అన్వేషించండి

Rajinikanth: విజయ్ సినిమాపై రజినీకాంత్ ఓపెన్ కామెంట్స్ - మళ్లీ ఫ్యాన్ వార్ షురూ!

కోలీవుడ్‌లో జరిగే ఫ్యాన్ వార్‌కు మరోసారి జీవం పోసినట్టుగా అయ్యింది. విజయ్ సినిమా గురించి రజినీ ఓపెన్‌ కామెంట్స్ చేయడమే దీనికి కారణంగా మారింది.

సినీ పరిశ్రమలో ఫ్యాన్ వార్స్ అనేవి చాలా సహజంగా మారిపోయాయి. పైగా ఒక్కొక్కసారి ఇవి శృతిమించిపోతున్నాయి కూడా. హీరోలు ఎవరి పని వారు చేసుకుంటూ, కలిసి మెలిసి ఉంటున్నా కూడా ఫ్యాన్స్ మాత్రం ఇతర హీరోలు మాట్లాడే మాటల్లో, చేసే పనుల్లో కావాలని తప్పులు వెతుకుతూ వారిని ట్రోల్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా తమిళ సినీ పరిశ్రమలో జరిగే ట్రోల్స్ విపరీతంగా ఉంటాయి. తాజాగా రజినీకాంత్ చేసిన వ్యాఖ్యలు.. విజయ్ ఫ్యాన్స్‌కు ఆగ్రహాన్ని తెప్పించాయి. ఇది కోలీవుడ్‌లో జరిగే ఫ్యాన్ వార్‌కు మరోసారి జీవం పోసినట్టుగా అయ్యింది. విజయ్ సినిమా గురించి రజినీ ఓపెన్‌ కామెంట్స్ చేయడమే దీనికి కారణం.

జైలర్ సినిమాను డైరెక్ట్ చేసిన నెల్సన్ దిలీప్‌కుమార్ ఇంతకు ముందు స్టార్ హీరో విజయ్‌తో కలిసి ‘‘బీస్ట్’’ చిత్రాన్ని తెరకెక్కించారు. ‘బీస్ట్’ సినిమా కమర్షియల్‌గా సక్సెస్ అయ్యిందా లేదా అన్న విషయాన్ని పక్కన పెడితే.. ప్రేక్షకుల దగ్గర నుండి మాత్రం చాలా నెగిటివ్ రివ్యూలను అందుకుంది. విజయ్ ఫ్యాన్స్ సైతం సినిమాకు నెగిటివ్ రివ్యూలను అందించారు. అంతే కాకుండా విజయ్ తండ్రి కూడా ‘బీస్ట్’ రిజల్ట్‌పై అప్పట్లో స్పందించడం సంచలనంగా మారింది. నెల్సన్ దిలీప్‌కుమార్ అసలు ‘బీస్ట్’ స్క్రీన్‌ప్లేను సరిగా ప్లాన్ చేసుకోలేదని, తెరకెక్కించిన విధానంలో చాలా లోపాలు ఉన్నాయని ఓపెన్‌గా కామెంట్ చేశారు విజయ్ తండ్రి. తాజాగా రజినీ కూడా ‘బీస్ట్’ రిజల్ట్‌పై ఓపెన్‌గా కామెంట్స్ చేయడం విజయ్ ఫ్యాన్స్‌ను ఆగ్రహానికి గురిచేసింది.

