అన్వేషించండి

Cannes 2024: ఇండియన్ లేడీ డైరెక్టర్ ఘనత - కేన్స్‌లో గ్రాండ్ ప్రిక్స్ అవార్డ్ దక్కించుకున్న పాయల్ కపాడియా

Cannes 2024: 30 ఏళ్ల తర్వాత ఒక ఇండియన్ ఫీచర్ సినిమా.. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఫీచర్ అయ్యింది. దాన్ని తెరకెక్కించింది ఒక లేడీ డైరెక్టర్. తన పేరే పాయల్ కపాడియా.

Cannes Film Festival 2024: ప్రస్తుతం ఇండియన్ సినిమా అనేది ప్రపంచవ్యాప్తంగా వండర్స్ క్రియేట్ చేస్తోంది. అందుకే 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఇండియన్ మేకర్స్, యాక్టర్స్, ఇన్‌ఫ్లుయెన్సర్స్ హైలెట్ అయ్యారు. అందులో ఫిల్మ్ మేకర్ పాయల్ కపాడియా కూడా ఒకరు. మే 25న జరిగిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో గెలిచి ఇండియాకు మొదటి గ్రాండ్ ప్రిక్స్ అవార్డును తీసుకొచ్చారు పాయల్. తను తెరకెక్కించిన మలయాళం - హిందీ మూవీ అయిన ‘ఆల్ వీ ఇమాజిన్ యాస్ లైట్’కు ఈ అవార్డ్ దక్కింది. దీంతో అసలు పాయల్ కపాడియా ఎవరో తెలియనివారు తన గురించి తెలుసుకోవడానికి సెర్చింగ్ మొదలుపెట్టారు.

30 ఏళ్ల తర్వాత..

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో 30 ఏళ్లుగా ఏ ఇండియన్ లేడీ డైరెక్టర్, ఏ ఇండియన్ సినిమా కూడా గ్రాండ్ ప్రిక్స్ అవార్డ్ కోసం పోటీపడలేదు. 1994లో షాజీ ఎన్ కరుణ్ తెరకెక్కించిన ‘స్వాహం’ సినిమా తర్వాత ఏ ఇతర ఇండియన్ సినిమా కూడా కేన్స్ మెయిన్ పోటీల్లో పోటీపడడానికి సెలక్ట్ అవ్వలేదు. ఇన్నాళ్లకు ఆ అవకాశం ఒక ఇండియన్ సినిమాకు రావడంతో పాటు అవార్డ్ కూడా దక్కడం విశేషం. కేన్స్ జ్యూరీలోని విమర్శకులు సైతం పాయల్ కపాడియా తెరకెక్కించిన ‘ఆల్ వీ ఇమాజిన్ యాస్ లైట్’ మూవీకి 8 నిమిషాల పాటు స్టాండింగ్ ఓవియేషన్ ఇచ్చారు. దీంతో పాయల్ కపాడియా పేరు ఇండియన్ సినిమాలో మారుమోగిపోతోంది.

ఇంతకు ముందు కూడా..

పాయల్ కపాడియా డైరెక్టర్‌గా పరిచయమవుతూ తెరకెక్కించిన మొదటి సినిమా ‘ఆల్ వీ ఇమాజిన్ యాస్ లైట్’ అయినా కూడా తనకు ఇంటర్నెషనల్ స్టేజ్‌పై మెరవడం కొత్తేమీ కాదు. 38 ఏళ్ల ఈ ఫిల్మ్ మేకర్.. 2021లో తెరకెక్కించిన ‘ఏ నైట్ ఆఫ్ నోయింగ్ నథింగ్’ అనే మూవీ కూడా అప్పటి కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఫీచర్ అయ్యింది. అంతే కాకుండా గోల్డెన్ ఐ అవార్డ్ కూడా దక్కించుకుంది. అంతే కాకుండా తను తెరకెక్కించిన షార్ట్ ఫిల్మ్ ‘ఆఫ్టర్నూన్ క్లౌడ్స్’ కూడా అప్పట్లో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఒక స్పెషల్ కేటగిరిలో ఫీచర్ అయ్యింది. ఇప్పుడు ‘ఆల్ వీ ఇమాజిన్ యాస్ లైట్’ గురించి మాట్లాడుతూ తన సినిమాను ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫిల్మ్ మేకర్స్‌కు చూపించడం గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు పాయల్.

ముగ్గురు మహిళల కథ..

‘ఆల్ వీ ఇమాజిన్ యాస్ లైట్’లో ఛాయా కదమ్, దివ్య ప్రభ, కానీ కుస్రుతీ లీడ్ రోల్స్‌లో నటించారు. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అమెరికన్ యాక్టర్ వొయిలా డేవిస్ చేతుల మీదుగా గ్రాండ్ ప్రిక్స్ అవార్డును అందుకున్న పాయల్ కపాడియా.. ఇన్‌స్పైరింగ్ స్పీచ్ ఇచ్చారు. ‘‘ముందుగా మా సినిమాను ఫీచర్ చేసినందుకు కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు చాలా థ్యాంక్స్. మరో ఇండియన్ సినిమాను ఫీచర్ చేయడానికి 30 ఏళ్లు ఆగకండి ప్లీజ్. నా సినిమా ముగ్గురు మహిళలు, వారి మధ్య ఫ్రెండ్‌షిప్‌కు సంబంధించింది. మామూలుగా మహిళలు ఒకరి వెనుక ఒకరు గోతులు తవ్వుతారు. మన సమాజం అలా తయారయ్యింది. అది చాలా దురదృష్టకర విషయం. కానీ నా వరకు నాకు ఫ్రెండ్‌షిప్ అనేది చాలా ముఖ్యం’’ అని చెప్పుకొచ్చారు పాయల్ కపాడియా.

