(Source: ECI | ABP NEWS)
Chiranjeevi Anil Ravipudi: రఫ్పాడించేందుకు రెడీ - మెగాస్టార్, అనిల్ రావిపూడి మూవీ షూటింగ్ స్టార్ట్
Mega 157: మెగాస్టార్, అనిల్ రావిపూడి అవెయిటెడ్ మూవీ షూటింగ్ ప్రారంభమైంది. 'మెగా 157' వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతుండగా.. చిరంజీవి సరసన నయనతార హీరోయిన్‌గా నటిస్తున్నారు.

Chiranjeevi Anil Ravipudi Mega 157 Movie Shooting Started: మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. మెగాస్టార్ చిరంజీవి, స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి 'మెగా 157' మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. ఈ మూవీలో చిరంజీవి సరసన నయనతార హీరోయిన్‌గా నటిస్తున్నారు.
కీలక సీన్స్ షూటింగ్
ఈ మూవీని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సుశ్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. తన అభిమాన హీరో మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేయాలన్న అనిల్ రావిపూడి వెయిటింగ్‌కు ఎట్టకేలకు తెరపడింది. శుక్రవారం హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాగా.. ఫస్ట్ డే చిరంజీవితో పాటు ఇతర నటీనటులపై కీలక సీన్స్‌ను చిత్రీకరించారు. 'సంక్రాంతికి వస్తున్నాం' భారీ సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్న అనిల్ రావిపూడికి మెగాస్టార్‌తో ఇది ఫస్ట్ మూవీ. ఈ సినిమా అనౌన్స్‌మెంట్ వచ్చినప్పటి నుంచే భారీ హైప్ నెలకొంది.
ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ మూవీలో చిరంజీవిని హ్యూమరస్ క్యారెక్టర్‌లో చూపించనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా అనౌన్స్‌మెంట్ దగ్గరి నుంచి నటీనటులు, టెక్నీషియన్స్ ఇంట్రడ్యూస్ చేయడం వరకూ అనిల్ తన యునిక్ ప్రమోషన్లతో సోషల్ మీడియాను షేక్ చేశారు. హీరోయిన్‌గా నయనతార ఎంట్రీని కూడా స్పెషల్ వీడియోతో చూపించారు. దీంతో ఫ్యాన్స్ ఎక్స్‌పెక్టేషన్స్ మరింత ఎక్కువయ్యాయి. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్నారు.
Also Read: డార్లింగ్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్ - 'ది రాజాసాబ్' టీజర్ వచ్చేస్తోంది!
ఈ మూవీలో మెగాస్టార్ రోల్ ఏంటనే దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొనగా.. చిరంజీవి అసలు పేరు శివ శంకర్ వరప్రసాద్‌నే సినిమాలో కూడా ఉంటుందని అనిల్ ఇదివరకే క్లారిటీ ఇచ్చారు. ఆయన 'రా' ఏజెంట్‌గా కనిపించనున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ మూవీలో యంగ్ హీరోయిన్ కేథరిన్ కూడా నటించనున్నారని తెలుస్తోంది. అలాగే, సినిమాలో మెగాస్టార్‌కు ఓ సిస్టర్ రోల్ ఉందని ఇది చాలా కీలకమని సమాచారం. దీని కోసం మరో హీరోయిన్ జ్యోతికను తీసుకుంటున్నారనే రూమర్ వినిపిస్తోంది. దీనిపై కూడా క్లారిటీ రావాల్సి ఉంది.
వరుస హిట్లతో ఫుల్ జోష్‌లో ఉన్న అనిల్ రావిపూడి మెగాస్టార్‌తో హిట్ కొట్టడం ఖాయమంటూ మెగా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. చిరంజీవిని హ్యూమరస్ క్యారెక్టర్‌లో చూసి చాలా రోజులైందని.. కామెడీ ఎంటర్‌టైనర్స్ కేరాఫ్‌గా నిలిచిన అనిల్.. చిరుతోనూ అదే రేంజ్‌లో మూవీ తీస్తారని అంటున్నారు. మూవీలో ఇద్దరు హీరోయిన్లు నటించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుండగా.. నయనతార కన్ఫర్మ్ అయ్యారు. ఇక మరో రోల్ కోసం అదితిరావు హైదరిని టీం సంప్రదించారనే టాక్ వినిపిస్తోంది. మరి దీనిపై కూడా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. వచ్చే ఏడాది సంక్రాంతికి మూవీని రిలీజ్ చేయాలని అనిల్ ప్లాన్ చేస్తున్నారు. అందుకు తగ్గట్లుగానే ప్రణాళిక రచిస్తున్నారు. ప్రస్తుతం.. చిరంజీవి 'విశ్వంభర' షూటింగ్ కూడా శరవేగంగా సాగుతుండగా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.





















