Sree Vishnu: మెగా హీరోలకు డిజాస్టర్ ఇచ్చిన క్యారెక్టర్... శ్రీవిష్ణు హిట్టు కొడతాడా?
Chiranjeevi Ram Charan vs Sree Vishnu: మెగా హీరోలు చిరంజీవి, రామ్ చరణ్... ఇద్దరికీ ఓ క్యారెక్టర్ షాక్ ఇచ్చింది. ఆ మూవీ డిజాస్టర్ అయ్యింది. ఇప్పుడు సేమ్ రోల్ శ్రీవిష్ణు చేస్తున్నాడు. మరి హిట్ కొడతాడా?

ఇండస్ట్రీలో కొంత మందికి కొన్ని క్యారెక్టర్లు కలిసి వస్తాయి. కొంత మందికి బ్యాడ్ రిజల్ట్ ఇస్తాయి. రాజీవ్ కనకాల క్యారెక్టర్ మరణిస్తే సినిమా హిట్టు అనే సెంటిమెంట్ కొన్నాళ్ళు నడిచింది. చివరకు ఆ సినిమాలో రాజీవ్ కనకాల మరణించడం లేదని ఓ సినిమా వినూత్నంగా పబ్లిసిటీ చేసే వరకు వెళ్ళింది. అలా మెగా ఫ్యామిలీకి ఓ క్యారెక్టర్ కలిసి రాలేదు. బ్యాడ్ రిజల్ట్ అందించింది. ఇప్పుడు ఆ క్యారెక్టర్ శ్రీ విష్ణు చేస్తున్నారు.
ఆచార్య... మెగా ఫ్యామిలీ, ఫ్యాన్స్‌కు పీడకల!
తండ్రీ కొడుకులు చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించిన సినిమా 'ఆచార్య'. ఆ మూవీ కంటే ముందు 'మగధీర', 'బ్రూస్ లీ' సినిమాల్లో తనయుడితో కలిసి చిరు కనిపించారు. అయితే అవి అతిథి పాత్రలే. 'ఆచార్య'లో ఇద్దరూ కలిసి కొన్ని సీన్స్ చేశారు. ఫుల్ సాంగ్‌లో కలిసి స్టెప్పులు వేశారు. కట్ చేస్తే సినిమా రిజల్ట్ ఆశించినట్టు రాలేదు. మెగా ఫ్యామిలీతో పాటు అభిమానులకు పీడకలగా నిలిచింది.
'ఆచార్య'లో మెగాస్టార్ చిరంజీవితో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సైతం మావోయిస్టు క్యారెక్టర్ చేశారు. అడవిలో అన్నలుగా, కామ్రేడ్ డ్రస్‌లలో వాళ్ళిద్దరి లుక్స్ అభిమానులకు నచ్చాయి. కానీ సినిమా నచ్చలేదు. అంతకు ముందు 'జల్సా'లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాసేపు మావోయిస్టుగా కనిపించారు. ఆ సినిమా అభిమానులకు నచ్చిందనుకోండి. కట్ చేస్తే... ఇప్పుడు ఆ క్యారెక్టర్ శ్రీ విష్ణు చేస్తున్నారు.
'కామ్రేడ్ కళ్యాణ్'గా శ్రీ విష్ణు... టీజర్ చూశారా?
Comrade Kalyan Teaser News: 'కామ్రేడ్ కళ్యాణ్'... శ్రీ విష్ణు కొత్త సినిమా టైటిల్ ఇది. ఆ పేరును బట్టి చెప్పేయవచ్చు... సినిమాలో అతని క్యారెక్టర్ ఏమిటి? అనేది. విజయ దశమి సందర్భంగా టీజర్ విడుదల చేశారు. అందులో మావోయిస్టుగా శ్రీ విష్ణు లుక్కు చూస్తే... సేమ్ టు సేమ్ 'ఆచార్య'లో చిరంజీవి, రామ్ చరణ్ డ్రస్‌లు గుర్తు వస్తాయి. మెగా ఫ్యామిలీకి ఫ్లాప్ అందించిన మావోయిస్టు క్యారెక్టర్ శ్రీ విష్ణుకు హిట్ ఇవ్వాలని ఆశిద్దాం.
Also Read: మళ్ళీ మెగా పవర్ స్టారే... గ్లోబల్ స్టార్ ట్యాగ్ తీసేసిన రామ్ చరణ్!

ప్రజెంట్ శ్రీ విష్ణు కెరీర్ సక్సెస్‌ఫుల్ ట్రాక్‌లో దూసుకు వెళుతోంది. 'సామజవరగమన, ఓం భీమ్ బుష్' సినిమాలు ప్రేక్షకులను విపరీతంగా నవ్వించాయి. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకు వసూళ్లతో పాటు లాభాలు తెచ్చాయి. 'స్వాగ్' ఆశించిన హిట్ కాలేదు. కానీ కొంత మందికి నచ్చింది. 'సింగిల్' సైతం హిట్. ఆ జోరులో 'కామ్రేడ్ కళ్యాణ్' సైతం విజయం సాధించాలని ఆశిద్దాం. టీజర్ అయితే ఓ క్యూరియాసిటీ క్రియేట్ చేసింది. పోలీసులు వెతుకుతున్నారని గోడపై తన ఫోటో ఉన్న పోస్టర్ 'కామ్రేడ్ కళ్యాణ్' ఎందుకు అంటించాడు? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. ఇందులో శ్రీవిష్ణు సరసన మహిమా నంబియార్ కథానాయికగా ఇతర కీలక పాత్రల్లో రాధిక శరత్‌కుమార్, షైన్ టామ్ చాకో, ఉపేంద్ర లిమాయే నటిస్తున్నారు.





















