అన్వేషించండి

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ బాబూ... నువ్వు గేమ్ ఛేంజర్‌వే కాదు, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా - గర్వంతో చిరంజీవి ట్వీట్

Chiranjeevi congratulates Pawan Kalyan: తమ్ముడు పవన్ కళ్యాణ్, ఆయన జనసేన పార్టీ ఘనవిజయం సాధించడంతో అన్నయ్య చిరంజీవి మనసు ఉప్పొంగింది. గర్వంతో ట్వీట్ చేశారు.

Chiranjeevi Tweet On Pawan Kalyan Victory: ఏపీ ఎన్నికల్లో జనసేన పార్టీ విజయ దుందుభి మోగించింది. పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బంపర్ మెజార్టీతో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఏపీ అసెంబ్లీలో అడుగు పెట్టడానికి రెడీ అవుతున్నారు. ఆయన తన పార్టీ తరఫున 21 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను పోటీకి నిలబెడితే... అన్నిటిలో విజయఢంకా గట్టిగా మోగించారు. ఈ విజయం పవన్ అన్నయ్య, మెగా ఫ్యామిలీ మూలవిరాట్ చిరంజీవి (Chiranjeevi)కి అత్యంత ఆనందం కలిగించింది. తమ్ముడిని అభినందిస్తూ చిరు ట్వీట్ చేశారు.

కళ్యాణ్ బాబూ... అన్నగా గర్వంగా ఉంది!
''డియర్ కళ్యాణ్ బాబు... ఎక్కడ నెగ్గాలో, ఎక్కడ తగ్గాలో తెలిసిన నిన్ను తగ్గావని ఎవరు అనుకున్నా అది ప్రజలను నెగ్గించటానికే అని నిరూపించిన నిన్ను చూస్తుంటే ఒక అన్నగా గర్వంగా ఉంది'' అని చిరంజీవి ట్వీట్ చేశారు. 'ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినవాడు గొప్పోడు' అని 'అత్తారింటికి దారేది'లో త్రివిక్రమ్ రాసిన డైలాగును గుర్తు చేసేలా తమ్ముడిని అభినందించారు. 

ఏపీ ఎన్నికల ఫలితాల్లో తెలుగు దేశం, జనసేన, బీజేపీ కూటమికి సుస్పష్టమైన మెజార్టీ వచ్చిన తర్వాత ట్వీట్ చేసిన చిరంజీవి... ''నువ్వు (పవన్ కళ్యాణ్) Game Changerవి మాత్రమే కాదు, Man of the matchవి కూడా అని అందరూ నిన్ను కొనియాడుతుంటే నా హృదయం ఉప్పొంగుతోంది'' అని సంతోషం వ్యక్తం చేశారు.

Also Readపవన్ కళ్యాణ్ ఓటమికి తల వంచలేదు... ఈ విజయం ఒక్క రోజులో వచ్చినది కాదు

''నీ (పవన్ కళ్యాణ్) కృషి, నీ త్యాగం, నీ ధ్యేయం, నీ సత్యం జనం కోసమే! ఈ అద్భుతమైన ప్రజా తీర్పు రాష్ట్ర భవిష్యత్తు కోసం, ప్రజల సంక్షేమం కోసం, అలాగే నీ కలల్ని, నువ్వు ఏర్పరుచుకున్న లక్ష్యాల్ని సాకారం చేసే దిశలో నిన్ను నడిపిస్తాయని ఆకాంక్షిస్తూ... ఆశీర్వదిస్తూ, శుభాభినందనలు'' అని తమ్ముడికి ఆల్ ది బెస్ట్ చెప్పారు చిరంజీవి. పవన్ కళ్యాణ్ ప్రారంభించే కొత్త అధ్యాయంలో శుభం కలగాలని, పవన్ విజయం సాధించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నానట్లు చిరు తెలిపారు.

