స్టైలిష్ అవతార్‌లో అదరగొట్టిన విక్రమ్ - సీక్రెట్ మిషన్ నేపథ్యంలో 'ధృవ నక్షత్రం', ట్రైలర్ చూశారా?
గౌతమ్ మీనన్ దర్శకత్వంలో చియాన్ విక్రమ్ నటించిన 'ధృవ నక్షత్రం' ట్రైలర్ తాజాగా విడుదలైంది. స్పై అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది.
కోలీవుడ్ అగ్ర హీరో చియాన్ విక్రమ్ నటించిన 'ధృవ నచ్చతిరమ్' మూవీ ట్రైలర్ ని మేకర్స్ తాజాగా విడుదల చేశారు. ట్రైలర్లో విక్రమ్ స్టైలిష్ అవతార్ తో అదరగొట్టేశారు. ముఖ్యంగా యాక్షన్ సీన్స్ లో విక్రమ్ మరింత స్టైలిష్ గా కనిపించారు. తాజాగా విడుదలైన ట్రైలర్ సోషల్ మీడియాలో ఆద్యంతం ఆకట్టుకుంటుంది. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తమిళ అగ్ర హీరో విక్రమ్ నటించిన 'ధృవ నచ్చతిరమ్' సినిమా ఎప్పుడో విడుదల అవ్వాల్సింది. 2016 లో సెట్స్ పైకి వెళ్లిన ఈ చిత్రం మధ్యలో ఆగిపోయింది. మళ్లీ 2022లో ఈ చిత్రం ట్రాక్ లోకి వచ్చినట్లు మేకర్స్ ప్రకటించారు. ఆ తర్వాత నుంచి సినిమాకు సంబంధించి ఎటువంటి అప్డేట్ లేకపోవడంతో ఈ సినిమా విడుదల కాదని అంతా భావించారు.
కానీ ఎట్టకేలకు ఈ చిత్రాన్ని వచ్చే నెలలో విడుదల చేస్తున్నారు. యాక్షన్ అండ్ స్పై జోనర్ లో వస్తున్న ఈ మూవీలో విక్రమ్ జాన్ అనే పాత్రలో కనిపించబోతున్నాడు. సినిమాలో విక్రమ్ భారతదేశ జాతీయ భద్రతా సంస్థ కోసం పనిచేసే 10 మంది రహస్య ఏజెంట్ల బృందానికి నాయకత్వం వహిస్తాడు. శరత్‌కుమార్, సిమ్రాన్, ఆర్ పార్తిబన్, దివ్యదర్శిని, మున్నా, వంశీకృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో విక్రమ్ సరసన రీతూ వర్మ మడోనా సెబాస్టియన్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్ర ట్రైలర్ ని దసరా కానుకగా రిలీజ్ చేశారు. "ఓ దృక్కోణం గురించి.. మరో చిన్న అడుగు.. పెద్ద ప్రయోగం.. ఏమైనప్పటికీ మేము కవాతు చేస్తున్నాం" అంటూ గౌతమ్ మీనన్ ఈ చిత్రం ట్రైలర్ ని షేర్ చేశారు.
టైలర్ ని గమనిస్తే.. ముంబై దాడుల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని టైలర్ చూస్తే అర్థమవుతుంది. 'ముంబై దాడుల సమయంలో ల్యాండ్ కావాల్సిన మొదటి NSG చాపర్ కొంచెం ఆలస్యమైంది' అంటూ సాగే వాయిస్ ఓవర్ తో ట్రైలర్ మొదలవుతుంది. ఆ తర్వాత ఓ ముఖ్యమైన మిషన్ నేపథ్యంలో ఈ సినిమా అంతా ఉంటుందని, ట్రైలర్లో ఆ మిషన్ కు సంబంధించిన డిస్కషన్ నడుస్తుంది. ఆ మిషన్ కోసం ఒక టీం పని చేస్తుంది. ఆ టీం ని విక్రమ్ లీడ్ చేస్తాడు. ట్రైలర్ లో విక్రమ్ స్టైలిష్ లుక్స్, యాక్షన్ సీన్స్, బీజీయం ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. చాలా రోజుల తర్వాత విక్రమ్ స్టైలిష్ యాక్టింగ్ ని ఈ సినిమాలో చూడబోతున్నట్టు ట్రైలర్లో చూపించారు.
మొత్తంగా 'ధృవ నచ్చతిరమ్' చిత్రం ట్రైలర్ విషయానికి వస్తే విక్రమ్ నుంచి రాబోతున్న స్పై అండ్ యాక్షన్ స్టైలిష్ ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు. ఒండ్రగ ఎంటర్టైన్మెంట్, కొండదూవం ఎంటర్టైన్మెంట్, ఎస్కేప్ ఆర్టిస్ట్స్ మోషన్ పిక్చర్స్ బ్యానర్స్ పై సంయుక్తంగా రూపొందిన ఈ చిత్రానికి హరీష్ జయరాజ్ సంగీతం అందించారు. ఆంథోని ఎడిటర్ గా వ్యవహరిస్తున్న ఈ చిత్రాన్ని నవంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఈ సినిమాతో పాటు విక్రమ్ 'తంగలాన్' అనే మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రా. రంజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో విక్రమ్ ఓ ప్రయోగాత్మక పాత్ర పోషిస్తున్నారు. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read : నాని సినిమా కోసం SJ సూర్య అన్ని కోట్లు తీసుకుంటున్నాడా?
Join Us on Telegram: https://t.me/abpdesamofficial