్నారు.
మాధవన్... సిద్ధార్థ్... టెస్ట్!
నయనతార, మాధవన్ (R Madhavan), సిద్ధార్థ్ ప్రధాన పాత్రల్లో రూపొందుతోన్న సినిమా 'టెస్ట్' (Test Movie). టైటిల్ వింటే జానర్ ఏమిటో అర్థం అయ్యేలా ఉంది కదూ! అవును... ఇది క్రికెట్ బేస్డ్ సినిమా (Sports Based Movie)! టెస్ట్ క్రికెట్ మ్యాచ్ నేపథ్యంలో సాగుతుందని తెలిసింది.
దర్శకుడిగా నిర్మాత శశికాంత్!
'టెస్ట్' సినిమాకు శశికాంత్ దర్శకత్వం వహించనున్నారు. వై నాట్ స్టూడియోస్ పతాకంపై సిద్ధార్థ్ హీరోగా 'లవ్ ఫెయిల్యూర్', 'కావ్య తలైవన్', మాధవన్ హీరోగా 'ఇరుది సుట్రు' (తెలుగులో వెంకటేష్ హీరోగా 'గురు' పేరుతో రీమేక్ చేశారు), 'విక్రమ్ వేద' సినిమాలను శశికాంత్ ప్రొడ్యూస్ చేశారు. నిర్మాతగా ఇప్పటి వరకు అనేక సినిమాలు తీసిన ఆయన, ఫస్ట్ టైమ్ మెగాఫోన్ పడుతున్నారు. ఆయన నిర్మించిన సినిమాల్లో స్పోర్ట్స్ బేస్డ్ సినిమాలు కొన్ని ఉన్నాయి. ఇప్పుడు దర్శకుడిగా పరిచయం అవుతున్న సినిమా కూడా స్పోర్ట్స్ బేస్డ్ కావడం విశేషం!
పదిహేడేళ్ల తర్వాత మాధవన్, సిద్ధార్థ్...
Test Movie Begins Today : 'టెస్ట్' సినిమా స్పెషాలిటీ ఏంటంటే... మాధవన్, సిద్ధార్థ్ (Siddharth) కలిసి 17 ఏళ్ళ తర్వాత కలిసి చేస్తున్న చిత్రమిది. హిందీ సినిమా 'రంగ్ దే బసంతి'లో వాళ్ళిద్దరూ నటించారు. ఆ తర్వాత ఇప్పటి వరకు మరో సినిమా చేయలేదు. తమిళంతో పాటు తెలుగు, హిందీ, ఇతర భాషల్లో విడుదల చేసేలా 'టెస్ట్' రూపొందిస్తున్నారట. ఇది పాన్ ఇండియా స్పోర్ట్స్ ఫిల్మ్. క్రికెట్ అంటే ఇండియాలో చాలా మంది ఫేవరెట్ స్పోర్ట్. అందువల్ల, ఈ సినిమాకు ఆదరణ బావుంటుందని ఆశించవచ్చు.
మాధవన్... 20 ఏళ్ళ క్రితం!
సరదాగా క్రికెట్ ఆడుతూ సిద్ధార్థ్ కొన్ని సినిమాల్లో కనిపించారు. అయితే, ప్రొఫెషనల్ క్రికెట్ రోల్ ఎప్పుడూ చేయలేదు. మాధవన్ 'ప్రియమణ తొళి' సినిమాలో క్రికెటర్ రోల్ చేశారు. ఆ సినిమా విడుదలైన 20 ఏళ్లకు మళ్ళీ ఆయన క్రికెట్ నేపథ్యంలో సినిమా చేస్తున్నారు. ఇందులో ఆయనది కోచ్ రోలా? లేదంటే క్రికెటరా? అనేది కొన్ని రోజులు ఆగితే తెలుస్తుంది.
Also Read : మోహన్ లాల్ గ్యారేజీలో నయా కార్ - రేటు ఎంతో తెలుసా?
పూజతో సినిమా షురూ!
చెన్నైలో వై నాట్ స్టూడియోస్ సంస్థ కార్యాలయంలో పూజా కార్యక్రమాలతో 'టెక్స్ట్' సినిమా మొదలైంది. అంతే కాదు... సినిమా మోషన్ పోస్టర్ కూడా విడుదల చేశారు. అది చూస్తే... ఎవరో బాల్ కొట్టిన శబ్దం వినబడుతుంది. ఆ తర్వాత స్టేడియంలో జనాలు విజిల్స్ వేయడం కూడా వినొచ్చు. ఈ సినిమాలో రాశీ ఖన్నా కూడా కీలక పాత్ర చేయనున్నట్లు సమాచారం. అయితే, అధికారికంగా ఇంకా ప్రకటించలేదు. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.
Also Read : 'ఐ లవ్ యు ఇడియట్' రివ్యూ : తెలుగులో శ్రీలీల ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి రిలీజ్ చేశారా?