Also Readపవన్ ఫ్యాన్స్ ముగింట ట్రెండ్స్ ఎంత - వాట్సాప్ స్టేటస్, ట్విట్టర్ వీడియో షేర్స్‌తో హల్‌ చల్

ఎన్నికల ఫలితాలను లైవ్ చూస్తున్న మెగా ఫ్యామిలీ మెంబర్స్ పవన్ విజయం తెలియగానే భావోద్వేగానికి గురయ్యారు. పవన్ సోదర సోదరీమణులు ఆనంద భాష్పాలతో కూడిన వీడియో నెట్టింట వైరల్ అయ్యింది.

Also Read: పవన్‌ కళ్యాణ్ కు అల్లు అర్జున్ కంగ్రాట్స్ - ట్రోల్ చేస్తున్న మెగా, జనసేన ఫ్యాన్స్!

టాప్ హెడ్ లైన్స్

Uppal Balu Request : 'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...
'ప్లీజ్... నన్ను బిగ్ బాస్‌కు తీసుకోండి' - ఉప్పల్ బాలు రిక్వెస్ట్... లాస్ట్ వీడియో అంటూ...
Eshwar Sai Madhuri Rathod Songs : మాధురి రాథోడ్ హిట్ సాంగ్స్ విత్ ఈశ్వర్ సాయి - రాతిరి రాతిరి రాతిరిలో, సీటీ చీర... ఫోక్ డ్యాన్సర్స్ ట్రెండింగ్ పాటలివే
మాధురి రాథోడ్ హిట్ సాంగ్స్ విత్ ఈశ్వర్ సాయి - రాతిరి రాతిరి రాతిరిలో, సీటీ చీర... ఫోక్ డ్యాన్సర్స్ ట్రెండింగ్ పాటలివే
Brahmanandam Brother Video: అన్నయ్యకు ఇల్లు కట్టించాడు... ఆడబిడ్డల పెళ్లిళ్లు చేశాడు... బ్రహ్మానందం గొప్పతనం చెప్పిన శ్రీవదన్
అన్నయ్యకు ఇల్లు కట్టించాడు... ఆడబిడ్డల పెళ్లిళ్లు చేశాడు... బ్రహ్మానందం గొప్పతనం చెప్పిన శ్రీవదన్
Rathiri Rathiri Rathirilo Song : ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Southern Zonal Council Meeting: మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
మహాబలిపురం సదరన్ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ విభజన సమస్యల ప్రస్తావన! కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ వేయాలని చంద్రబాబు ప్రతిపాదన!
Konda Surekha: కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
కుమార్తె వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివరణ! తనకు ఆపాదించవద్దని పీసీసీకి రిక్వస్ట్!
PV Sindhu Says World Badminton Drama.!: సింధు నిష్క్రమణ.. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! 
పోరాడి ఓడిన సింధు .. మెడికల్ టైమౌట్ డ్రామాతోనే వాంగ్ జీ యీ ముందంజ..! వరల్డ్ చాంపియన్షిప్ టోర్నీ
Vizag Crime News: విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
Nara Lokesh vs YS Jagan: వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
వైఎస్ జగన్ vs నారా లోకేష్‌! సీబీఐ దర్యాప్తునకు వైసీపీ అధినేత ఛాలెంజ్‌ ! డీఎస్సీకి ఏపీపీఎస్సీకి అవగాహన లేదా అంటూ మంత్రి కౌంటర్‌!
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
విజయసాయిరెడ్డి న్యావిగేషన్ ప్లాన్ - మాస్ ఇమేజ్ లేని నేత.. కొత్త పార్టీ వైపు ఎందుకు?
బైక్ కాదు, కారు కాదు.. హైడ్రోజన్‌తో నడిచే రోబోటిక్ గుర్రం - కవాసకి ప్రయోగం
హైడ్రోజన్‌తో పరుగులు తీసే కీలుగుర్రం.. తయారు చేస్తున్న కవాసకి
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
Embed widget