అన్వేషించండి

Actor Suhas: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన 'కలర్‌ ఫొటో' హీరో భార్య - బిడ్డను పరిచయం చేసిన సుహాస్.. 

Suhas Become Father: ' కలర్ ఫొటో' ఫేం సుహాస్‌ గుడ్‌న్యూస్‌ చెప్పాడు. తండ్రి అయ్యానంటూ సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించాడు. ప్రొడక్షన్‌ నెం.1 అంటూ తన భార్య లలిత పండంటి బిడ్డకు జన్మనించినట్టు చెప్పాడు.

Suhas Become Father: 'కలర్‌ ఫొటో' ఫేం, నటుడు సుహాస్‌ గుడ్‌న్యూస్‌ చెప్పాడు. తండ్రిని అయ్యానంటూ సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించాడు. ప్రొడక్షన్‌ నెం.1 అంటూ తన భార్య లలిత పండంటి బిడ్డకు జన్మనించినట్టు చెప్పాడు. సుహాస్‌ భార్య సోమవారం (జనవరి 22)మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ సందర్భంగా తన కుమారుడు ఫొటోను షేర్‌ చేశాడు సుహార్‌. ఆస్పత్రి బెడ్‌పై తన భార్య లిఖిత పడుకుని ఉండగా పక్కనే బిడ్డను ఎత్తుకుని ఉన్నాడు సుహాస్‌. ఈ ఫొటోను షేర్‌ చేస్తూ "మాకు మగబిడ్డ పుట్టాడు. ప్రొడక్షన్‌ నెం1" అంటూ కొడుకును పరిచయం చేశాడు. అయితే మిగతా సెలబ్రెటీల మాదిరిగానే సుహాస్‌ తన కుమారుడు మొఖం చూపించకుండ జాగ్రత్త పట్టాడు. ఫేస్‌ దగ్గర లవ్‌ సింబర్‌ పెట్టి పోస్ట్‌ షేర్‌ చేశాడు.

కాగా సుహాస్‌ 2017లో తన ప్రియురాలు లిఖిత ప్రేమ వివాహం చేసుకున్నాడు. పెళ్లయిన ఏడేళ్లకు వారికి కుమారుడు జన్మించడంతో సుహాస్‌ ఇంట పండగ వాతావరణం నెలకొంది. సహాస్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. 'మజిలీ', 'డియర్‌ కామ్రేడ్', ప్రతి రోజు పండగే' వంటి చిత్రాల్లో హీరో ఫ్రెండ్‌ నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తన నటనతో ఆడియన్స్‌, దర్శక-నిర్మాతల ద్రష్టిని ఆకర్షించిన సుహాస్‌ ఏకంగా లీడ్‌ రోల్స్‌ ఆఫర్స్‌ అందుకున్నాడు. ఓటీటీలో విడుదలైన ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య సినిమాతో హీరో మారాడు. ఈ మూవీలోని అతడి పాత్ర, నటనతో ఆకట్టుకున్నాడు. ఆ వెంటనే కలర్‌ ఫొటో సినిమాలో ఫీచర్‌ హీరోగా మారాడు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Suhas (@suhassssssss)

ఈ సినిమాలో అతడికి జంటగా చాందిని చౌదరి అలరించింది. లవ్‌ అండ్‌ ఎమోషనల్‌ డ్రామాగా వచ్చిన ఈ సినిమా ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకుంది. కలర్‌ ఫొటో మంచి విజయం సాధించడంతో సుహాస్‌ రాత్రికి రాత్రే స్టార్‌ అయిపోయాడు. అదే క్రేజ్‌తో రైటర్‌ పద్మభూషన్‌ సినిమాలో నటించి మంచి హిట్‌ కొట్టాడు. ఇటూ హీరోగా చేస్తూనే మరోవైపు నెగిటివ్ రోల్స్‌లోనూ మెప్పిస్తున్నాడు. 'హిట్‌ 2'లో సుహాస్‌ సైకో కిల్లర్‌ పాత్ర పోషించి తన పర్ఫామెన్స్‌తో అందరిని ఆకట్టుకున్నాడు.  ఇదిలా ఉంటే గతంలో ఓ ఇంటర్య్వూలో సుహాన్‌ తన ప్రేమ, పెళ్లి గురించి ప్రస్తావించాడు. తన భార్య లిఖిత డిగ్రీలో తన క్లాస్ మేట్ అని, 2009 నుండి వారిద్దరు ప్రేమించుకున్నట్టు చెప్పాడు.

Also Read: రికార్డులు కొల్లగొడుతున్న 'హనుమాన్‌'- పది రోజుల్లో ఎంత రాబట్టిందంటే

"డిగ్రీలోనే లిఖిత పరిచయమైంది. అప్పుడే ఒకరికొకరం బాగా ఇష్టపడ్డాం. ఇద్దరిది ప్రేమే అని స్ట్రాంగ్‌గా ఫిక్స్ అయ్యాం. అయితే సినిమాల్లోకి వచ్చిన తరువాత మన మైండ్ సెట్ మారే అవకాశం చాలానే ఉంటుంది. చుట్టూ రకరకాల అమ్మాయిలు ఉంటారు. కొత్తగా ఫ్రెండ్స్ పరిచయం అవుతారు. కానీ.. నేను సినిమాల్లోకి వచ్చిన తరువాత కూడా తన గురించే ఆలోచించేవాడిని. ఫస్ట్ నుంచి తనే నాకు హెల్ప్ చేసింది. తను జాబ్ చేస్తూ..మా ఇంట్లో ఒప్పించి నన్ను ఫైనాన్సియల్‌గా ఆదుకుంది. మెంటల్‌గా కూడా స్ట్రాంగ్‌ సపోర్టు ఇచ్చింది" అంటూ చెప్పుకొచ్చాడు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
KTR: 'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
RRR: 'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pamban Vertical Railway Bridge | సముద్రంపై వావ్ అనిపించేలా రైల్వే వంతెన | ABP DesamSpecial welcome by ISKCON for PM Modi | ఇస్కాన్ భక్తులు మోదీని ఎలా స్వాగతించారో చూడండి | ABP Desamబిల్డింగ్‌నే పక్కకి జరుపుతున్నారు, మూడంతస్తులు ఎలా సాధ్యం?అరెస్ట్ చేస్తావ్ అని తెలుసు, చేసుకో!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
KTR: 'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
RRR: 'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
Group 4 Results: తెలంగాణ గ్రూప్ 4 పరీక్షా ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి!
తెలంగాణ గ్రూప్ 4 పరీక్షా ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి!
Vizianagaram MLC Election: విజయనగరం  స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక రద్దు - కీలక నిర్ణయం తీసుకున్న ఈసీ
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక రద్దు - కీలక నిర్ణయం తీసుకున్న ఈసీ
Patnam Narendar Reddy: వికారాబాద్ కలెక్టర్, అధికారులపై దాడి కేసు - అది తప్పుడు రిపోర్ట్ అంటూ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ సంచలన లేఖ
వికారాబాద్ కలెక్టర్, అధికారులపై దాడి కేసు - అది తప్పుడు రిపోర్ట్ అంటూ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ సంచలన లేఖ
Chandrababu: మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు - శుక్రవారం ఢిల్లీలో మోదీ, షాతో భేటీ అయ్యే చాన్స్
మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు - శుక్రవారం ఢిల్లీలో మోదీ, షాతో భేటీ అయ్యే చాన్స్
Embed widget