‘బీస్ట్’ రిజల్ట్‌పై రజినీ స్పందన

‘బీస్ట్’ విడుదలయిన కొన్నిరోజులకే రజినీతో జైలర్ చిత్రాన్ని అనౌన్స్ చేశాడు నెల్సన్ దిలీప్‌కుమార్. దీంతో ఫ్లాప్ దర్శకుడితో సినిమా ఏంటి అని రజినీ ఫ్యాన్స్ కలవరపడ్డారు. తాజాగా జైలర్ మూవీ టీమ్ ఏర్పాటు చేసిన ఆడియో లాంచ్ ఈవెంట్‌లో నెల్సన్‌తో సినిమా అనగానే డిస్ట్రిబ్యూటర్స్ ఎలా స్పందించారు అనే విషయాన్ని రజినీ బయటపెట్టారు. నెల్సన్‌తో సినిమా అనగానే డిస్ట్రిబ్యూటర్లు తనకు ఫోన్ చేసి ‘బీస్ట్’‌కు రివ్యూలు బాలేవని అన్నారని, అందుకే తనతో సినిమా క్యాన్సల్ చేయమని చెప్పినట్టు బయటపెట్టారు. ఈ విషయం నిజమా, కాదా తెలుసుకోవడం కోసం ‘బీస్ట్’ నిర్మాతలకు తాను ఫోన్ చేసినట్టుగా తెలిపాడు. అప్పుడు నిర్మాతలు కూడా ‘బీస్ట్’‌కు నెగిటివ్ రివ్యూలు వచ్చాయని కాకపోతే పెట్టిన పెట్టుబడి మాత్రం తిరిగి వచ్చినట్టుగా తెలిపారన్నారు. 

రజినీకాంత్ ఇలా ఓపెన్‌గా విజయ్ లాంటి స్టార్ హీరో సినిమాపై కామెంట్స్ చేయడం ఏమీ బాలేదని విజయ్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక రజినీ చివరి చిత్రం ‘అన్నాత్తే’ రిజల్ట్ గురించి వారు తెరపైకి తీసుకువస్తున్నారు. ‘బీస్ట్’ కంటే అన్నాత్తే రెవెన్యూ పరంగా ఘోరమైన పరాజయాన్ని అందుకుందని, మరి దాని గురించి ఎవరు మాట్లాడతారంటూ విజయ్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ఫైర్ అవుతున్నారు. దీంతో కోలీవుడ్‌లో ఫ్యాన్ వార్ మరోసారి తెరపైకి వచ్చింది. 

ప్రేక్షకుల ముందుకు ‘జైలర్’

రజినీకాంత్ సినీ పరిశ్రమలో అడుగుపెట్టి ఎన్నో సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికీ తిరుగులేని హీరోగా ముందుకు వెళ్తున్నారు. ఆఫర్ల విషయంలో రజినీ దూకుడు ఏ మాత్రం తగ్గలేదు. తాను చేసిన సినిమా రిజల్ట్ గురించి పెద్దగా పట్టించుకోకుండా వెంటవెంటనే సినిమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నారు ఈ సీనియర్ హీరో. అయితే ప్రస్తుతం రజినీ.. నెల్సన్ దిలీప్‌కుమార్‌తో కలిసి ‘జైలర్’ అనే చిత్రాన్ని చేశారు. ఇందులో రజినీకాంత్‌తో హీరోయిన్‌గా జతకట్టింది మిల్కీ బ్యూటీ తమన్నా. ఆగస్ట్ 10న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ విడుదలకు సిద్ధమవుతోంది. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న సమయంలో మూవీ టీమ్ ప్రమోషన్స్ విషయంలో దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే జైలర్ నుండి విడుదలయిన ‘కావాలి’ పాట బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది.

Also Read: ‘స్కంద’ ఫస్ట్ సింగిల్ అప్డేట్ - ‘నీ చుట్టూ చుట్టూ’ అంటూ రానున్న రామ్, శ్రీలీల

