అన్వేషించండి

Chiranjeevi: చిరంజీవి కంట్లో పడిన 2024 హిట్లు... చిన్నోళ్లకు 'మెగా' భరోసా!

Chiranjeevi Speech: సత్యదేవ్ ఓ హీరోగా నటించిన 'జీబ్రా' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరు అయ్యారు. అక్కడ ఆయన చిన్న సినిమాలు సాధించిన విజయాల గురించి మాట్లాడారు.

కళాకారులు కోరుకునేది చప్పట్లు అని చెబుతారు. సినిమా అనేది వ్యాపారం అయినా సరే వసూళ్లతో పాటు ప్రశంసల సైతం ముఖ్యమే. అటువంటిది మెగాస్టార్ చిరంజీవి చేత ప్రశంసలు అందుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఆయన కంట్లో పడిన 2024 హిట్ సినిమాలు ఏవో తెలుసా?

చిరంజీవి కంట్లో పడిన 2024 హిట్స్ ఇవే!
చిరంజీవి వీరాభిమాని, యువ కథానాయకుడు సత్యదేవ్ నటించిన 'జీబ్రా' సినిమా ఈనెల 22వ తేదీన విడుదల కానుంది ఈ సందర్భంగా హైదరాబాద్ సిటీలో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరు అయ్యారు. అక్కడ చిన్న సినిమాలు సాధించిన విజయాల గురించి మెగాస్టార్ మాట్లాడారు. 

కరోనా కాలంలో ప్రేక్షకులు ఓటీటీ వేదికలకు అలవాటు పడడంతో ఇక చిన్న సినిమాలు చూడటానికి ప్రేక్షకులు థియేటర్లకు రారు అనే మాటలు వినిపించినప్పుడు అన్ని సినిమాలు ఆడాలని కోరుకునే తనలాంటి వాళ్ళు ఆలోచనలలో పడ్డామని చిరంజీవి అన్నారు. ఈ ఏడాది వచ్చిన సినిమాలు గమనిస్తే... కొన్ని చిన్న సినిమాలు భారీ విజయాలు సాధించడం తనకు ఎంతో సంతోషంగా ఉందని చిరు తెలిపారు. భారీ సినిమాలో విజయం సాధించడంతో పాటు చిన్నచితకా సినిమాలు ఆడినప్పుడే పరిశ్రమ కళకళలాడుతుందని ఆయన అన్నారు.

సంక్రాంతికి విడుదలైన ప్రశాంత్ వర్మ, తేజ సజ్జాల 'హనుమాన్' సినిమా కేవలం తెలుగు ప్రేక్షకులను మాత్రమే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో విజయం సాధించడం తనకు ఎంతో సంతోషంగా ఉందని చిరంజీవి చెప్పారు.‌ మెగా డాటర్ నిహారిక నిర్మించిన 'కమిటీ కుర్రోళ్ళు', సిద్దు జొన్నలగడ్డ కథానాయకుడిగా నటించిన 'టిల్లు స్క్వేర్' సైతం విషయాలు సాధించాయని ఆనందం వ్యక్తం చేశారు. దీపావళికి విడుదలైన 'లక్కీ భాస్కర్', 'క', 'అమరన్' సినిమాలు అన్ని విజయాలు సాధించడం మంచి పరిణామం అన్నారు. కీరవాణి గారి అబ్బాయి శ్రీ సింహ, సత్య నటించిన 'మత్తు వదలరా 2' సినిమాను రెండుసార్లు చూశానని చెప్పారు. ఈ సినిమాలకు చిరు ప్రశంసలు లభించడంతో ఆయా చిత్ర బృందాలు సంతోషంగా మునిగాయి.

ప్రేక్షకులది తప్పు కానే కాదు...
ఒకవేళ తప్పు ఏదైనా ఉంటే అది మాదే!
ప్రేక్షకులది ఎప్పుడు తప్పు ఉండదని చిరంజీవి చెప్పారు. ఒకవేళ సినిమాలు ఆడలేదు అంటే అది తీసిన తమది తప్పు అని ఆయన తెలిపారు. మంచి సినిమాలు వచ్చిన ప్రతిసారి ప్రేక్షకుల ఆదరణకు నోచుకుంటున్నాయని ఆయన వివరించారు. ఈ ఏడాది విడుదలైన సినిమాలలో సక్సెస్ రేట్ 20 శాతం ఉండడం శుభ పరిణామం అని చెప్పారు.

Also Readడ్యాన్సింగ్ క్వీన్ శ్రీ లీల తక్కువేం తీసుకోలేదు - అల్లు అర్జున్ 'పుష్ప 2'లో ఐటెం సాంగ్ కోసం ఎంతో రెమ్యూనరేషన్ తీసుకుందో తెలుసా?


చిన్న సినిమాలకు మెగాస్టార్ అండగా నిలబడుతున్నారు. 'కమిటీ కుర్రోళ్ళు', 'ఆయా', 'టిల్లు స్క్వేర్', 'క' విజయాల తర్వాత ఆయా చిత్ర బృందాలను తన ఇంటికి ఆహ్వానించి వాళ్ళను అభినందించారు.

సత్యదేవ్ నాకు మూడో తమ్ముడు!
సత్యదేవ్ తనకు మూడో తమ్ముడు అని చిరంజీవి అన్నారు.‌ కరోనా సమయంలో అతను నటించిన బ్లఫ్ మాస్టర్ సినిమా చూశానని, ఆ మూవీలో చాలా చక్కగా నటించాడని... టాలెంటెడ్ ఆర్టిస్ట్ కనుక 'గాడ్ ఫాదర్' సినిమాలో అవకాశం ఇచ్చానని చిరు చెప్పారు. ఇప్పుడు సత్యదేవ్ నటించిన 'జీబ్రా' మంచి విజయం సాధించి హీరోగా అతనికి మరింత మంచి భవిష్యత్తును తీసుకురావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

Also Readఒక్క ఫైట్ చేయలేదు, సిక్స్ ప్యాక్ చూపించలేదు... హీరో ఏడ్పించేశాడు భయ్యా - ఈ వారమే ఓటీటీలోకి ఫాదర్ సెంటిమెంట్ సినిమా

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget