అన్వేషించండి

Committee Kurrollu: కమిటీ కుర్రోళ్ళు... నిహారిక నిర్మించిన కొత్త సినిమా విడుదల ఎప్పుడంటే?

Niharika Konidela: మెగా డాటర్ నిహారిక కొణిదెల సమర్పణలో రూపొందిన కొత్త సినిమా 'కమిటీ కుర్రోళ్ళు'. ఈ చిత్రాన్ని ఆగస్టులో విడుదల చేయనున్నారు. విడుదల తేదీ కూడా వెల్లడించారు.

Committee Kurrollu Movie Release Date In Telugu: నిహారిక కొణిదెల... మెగా డాటర్ అని తెలుగు ప్రేక్షకులు అందరికీ తెలుసు. నాగబాబు కుమార్తె మాత్రమే కాదు... ఆవిడ నటి, నిర్మాత కూడా! పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పతాకంపై మీద మంచి మంచి కథలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. నిహారిక సమర్పణలో రూపొందిన తాజా సినిమా 'కమిటీ కుర్రోళ్ళు'. ఆగస్టులో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. లేటెస్టుగా విడుదల తేదీ వెల్లడించారు. ఆ వివరాల్లోకి వెళితే... 

ఆగస్టు 9న 'కమిటీ కుర్రోళ్ళు' విడుదల!
నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్ సంస్థలపై తెరకెక్కిన సినిమా 'కమిటీ కుర్రోళ్ళు'. దీనికి య‌దు వంశీ ద‌ర్శ‌కత్వం వహించారు. నిహారిక తల్లి పద్మజా కొణిదెల, జయలక్ష్మి అడపాక ప్రొడ్యూస్ చేశారు. గ్రామీణ నేపథ్యంలో స్నేహం, ప్రేమ, అంశాలను మేళవించి భావోద్వేగ భరిత సినిమాగా రూపొందించారు. ఆగస్టు 4న ఫ్రెండ్షిప్ డే. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ఆ తర్వాత వచ్చే శుక్రవారం... ఆగస్టు 9న 'కమిటీ కుర్రోళ్ళు' సినిమా విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.

Also Read: బహిష్కరణ రివ్యూ: Zee5 OTTలో లేటెస్ట్ బోల్డ్ క్రైమ్ థ్రిల్లర్ - అంజలి వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?

'కమిటీ కుర్రోళ్ళు' విడుదల తేదీ వెల్లడించిన సందర్భంగా నిహారిక కొణిదెల  (Niharika Konidela) మాట్లాడుతూ... ''మా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ సంస్థలో మేం నిర్మించిన తొలి సినిమా 'కమిటీ కుర్రోళ్ళు'. శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్ జ‌య‌ల‌క్ష్మి గారితో కలిసి నిర్మించడం ఎంతో సంతోషంగా ఉంది. కొత్తవాళ్లను ప్రోత్సహించాలనే ఆలోచ‌న‌తో హీరో హీరోయిన్లుగా నూతన తారలకు అవకాశం ఇచ్చాం. మా దర్శకుడు య‌దు వంశీ గారు పక్కా ప్రణాళికతో అనుకున్న స‌మ‌యంలో చిత్రీకరణ, సినిమా పూర్తి చేశారు. యువతతో పాటు కుటుంబ ప్రేక్షకులు అందరికీ నచ్చే చిత్రమిది'' అని చెప్పారు.

Also Read: రాజ్ తరుణ్ 'పురుషోత్తముడు' - వివాదాల నడుము విడుదలకు సిద్ధమైన సినిమా స్టిల్స్


దర్శకుడు యదు వంశీ మాట్లాడుతూ... ''ఈ సినిమా ద్వారా పదకొండు మంది హీరోలు, నలుగురు హీరోయిన్లను పరిచయం చేస్తున్నాం. వాళ్ళందరి మ‌ధ్య స్నేహం, భావోద్వేగాలు, ప్రేమ‌తో పాటు ప‌ల్లెటూరి రాజ‌కీయాలు, యువ‌త సంఘ‌ర్ష‌ణ... అన్నింటినీ చూపిస్తున్నాం. స్నేహితులతో కలిసి చూస్తూ ఎంజాయ్ చేసే సినిమా అవుతుంది'' అని చెప్పారు. శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్ అధినేతలు ఫణి, జయలక్ష్మి మాట్లాడుతూ... ''ఇది మంచి కంటెంట్ ఉన్న సినిమా. మేం కంటెంట్ రిచ్ సినిమాలు ప్రొడ్యూస్ చేయాలని ఇండస్ట్రీలోకి వచ్చాం. ఈ ప్రయాణంలో నిహారిక‌ గారితో క‌లిసి 'క‌మిటీ కుర్రోళ్ళు' చేయ‌టం ఎప్పటికీ మార్చుపోలేని మంచి అనుభూతి'' అని చెప్పారు.


