Hook Step Song : ఈఎంఐల ఇరిటేషన్ - మెగాస్టార్ బ్లాక్ బస్టర్ 'హుక్ స్టెప్' బిహైండ్ ద స్టోరీ
Chiranjeevi Hook Step : 'మన శంకరవరప్రసాద్ గారు' సినిమాలో 'హుక్ స్టెప్' సాంగ్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. ఈ స్టెప్ కంపోజ్ చేయడం వెనుక ఉన్న ఇంట్రెస్టింగ్ స్టోరీని కొరియోగ్రాఫర్ సందీప్ షేర్ చేసుకున్నారు.

Chiranjeevi Mana Shankara Varaprasad Garu Hook Step Song Story : మెగాస్టార్ చిరంజీవి 'మన శంకరవరప్రసాద్ గారు' హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. ముఖ్యంగా చిరు హుక్ స్టెప్ సాంగ్‌కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. వింటేజ్ మెగాస్టార్ లుక్ సహా మొబైల్ లైట్‌తో ఆయన ఎనర్జీ స్టెప్స్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. ఈ స్టెప్ రాగానే థియేటర్లలో ఫ్యాన్స్ పూనకాలు స్టార్ట్ అవుతున్నాయి.
అంతలా ఫేమస్ అయిన ఈ హుక్ స్టెప్ సాంగ్‌కు 'ఆట' ఫేం సందీప్ కొరియోగ్రఫీ చేశారు. ఈ పాటకు సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించగా... బాబా సెహగల్ ఆలపించారు. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందించారు. థియేటర్లో మూవీ చూసిన కొరియోగ్రాఫర్ సందీప్ 'హుక్ స్టెప్' సాంగ్ వచ్చినప్పుడు ఫ్యాన్స్ రెస్పాన్స్ చూసి ఆనందం వ్యక్తం చేశారు. ఈ స్టెప్ వెనుక ఇంట్రెస్టింగ్ స్టోరీని షేర్ చేసుకున్నారు.
ఈఎంఐస్ ఇరిటేషన్‌తో...
ఈఎంఐస్ ఇరిటేషన్ వల్ల కోపంలో వచ్చిన ఐడియాతో 'హుక్ స్టెప్' కంపోజ్ చేసినట్లు సందీప్ తెలిపారు. 'నేను కూడా ప్రతీ నెల ఈఎంఐలు కట్టాలి. ఈ సాంగ్‌కు స్టెప్స్ కంపోజ్ చేస్తున్న టైంలో వరుసగా ఈఎంఐ కట్టాలంటూ ఫోన్స్ వచ్చాయి. ప్రొడక్షన్ హౌస్ నుంచి కాల్ వస్తుందనే ఫోన్ తీసుకెళ్లా. అలా వరుస కాల్స్‌తో ఇరిటేషన్ వచ్చింది. కోపంతో ఫోన్ పగలగొట్టేద్దామనుకున్నా. అలా ఫోన్ పట్టుకుంటే ఓ ఐడియా వచ్చింది.
లైట్స్ అన్నీ ఆఫ్ చేసి కేవలం మొబైల్ లైట్‌తో 'హుక్ స్టెప్' సాంగ్ కంపోజ్ చేశా. అది చూసి నా భార్య చప్పట్లు కొట్టారు. అలా ఆ స్టెప్‌ను ఇంకా కొంచెం డెవలప్ చేసి ఫైనల్ స్టెప్ డిజైన్ చేశాం. మెగాస్టార్ చిరంజీవి గ్రేస్, ఎనర్జీని దృష్టిలో పెట్టుకుని దాన్ని డిజైన్ చేశాం.' అని చెప్పారు.
Also Read : ట్యాగ్ చేసిన అమ్మాయిల దారుణ హత్యలు - శోభిత 'చీకటిలో' ట్రైలర్... మూవీ ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
ఈ సాంగ్ షూటింగ్ పూర్తైన తర్వాత 'నిన్ను ఎంపిక చేసినందుకు గర్వంగా ఉంది' అంటూ చిరంజీవి అన్నారని... అది తనకెంతో సంతోషంగా అనిపించిందని చెప్పారు. 'అబ్బాయ్ నీ వల్ల నాకు పేరు వచ్చేలా ఉంది అంటూ చిరంజీవి నాతో అన్నారు. సర్ మీ పేరు చెప్పుకొని మేమంతా పైకి వచ్చామని అన్నా. ఆయన తలుచుకుంటే బాలీవుడ్ నుంచి గొప్ప కొరియోగ్రాఫర్లను తీసుకురాగలరు. కానీ నన్ను నమ్మి నాకు ఛాన్స్ ఇచ్చారు. కష్టపడే వారికి అవకాశం ఇవ్వాలనేదే ఆయన ఉద్దేశం. చిరంజీవి గారికి థాంక్యూ.' అంటూ చెప్పారు. మూవీలో అన్నీ సాంగ్స్ ట్రెండ్ అయ్యాయి.
ప్రీమియర్ల కలెక్షన్స్
'మన శంకరవరప్రసాద్ గారు' ప్రీమియర్లతోనే రూ.25 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. బుక్ మై షో యాప్‌లో 24 గంటల్లోనే 2 లక్షల 86 వేల టికెట్స్ సేల్ అయినట్లు వెల్లడించింది. ప్రీమియర్స్‌లోనే వన్ మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసిన చిరు రెండో చిత్రంగా ఈ మూవీ నిలిచింది. ఈ సంక్రాంతికి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అదిరిపోయిందని ఫ్యాన్స్ అంటున్నారు.





