Also Read: కేన్స్‌లో చరిత్ర సృష్టించిన ఇండియన్ నటి అనసూయ సేన్‌గుప్తా

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR Letter: అదానీ మీకు శత్రువు, రేవంత్‌కు మిత్రుడా? ఇది డబుల్ స్టాండ్‌ కాదా? రాహుల్‌కు కేటీఆర్‌ లేఖ
అదానీ మీకు శత్రువు, రేవంత్‌కు మిత్రుడా? ఇది డబుల్ స్టాండ్‌ కాదా? రాహుల్‌కు కేటీఆర్‌ లేఖ
Today Headlines: రాజధాని అమరావతి నిర్మాణంపై బిగ్ అప్‌డేట్ - రాహుల్‌కు కేటీఆర్ లేఖ, టాప్ హెడ్ లైన్స్ @ 3 PM
రాజధాని అమరావతి నిర్మాణంపై బిగ్ అప్‌డేట్ - రాహుల్‌కు కేటీఆర్ లేఖ, టాప్ హెడ్ లైన్స్ @ 3 PM
Pawan Kalyan: నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం -  కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !
నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం - కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !
Telangana News: ప్రాణాలు తీస్తున్న పాములు- కొరికి చిత్ర వధ చేస్తున్న ఎలుకలు- తెలంగాణ గురుకులాల్లో భయానక పరిస్థితులు  
ప్రాణాలు తీస్తున్న పాములు- కొరికి చిత్ర వధ చేస్తున్న ఎలుకలు- తెలంగాణ గురుకులాల్లో భయానక పరిస్థితులు  
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలుఅశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలునా కామెంట్స్‌ని ట్విస్ట్ చేశారు, అంబేడ్కర్ వివాదంపై అమిత్ షాMumbai Ferry Capsized 13 Died | నేవీ బోట్...టూరిస్ట్ బోట్ ఢీ కొట్టడంతోనే ప్రమాదం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Letter: అదానీ మీకు శత్రువు, రేవంత్‌కు మిత్రుడా? ఇది డబుల్ స్టాండ్‌ కాదా? రాహుల్‌కు కేటీఆర్‌ లేఖ
అదానీ మీకు శత్రువు, రేవంత్‌కు మిత్రుడా? ఇది డబుల్ స్టాండ్‌ కాదా? రాహుల్‌కు కేటీఆర్‌ లేఖ
Today Headlines: రాజధాని అమరావతి నిర్మాణంపై బిగ్ అప్‌డేట్ - రాహుల్‌కు కేటీఆర్ లేఖ, టాప్ హెడ్ లైన్స్ @ 3 PM
రాజధాని అమరావతి నిర్మాణంపై బిగ్ అప్‌డేట్ - రాహుల్‌కు కేటీఆర్ లేఖ, టాప్ హెడ్ లైన్స్ @ 3 PM
Pawan Kalyan: నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం -  కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !
నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం - కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !
Telangana News: ప్రాణాలు తీస్తున్న పాములు- కొరికి చిత్ర వధ చేస్తున్న ఎలుకలు- తెలంగాణ గురుకులాల్లో భయానక పరిస్థితులు  
ప్రాణాలు తీస్తున్న పాములు- కొరికి చిత్ర వధ చేస్తున్న ఎలుకలు- తెలంగాణ గురుకులాల్లో భయానక పరిస్థితులు  
BJP MP Pratap Sarangi Injured: రాహుల్ గాంధీ నెట్టేశారు- గాయపడ్డ బీజేపీ ఎంపీ సంచలన ఆరోపణ- పార్లమెంట్ వద్ద గందరగోళం
రాహుల్ గాంధీ నెట్టేశారు- గాయపడ్డ బీజేపీ ఎంపీ సంచలన ఆరోపణ- పార్లమెంట్ వద్ద గందరగోళం
One Nation One Election JPC: జమిలీపై జేపీసీకి చైర్మన్‌గా పీపీ చౌదరి - 21 మంది సభ్యుల నియామకం - రాజ్యసభ ప్రతినిధులు పెండింగ్
జమిలీపై జేపీసీకి చైర్మన్‌గా పీపీ చౌదరి - 21 మంది సభ్యుల నియామకం - రాజ్యసభ ప్రతినిధులు పెండింగ్
Amit Shah: అమిత్‌షాపై విపక్షాల అంబేద్కర్ అస్త్రం- సర్వత్రా విమర్శలు - సంజాయిషీ ఇచ్చుకున్న అమిత్‌షా 
అమిత్‌షాపై విపక్షాల అంబేద్కర్ అస్త్రం- సర్వత్రా విమర్శలు - సంజాయిషీ ఇచ్చుకున్న అమిత్‌షా 
Kohli Vs Media: ఆసీస్ మీడియాపై కోహ్లీ గుస్సా - మాటల యుద్ధానికి దిగిన స్టార్ బ్యాటర్, అసలు ఏం జరిగిందంటే?
ఆసీస్ మీడియాపై కోహ్లీ గుస్సా - మాటల యుద్ధానికి దిగిన స్టార్ బ్యాటర్, అసలు ఏం జరిగిందంటే?
Embed widget