అన్వేషించండి

Chirajeevi: చిరంజీవి 100వ సినిమా 'త్రినేత్రుడు'కు 36 ఏళ్ళు... డ్రగ్స్ ఇష్యూ అప్పుడే చూపించిన మెగాస్టార్, ఇప్పుడు రిలీజ్ అయితేనా?

Chiranjeevi Records: చిరంజీవి 100వ సినిమా 'త్రినేత్రుడు'కు 36 ఏళ్ళు నిండాయి. తొలి చిత్రం 'ప్రాణం ఖరీదు' రిలీజ్ అయిన తేదీకి వందో సినిమా కూడా రిలీజ్ కావడం విశేషం. ఈ సినిమా విశేషాలు ఏమిటంటే...

చిరంజీవి (Megastar Chirajeevi)... ఈ పేరు ఒక్కటి చాలు సగటు సినీ ప్రేక్షకుడు గౌరవంగా ఫీల్ అవ్వడానికి. ఇక మెగా అభిమానులు అయితే పేరు వింటే చాలు పులకించపోతారు. సుమారు నాలుగు దశాబ్దాల సినీ ప్రయాణంలో టాలీవుడ్ మార్కెట్ స్థాయిని పెంచిన హీరోగా చిరంజీవి ప్రస్థానం తిరుగులేనిది. సాధారణంగా హీరోలకు ఫాన్స్ ఉంటారు. కానీ హీరోలే ఫ్యాన్స్ గా ఉండే స్టార్ ఎవరైనా ఉన్నారంటే అది మెగాస్టారే. అలాంటి చిరంజీవి నటించిన 100వ సినిమా రిలీజై నేటికి 36 ఏళ్ళు. ఆ సినిమానే ఎన్నో అంచనాలతో భారీ స్థాయిలో రిలీజ్ అయిన 'త్రినేత్రుడు'. సెప్టెంబర్ 22.... అంటే సరిగ్గా ఈ రోజున 36 సంవత్సరాల క్రితం రిలీజ్ అయ్యింది 'త్రినేత్రుడు'. ఇది చిరంజీవి సొంత సినిమా. ఆయన తమ్ముడు నాగబాబు ఈ సినిమాకు నిర్మాత. విశేషం ఏమిటంటే... చిరంజీవి మొదటి సినిమా 'ప్రాణం ఖరీదు' కూడా ఇదే తేదీన సెప్టెంబర్ 22న రిలీజ్ కావడం.

భారీ అంచనాలతో రిలీజ్ అయిన త్రినేత్రుడు

'త్రినేత్రుడు' సినిమా విషయానికి వస్తే... చిరంజీవి 100వ సినిమా కావడంతో ఆ సినిమాను నిర్మించడానికి నిర్మాతలు ఎగబడ్డారు. అయితే, దానిని సొంత బ్యానర్ లో తీయాలని భావించిన చిరంజీవి... అంజనా ప్రొడక్షన్స్ సంస్థలో తమ్ముడు నాగబాబు నిర్మాతగా చిత్రాన్ని ప్రకటించారు. ఇందులో హీరోయిన్‌గా భాను ప్రియ, విలన్‌గా బాలీవుడ్ నటుడు కుల భూషణ్ ఖర్బంద, ఇంకా కీలక పాత్రల్లో మురళీ మోహన్, చంద్రమోహన్, రంగనాథ్, సత్యనారాయణ, బాబ్ ఆంథోనీ లాంటి వారు నటించారు. సినిమా ఓపెనింగ్ సన్నివేశాల్లో ఒక ప్రత్యేక పాత్రలో నాగబాబు కనిపిస్తారు. ఈ చిత్రానికి ఎ. కోదండ రామిరెడ్డి దర్శకత్వం వహించగా... అప్పట్లో ఫుల్ ఫామ్ లో ఉన్న రాజ్ -కోటి మ్యూజిక్ అందించారు. ఈ సినిమా అధిక భాగం గోవాలో షూటింగ్ అయింది.

సమాజాన్ని పీడిస్తున్న సమస్యను అప్పట్లోనే డీల్ చేసిన సినిమా 

ఈ సినిమా కథాంశం డ్రగ్స్ చుట్టూ తిరుగుతుంది. ఇప్పుడు దేశంలో అదొక ప్రధాన సమస్యగా మారింది. డ్రగ్స్ వద్దని స్టార్స్‌ సహా పలువురు ప్రముఖులు అవగాహనా వీడియోలు చేస్తున్నారు. డ్రగ్ మాఫియాను అరికట్టే క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ అభిమన్యు పాత్రలో చిరంజీవి ఈ సినిమాలో కనిపిస్తారు. ముఖ్యంగా చిన్న పిల్లలు సైతం డ్రగ్స్ కు ఎలా బానిసలుగా మారుతున్నారో ఈ సినిమాలో చెప్పే ప్రయత్నం చేశారు చిరంజీవి.

Also Read: గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లో చిరంజీవి - మరో మెగా రికార్డ్‌, ఆమిర్ ఖాన్ చేతుల మీదుగా ప్రకటన

అయితే అప్పట్లో సామాన్య ప్రేక్షకులకు డ్రగ్స్ దందా గురించి పెద్దగా అవగాహన లేకపోవడంతో 'తినేత్రుడు' హిట్ స్థాయిలోనే ఆగిపోయింది. సినిమా గనుక ఇప్పుడు రిలీజ్ అయి ఉంటే దాని రేంజ్ వేరే స్థాయిలో ఉండేది అంటారు చిరు ఫ్యాన్స్. ఇక ఆ ఏడాది చిరంజీవి 'యముడికి మొగుడు'తో ఇండస్ట్రీ హిట్... 'ఖైదీ నెంబర్ 786'తో సూపర్ హిట్ అందుకుని తానే బాక్స్ ఆఫీస్ కింగ్ గా మరోసారి నిరూపించుకున్నారు.