టాప్ హెడ్ లైన్స్

Oh Sukumari OTT : ముట్టుకుంటే షాక్ కొట్టే అమ్మాయి - భర్త ఏం చేశాడు?... ఓటీటీలోకి రీసెంట్ రొమాంటిక్ కామెడీ
ముట్టుకుంటే షాక్ కొట్టే అమ్మాయి - భర్త ఏం చేశాడు?... ఓటీటీలోకి రీసెంట్ రొమాంటిక్ కామెడీ
Pradeep Rawat Passes Away: ప్రముఖ నటుడు ప్రదీప్‌ రావత్‌ కన్నుమూత.. తొలి సినిమాతోనే ఇండస్ట్రీలో గుర్తింపు
ప్రముఖ నటుడు ప్రదీప్‌ రావత్‌ కన్నుమూత.. తొలి సినిమాతోనే ఇండస్ట్రీలో గుర్తింపు
Vanda Devullu OTT: వంద దేవుళ్ళు ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది... Zee5లో విజయ్ ఆంటోనీ సినిమా స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
వంద దేవుళ్ళు ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది... Zee5లో విజయ్ ఆంటోనీ సినిమా స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Ichi Padeddam Song Lyrics: 'పళ్ళబురుసు'లో బారాత్ సాంగ్... ఇచ్చి పడేశారంతే... లిరిసిస్ట్ సురేష్ గంగుల ఏం రాశారంటే?
'పళ్ళబురుసు'లో బారాత్ సాంగ్... ఇచ్చి పడేశారంతే... లిరిసిస్ట్ సురేష్ గంగుల ఏం రాశారంటే?

వీడియోలు

Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ వేటు
India Fielding Coach T Dilip Emotional Post | ఫీల్డింగ్ కోచ్‌గా ముగిసిన దిలీప్ ప్రయాణం
Virat Kohli World Record | వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ
Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi Praises Nara Lokesh: నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
Telangana Cabinet Expansion 2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
The Story of Vizag Old Airport : విశాఖ నుంచి చివరి కమర్శియల్ ఫ్లైట్ -
విశాఖ నుంచి చివరి కమర్శియల్ ఫ్లైట్ - "INS డేగ" ఇక జ్ఞాపకమేనా !!
Supreme Court On Vehicle Insurance:బీమా లేని వాహనాలకు పెట్రోల్‌ బంకుల్లో నో పెట్రోల్‌, భారీ జరిమానాలు! కేంద్రానికి సుప్రీంకోర్టు సంచలన ప్రతిపాదన!
బీమా లేని వాహనాలకు పెట్రోల్‌ బంకుల్లో నో పెట్రోల్‌, భారీ జరిమానాలు! కేంద్రానికి సుప్రీంకోర్టు సంచలన ప్రతిపాదన!
Udhayanidhi Stalin: నా అరెస్ట్ పెద్ద కామెడీ- ఎవరికీ భయపడను, మళ్లీ మళ్లీ మాట్లాడతాను: ఉదయనిధి స్టాలిన్
నా అరెస్ట్ పెద్ద కామెడీ- ఎవరికీ భయపడను, మళ్లీ మళ్లీ మాట్లాడతాను: ఉదయనిధి స్టాలిన్
Telangana Police Vehicle Rapido: పోలీసు వాహనాన్ని ర్యాపిడో బైక్‌గా వాడేస్తున్నారు - సోషల్ మీడియాలో వీడియో వైరల్.. విచారణకు ఆదేశం!
పోలీసు వాహనాన్ని ర్యాపిడో బైక్‌గా వాడేస్తున్నారు - సోషల్ మీడియాలో వీడియో వైరల్.. విచారణకు ఆదేశం!
మయామి 'లాంజెవిటీ' పెంట్‌హౌస్: ఆయుష్షును పెంచుతుందా? వాస్తు ఏం చెబుతోంది?
మయామి 'లాంజెవిటీ' పెంట్‌హౌస్: ఆయుష్షును పెంచుతుందా? వాస్తు ఏం చెబుతోంది?
Khanapur MLA Wedma Bojju: ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరికతో దిగొచ్చిన ఫారెస్ట్ అధికారులు - రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్ -జన్నారంలో సడలిన ఉద్రిక్తత!!
ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరికతో దిగొచ్చిన ఫారెస్ట్ అధికారులు - రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్ -జన్నారంలో సడలిన ఉద్రిక్తత!!
Embed widget