రూ.100 కోట్ల క్లబ్‌లో ‘బ్రో’ మూవీ - 'వకీల్ సాబ్', 'భీమ్లా నాయక్'ను అధిగమించిన కలెక్షన్లు
సముద్రఖని దర్శకత్వం వహించిన 'బ్రో' బాక్సీఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. జూలై 28న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా.. ఇప్పుడు మొదటి వారాంతంలో రూ. 100 కోట్ల మార్కును దాటి తాజాగా రికార్డు సృష్టించింది..
'Bro’ box office collection day 4: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన సూపర్ నేచురల్ ఫాంటసీ చిత్రం 'బ్రో' ఇటీవలే రిలీజై.. ప్రస్తుతం థియేటర్లలో సక్సెఫుల్ గా రన్ అవుతోంది. మొదటి రోజు నుంచే పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద కూడా కలెక్షన్ల మోత మోగిస్తోంది. మొదటి వారాంతంలో రూ. 100 కోట్ల మార్కును దాటి తాజాగా ఈ చిత్రం రికార్డు సృష్టించింది. ‘బ్రో’ విడుదలైన తొలిరోజు రూ.48.09 కోట్లు, రెండో రోజు రూ.27.61 కోట్లు, మూడో రోజు రూ.25.84 కోట్లు వసూలు చేసినట్లు సినీ ట్రేడ్ అనలిస్ట్ మనోబాల విజయబాలన్ తెలిపారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్లు రూ.101.54 కోట్లకు చేరుకున్నాయి.
'బ్రో' ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్ల మార్క్‌ను దాటిన చిత్రాల లిస్ట్ లోకి చేరిపోయింది. దీంతో ఈ సినిమా.. ఇంతకుమునుపు ఈ ఘనత సాధించిన పవన్ కళ్యాణ్ చిత్రాలు 'భీమ్లా నాయక్', 'వకీల్ సాబ్', 'కాటమరాయుడు', 'సర్దార్ గబ్బర్ సింగ్', 'అత్తారింటికి దారేది' సినిమాల సరసన చేరింది. మరో ముఖ్య విషయం ఏమిటంటే ఈ సినిమా ఇప్పుడు ఉత్తర అమెరికా బాక్సాఫీస్ వద్ద టాప్ 10 భారతీయ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఈ చిత్రం అక్కడి మార్కెట్‌లో దాదాపు 2 లక్షల 15 వేల డాలర్లు వసూలు చేసింది.
#BroTheAvatar WW Box Office
— Manobala Vijayabalan (@ManobalaV) July 31, 2023
Hits a CENTURY in just 3 days with limited release across the world.
Day 1 - ₹ 48.09 cr
Day 2 - ₹ 27.61 cr
Day 3 - ₹ 25.84 cr
Total - ₹ 101.54 cr
|#PawanKalyan | #Bro|| pic.twitter.com/lTzJjk59Ok
దేశీయంగా ఈ సినిమా రూ.75 కోట్ల మార్కుకు చేరువలో ఉంది. ఈ సినిమా విడుదలైన నాలుగు రోజుల్లోనే దాదాపు రూ.71 కోట్లు వసూలు చేసింది. బ్రో తొలి రోజున రూ. 30.05 కోట్లు, మొదటి శనివారం రూ. 17.05 కోట్లు, మొదటి ఆదివారం రూ. 16.90 కోట్లు, మొదటి సోమవారం రూ. 7 కోట్లు రాబట్టింది. ట్రేడ్ పోర్టల్ Sacnilk ప్రకారం, సోమవారం నాటికి ఈ చిత్రం తెలుగు షోలలో మొత్తం 17.61 శాతం బాక్సాఫీస్ ఆక్యుపెన్సీని కలిగి ఉంది.
‘బ్రో’ సినిమాలో పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్‌లతో పాటు కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్, రోహిణి, వెన్నెల కిషోర్, ఆలీ రెజా, తనికెళ్ల భరణి, రాజా చెంబోలు కీలక పాత్రల్లో కనిపించారు. దర్శకుడు సముద్రఖని ఒక ప్రత్యేక పాత్రలో కనిపించారు. ఈ సినిమాకు థమన్ సంగీత దర్శకత్వం అందించారు. సుజీత్ వాసుదేవ్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తించారు. ఈ చిత్రం IMDb రేటింగ్ 9/10 ఉండగా.. రాటెన్ టొమాటోస్‌లో ప్రేక్షకుల స్కోర్ 81 శాతంగా నమోదైంది. ఇదిలా ఉండగా సముద్రఖని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ తో పాటు ప్రియా ప్రకాష్ వారియర్, వెన్నెల కిషోర్, సుబ్బరాజు ముఖ్య పాత్రలు పోషించారు. 'బ్రో' జూలై 28న థియేటర్లలో విడుదలైంది.
Read Also : దేవుడి సినిమాకు ‘అడల్ట్’ సర్టిఫికెట్ - ‘ఓ మైగాడ్ 2’ పెద్దల చిత్రమా?