Chiyaan Vikram: బాయ్ కాటా - అంటే ఏంటండీ? కోబ్రా ప్రమోషన్స్‌లో విక్రమ్ ఇంట్రెస్టింగ్ కామెంట్!
తమిళ హీరో విక్రమ్ కోబ్రా మూవీ షూటింగ్ లో భాగంగా హైదరాబాద్ లో సందడి చేశారు. ఈ సందర్భంగా బాయ్ కాట్ ట్రెండ్ మీద ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు..
తమిళ టాప్ హీరోలలో చియాన్ విక్రమ్ ఒకరు.. ‘కోబ్రా’ సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు విక్రయమ్. ఆయన నటించిన ఈ సినిమా ఈ 31న థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రంలో ఆయన తొమ్మిది డిఫరెంట్ గెటప్పుల్లో కనిపించనున్నారు. మూవీ ప్రమోషన్ లో భాగంగా ఆయన హైదరాబాద్ లో సందడి చేశారు. తమిళంతో పాటు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉన్న నేపథ్యంలో ఆయన తెలుగు రాష్ట్రాలపై ఫోకస్ పెటారు. అపరిచితుడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన విక్రమ్.. మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత ఆయన సినిమాలు తెలుగులోనూ విడుదలై సక్సెస్ సాధించాయి. కోబ్రా కోసం ఇక్కడ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో పలు కీలక విషయాలు వెల్లడించారు. అంతేకాదు.. బాయ్ కాట్ ట్రెండ్ మీద అదిరిపోయే సమాధానం చెప్పారు.
ఇన్ని గెటప్పులు ఉంటాయని ఊహించలేదు
నటన అంటే తనకు పిచ్చి అన్నారు విక్రమ్. ఏ సినిమా చేసిన భిన్నంగా చేసేందుకే ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. అందులో భాగంగానే కోబ్రా సినిమాలో పలు గెటప్‌లు వేసినట్లు చెప్పారు. వాస్తవానికి కొన్ని కథలు వినగానే సినిమా చేయాలనిపిస్తుందని.. అలాంటి సినిమానే కోబ్రా అన్నారు. సైకలాజికల్ థ్రిల్లర్, సైన్స్ ఫిక్షన్, ఎమోషనల్ డ్రామా సహా ఈ సినిమాకు పలు లక్షణాలున్నాయని చెప్పారు. ఈ మూవీలో ఇన్ని గెటప్పులుంటాయని తాను ఊహించలేదన్నారు. ఒక్కో పాత్ర చేసేందుకు చాలా ఇబ్బంది పడినట్లు చెప్పారు. అన్నింటిని దాటుకుని సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు చెప్పారు. అపరిచితుడు నుంచి ఉన్న అభిమానం.. ఈ సినిమా మీద కూడా చూపించాలని తెలుగు ప్రేక్షకులకు విక్రమ్ విజ్ఞప్తి చేశారు.
రష్యాలో యాక్షన్ సీన్లు షూట్..
అటు ఈ సినిమాలో శ్రీనిధి, మీనాక్షి, మృణాళి క్యారెక్టర్లను కూడా దర్శకుడు అద్భుతంగా తీర్చి దిద్దారని విక్రమ్ వెల్లడించారు. క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ సైతం ఈ సినిమాలో నటించినట్లు చెప్పారు. ఈ సినిమాలోని కొన్ని యాక్షన్ సన్నివేశాలను రష్యాలో షూట్ చేసినట్లు వెల్లడించారు. మొత్తంగా ఈ సినిమా బయటకు ఓ హాలీవుడ్ సినిమా మాదిరిగా కనిపిస్తుందని.. మంచి కుటుంబ అనుబంధాలతో కూడిన సినిమాగా ఉంటుందన్నారు.
బాయ్ కాట్ అంటే ఏంటండీ?
ప్రెస్ మీట్ మధ్యలో ఓ ఆసక్తికర సన్నివేశం జరిగింది. తాజాగా బాలీవుడ్ ను షేక్ చేస్తున్న బాయ్ కాట్ బాలీవుడ్ మీద అభిప్రాయం చెప్పాలని విక్రమ్ ను మీడియాను అడిగారు. బాయ్‌కాట్ అంటే అంటే ఏంటని విక్రమ్ తిరిగి ప్రశ్నించారు. బాయ్ అంటే తెలుసు, కాట్ అంటే తెలుసు.. బాయ్ కాట్ అంటే ఏంటి? అని అడిగారు. ఈ ప్రశ్నను దాటవేసేందుకు విక్రమ్ ప్రయత్నించారు. అయితే సురేష్ మళ్లీ అడగడంతో మీకు పర్సనల్ గా చెప్తానని విక్రమ్ అన్నారు. దీంతో అక్కడ నవ్వులు విరిశాయి.
కోబ్రా సినిమా అజయ్ దర్శకత్వంలో తెరకెక్కగా.. శ్రీనిధి శెట్టి, మృణాళిని, మీనాక్షి హీరోయిన్లుగా నటించారు. మ్యూజిక్ డైరెక్టర్ ఎ.ఆర్.రెహమాన్ సంగీతం అందించారు. ఈ సినిమాని ఎన్వీ ప్రసాద్ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.