Gurtimpu Movie: స్పోర్ట్స్ కోర్ట్ డ్రామాగా 'గుర్తింపు' - ఫస్ట్ లుక్ చూశారా?
Gurtimpu First Look: కేజేఆర్ హీరోగా యధార్థ సంఘటనల ఆధారంగా రూపొందిన స్పోర్ట్స్ కోర్ట్ డ్రామా 'గుర్తింపు'. ఈ మూవీకి సంబంధించి టైటిల్ పోస్టర్‌ను తాజాగా రిజీల్ చేశారు మేకర్స్.

KJR's Gurtimpu First Look Released: యధార్థ సంఘటనల ఆధారంగా రూపొందిన స్పోర్ట్స్ కోర్ట్ డ్రామా 'గుర్తింపు' మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. స్వస్తిక్ విజన్స్ సమర్పణలో గంగా ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో కేజీఆర్ హీరోగా మూవీ తెరకెక్కుతుండగా తాజాగా టైటిల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ మూవీకి తెన్‌పతియాన్ దర్శకత్వం వహించగా.. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోంది.
ఈ మూవీలో కేజేఆర్, సింధూరి విశ్వనాథ్, వీజీ.వెంకటేష్, రంగరాజ్ పాండే, మన్సూర్ అలీ ఖాన్, రమా, మోహన్ రామ్, ఆంటోనీ, అజిత్ ఘోషి, విమల్, ఇజబెల్లా, షాన్, దీపిక, జానకి, అరుల్ జ్యోతి వంటి వారు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే 85 శాతం షూటింగ్ పూర్తైందని త్వరలోనే మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ తెలిపారు.
Also Read: 'ఏస్' రివ్యూ: విజయ్ సేతుపతి క్రైమ్ థ్రిల్లర్... యోగిబాబు కామెడీ గట్టెక్కించిందా? మూవీ హిట్టేనా?
నిర్మాత మహేశ్వర్ రెడ్డి మూలి మాట్లాడుతూ.. 'పేదరికంలో ఉన్న ఓ వ్యక్తి.. తన కలల్ని నెరవేర్చుకునేందుకు క్రీడా రంగంలో ఎదిగిన తీరు, క్రీడా రంగంలో గుర్తింపు కోసం పడిన శ్రమ, చేసిన ప్రయాణం, ఎదుర్కొన్న సవాళ్లను అందరికీ కనెక్ట్ అయ్యేలా ఎమోషనల్ డ్రామాగా ‘గుర్తింపు’ సినిమాను రూపొందిస్తున్నాo. ఇప్పటికి 85 శాతం షూటింగ్ పూర్తైంది.' అని చెప్పారు. ఇంతకు ముందు ఆయన సంస్థలో శివ కార్తికేయన్ చిత్రాన్ని 'వరుణ్ డాక్టర్' పేరుతో రీమేక్ చేసి మంచి విజయాన్ని అందుకున్నట్లు తెలిపారు. ఇటీవల అశ్విన్ బాబు హీరోగా ‘శివం భజే’ మూవీ నిర్మించినట్లు వెల్లడించారు.
ఈ చిత్రానికి సంగీతం: జిబ్రాన్, కెమెరామెన్: ఎ. విశ్వనాథ్, యాక్షన్: పీటర్ హెయిన్, ఎడిటర్: శాన్ లోకేష్, ఆర్ట్ డైరెక్టర్: రాము తంగరాజ్,
నిర్మాణం : స్వస్తిక్ విజన్స్ , గంగా ఎంటర్టైన్మెంట్స్, దర్శకుడు: తెన్‌పతియాన్.
The voice of an unsung hero.@KJRuniverse in - #GURTIMPU - #గుర్తింపు 🎬
— Ganga Entertainments (@GangaEnts) May 23, 2025
A Statement by @jpthenpathiyan 🥇 #RaiseYourVoice@swastik_visions @GangaEnts @GhibranVaibodha @viswafilmmaker @vijivenkatesh @PeterHeinOffl @SindhooriC @Sanlokesh @RangarajPandeyR #MansoorAlikhan pic.twitter.com/2YQhYF6Ms3





