Committee Kurrollu Movie Cast And Crew: సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు, త్రినాథ్ వర్మ, ప్రసాద్ బెహరా, మణికంఠ పరసు, లోకేష్ కుమార్ పరిమి, శ్యామ్ కళ్యాణ్, రఘువరన్, శివకుమార్ మట్ట, అక్షయ్ శ్రీనివాస్, రాధ్య, తేజస్వి రావు, టీనా శ్రావ్య, విషిక ప్రధాన పాత్రల్లోనూ... సాయి కుమార్, గోపరాజు రమణ, 'బలగం' జయరాం, శ్రీ లక్ష్మి, 'కంచరపాలెం' కిశోర్, కిట్టయ్య, రమణ భార్గవ్, 'జబర్దస్త్' సత్తిపండు ఇతర కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: రాజు ఎడురోలు, సంగీతం: అనుదీప్ దేవ్, కూర్పు: అన్వర్ అలీ, సంభాషణలు: వెంకట సుభాష్ చీర్ల - కొండల రావు అడ్డగళ్ల, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: మన్యం రమేష్, సమర్పణ: నిహారిక కొణిదెల, నిర్మాణ సంస్థలు: పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ - శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్, నిర్మాతలు: పద్మజా కొణిదెల - జయలక్ష్మి అడపాక, రచన - దర్శకత్వం: యదు వంశీ.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Nara Lokesh: డిప్యూటీ సీఎం కాదు నేరుగా సీఎం అవుతారు - చంద్రబాబు సమక్షంలో సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి భరత్
డిప్యూటీ సీఎం కాదు నేరుగా సీఎం అవుతారు - చంద్రబాబు సమక్షంలో సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి భరత్
Donald Trump : అధ్యక్షుడిగా ప్రమాణం నేడే - మొదటి రోజే 200 ఆర్డర్స్ పై సంతకాలు చేయనున్న ట్రంప్
అధ్యక్షుడిగా ప్రమాణం నేడే - మొదటి రోజే 200 ఆర్డర్స్ పై సంతకాలు చేయనున్న ట్రంప్
Donald Trump Inauguration: డోనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవం - సాంస్కృతిక ప్రదర్శనలతో ఆకట్టుకోనున్న ప్రముఖులు
డోనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవం - సాంస్కృతిక ప్రదర్శనలతో ఆకట్టుకోనున్న ప్రముఖులు
Joe Biden: కుర్చీ దిగిన బైడెన్ - అధ్యక్షుడిగా చివరి గంటల్లో వారికి క్షమాభిక్ష
కుర్చీ దిగిన బైడెన్ - అధ్యక్షుడిగా చివరి గంటల్లో వారికి క్షమాభిక్ష
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Mahakumbh Monalisa | కాటుక కళ్ల చిన్నది.. కుంభమేళాను కట్టిపడేసింది | ABP DesamKolkata Doctor Murder Case | కోల్ కతా ట్రైనీ డాక్టర్ కేసులో నిందితుడికి జీవిత ఖైదు | ABP DesamCM Chandrababu CM Revanth Met in Davos | దావోస్ లో కలిసిన చంద్రబాబు, రేవంత్ | ABP DesamAkash Puri Helps Pavala Shyamala | సీనియర్ నటి పావలా శ్యామలకు ఆకాశ్ పూరీ ఆర్థిక సాయం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Nara Lokesh: డిప్యూటీ సీఎం కాదు నేరుగా సీఎం అవుతారు - చంద్రబాబు సమక్షంలో సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి భరత్
డిప్యూటీ సీఎం కాదు నేరుగా సీఎం అవుతారు - చంద్రబాబు సమక్షంలో సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి భరత్
Donald Trump : అధ్యక్షుడిగా ప్రమాణం నేడే - మొదటి రోజే 200 ఆర్డర్స్ పై సంతకాలు చేయనున్న ట్రంప్
అధ్యక్షుడిగా ప్రమాణం నేడే - మొదటి రోజే 200 ఆర్డర్స్ పై సంతకాలు చేయనున్న ట్రంప్
Donald Trump Inauguration: డోనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవం - సాంస్కృతిక ప్రదర్శనలతో ఆకట్టుకోనున్న ప్రముఖులు
డోనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవం - సాంస్కృతిక ప్రదర్శనలతో ఆకట్టుకోనున్న ప్రముఖులు
Joe Biden: కుర్చీ దిగిన బైడెన్ - అధ్యక్షుడిగా చివరి గంటల్లో వారికి క్షమాభిక్ష
కుర్చీ దిగిన బైడెన్ - అధ్యక్షుడిగా చివరి గంటల్లో వారికి క్షమాభిక్ష
Bhatti Vikramarka: 'త్వరలో 32 పెద్ద ఖనిజ బ్లాక్‌ల వేలం' - ఖనిజ సంపదపై ఆదాయం రూ.5 వేల కోట్లు దాటిందన్న డిప్యూటీ సీఏం బట్టి విక్రమార్క
'త్వరలో 32 పెద్ద ఖనిజ బ్లాక్‌ల వేలం' - ఖనిజ సంపదపై ఆదాయం రూ.5 వేల కోట్లు దాటిందన్న డిప్యూటీ సీఏం బట్టి విక్రమార్క
Himani Mor: నీరజ్ చోప్రా భార్య హిమానీ మోర్ గురించి తెలుసా...? తను కూడా గోల్డ్ మెడల్ తెచ్చింది.
నీరజ్ చోప్రా భార్య హిమానీ మోర్ గురించి తెలుసా...? తను కూడా గోల్డ్ మెడల్ తెచ్చింది.
RG Kar Murder Case: ఆర్జీకర్ హత్యాచారం కేసు - దోషికి జీవిత ఖైదు విధించిన న్యాయస్థానం
ఆర్జీకర్ హత్యాచారం కేసు - దోషికి జీవిత ఖైదు విధించిన న్యాయస్థానం
Telangana Beer News: తెలంగాణ మందుబాబులకు గుడ్ న్యూస్ - ఆ  బ్రాండ్ బీర్లకు కొరత లేదు.. రాదు !
తెలంగాణ మందుబాబులకు గుడ్ న్యూస్ - ఆ బ్రాండ్ బీర్లకు కొరత లేదు.. రాదు !
Embed widget