Also Readచిరంజీవికి అక్కినేని అవార్డు... అమితాబ్ చేతుల మీదుగా - ANR100 ప్రెస్‌మీట్‌లో ప్రకటించిన నాగార్జున

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KA Paul : పది మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలకు హైకోర్టు మళ్లీ నోటీసులు - ఈ సారి కేఏ పాల్ దెబ్బ!
పది మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలకు హైకోర్టు మళ్లీ నోటీసులు - ఈ సారి కేఏ పాల్ దెబ్బ!
Monkeypox: భారత్‌లో 'క్లేడ్ - 1' తొలి మంకీపాక్స్ కేసు నమోదు - కేరళ యువకుడికి వ్యాధి నిర్ధారణ
భారత్‌లో 'క్లేడ్ - 1' తొలి మంకీపాక్స్ కేసు నమోదు - కేరళ యువకుడికి వ్యాధి నిర్ధారణ
Mahesh Babu New Look: రాజమౌళి గారూ... మహేష్ బాబుకు ఏ ఆయిల్ పంపించారండీ - మహర్షిని రుషిలా చేసేశారు కదండీ!
రాజమౌళి గారూ... మహేష్ బాబుకు ఏ ఆయిల్ పంపించారండీ - మహర్షిని రుషిలా చేసేశారు కదండీ!
Tirumala News : నేను నా కుటుంబం నాశనమైపోవాలి - తిరుమలలో భూమన ప్రమాణం  !
నేను నా కుటుంబం నాశనమైపోవాలి - తిరుమలలో భూమన ప్రమాణం !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Laapataa Ladies for Oscar | లాపతా లేడీస్ మూవీ కథేంటి? | ABP DesamPawan Kalyan HHVM Shoot Starts | వీరమల్లు రిలీజ్ డేట్‌పై క్రేజీ అప్ డేట్ | ABP DesamDevara Pre Release Cancel | ప్రీ రిలీజ్ ఎందుకు రద్దు చేశామో చెప్పిన శ్రేయాస్ మీడియా | ABP DesamThree Medical Students Washed Away | అల్లూరి జిల్లా మారేడుమిల్లిలో విషాదం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KA Paul : పది మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలకు హైకోర్టు మళ్లీ నోటీసులు - ఈ సారి కేఏ పాల్ దెబ్బ!
పది మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలకు హైకోర్టు మళ్లీ నోటీసులు - ఈ సారి కేఏ పాల్ దెబ్బ!
Monkeypox: భారత్‌లో 'క్లేడ్ - 1' తొలి మంకీపాక్స్ కేసు నమోదు - కేరళ యువకుడికి వ్యాధి నిర్ధారణ
భారత్‌లో 'క్లేడ్ - 1' తొలి మంకీపాక్స్ కేసు నమోదు - కేరళ యువకుడికి వ్యాధి నిర్ధారణ
Mahesh Babu New Look: రాజమౌళి గారూ... మహేష్ బాబుకు ఏ ఆయిల్ పంపించారండీ - మహర్షిని రుషిలా చేసేశారు కదండీ!
రాజమౌళి గారూ... మహేష్ బాబుకు ఏ ఆయిల్ పంపించారండీ - మహర్షిని రుషిలా చేసేశారు కదండీ!
Tirumala News : నేను నా కుటుంబం నాశనమైపోవాలి - తిరుమలలో భూమన ప్రమాణం  !
నేను నా కుటుంబం నాశనమైపోవాలి - తిరుమలలో భూమన ప్రమాణం !
High Tension in Dharmavaram: సబ్‌ జైలుకు వెళ్లిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి, కూటమి శ్రేణులు అడ్డుకోవడంతో ధర్మవరంలో ఉద్రిక్తత
సబ్‌ జైలుకు వెళ్లిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి, కూటమి శ్రేణులు అడ్డుకోవడంతో ధర్మవరంలో ఉద్రిక్తత
Ponnavolu : నెయ్యి కంటే పందికొవ్వు రేటే ఎక్కువ , ఎలా కల్తీ చేస్తారు ? - లాయర్ పొన్నవోలు వింత వాదన
నెయ్యి కంటే పందికొవ్వు రేటే ఎక్కువ , ఎలా కల్తీ చేస్తారు ? - లాయర్ పొన్నవోలు వింత వాదన
Durgam Cheruvu : సీఎం రేవంత్ సోదరుడి ఇల్లు ఇప్పటికైతే సేఫ్ - కూల్చివేతలపై స్టే ఇచ్చిన  హైకోర్టు
సీఎం రేవంత్ సోదరుడి ఇల్లు ఇప్పటికైతే సేఫ్ - కూల్చివేతలపై స్టే ఇచ్చిన హైకోర్టు
Samsung Galaxy S24 Offer: శాంసంగ్ గెలాక్సీ ఎస్24పై నెవర్ బిఫోర్ ఆఫర్ - ఇప్పుడు ఎంతంటే?
శాంసంగ్ గెలాక్సీ ఎస్24పై నెవర్ బిఫోర్ ఆఫర్ - ఇప్పుడు ఎంతంటే?
Embed widget