దేవుడి సినిమాకు ‘అడల్ట్’ సర్టిఫికెట్ - ‘ఓ మైగాడ్ 2’ పెద్దల చిత్రమా?
అక్షయ్ కుమార్ 'ఓ మై గాడ్ 2' సినిమాకు మొత్తానికి విడుదలకు సిద్ధమైంది. సినిమాలో చిన్న చిన్న మార్పులు చేయమని చెప్తూ తాజాగా సెన్సార్ బోర్డ్ 'A' సర్టిఫికేట్ జారీ చేసింది. దీంతో మేకర్స్ ఊపిరి పీల్చుకున్నారు
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ శివుడిగా నటిస్తోన్న 'ఓ మై గాడ్ 2' విడుదలకు లైన్ క్లియర్ అయింది. అయితే, ఊహించని విధంగా 'OMG 2' చిత్రానికి సెన్సార్ బోర్డ్ 'A' సర్టిఫికేట్ ఇచ్చింది. దీంతో దేవుడి సినిమాకు అడల్ట్ సర్టిఫికెట్ ఏమిటని అంతా ఆశ్చర్యపోతున్నారు.
‘A’ మాత్రమే కాదు.. కొన్ని కట్స్, మరికొన్ని సన్నివేశాలను మార్చాలని మాత్రం సెన్సార్ బోర్డు సూచించింది. అంతకుముందు ఈ సినిమాకు “U/A సర్టిఫికేట్ మంజూరు చేయడానికి కమిటీ చాలా కట్స్‌ను సూచించినట్లు తెలిసింది. అయితే, ఆ కట్స్‌కు నిర్మాతలు అంగీకరించకపోవడం వల్ల.. ఆ సన్నివేశాలను చెక్కుచెదరకుండా ఉంచి 'ఎ' సర్టిఫికేట్ జారీ చేసినట్లు తెలిసింది. ఇందుకు మేకర్స్ కూడా ఒకే చెప్పారని సమచారం.
OMG 2లోని ఆడియో, విజువల్ మార్పులపై సూచనలిచ్చిన బోర్డు.. సినిమాలో అక్షయ్ కుమార్ పోషించిన పాత్రపై అభ్యంతరం తెలిపింది. అక్షయ్‌ని దేవుడిగా చూపించే బదులు, భగవంతుని దూతగా చూపించాలని సూచించినట్లు సమాచారం. సెన్సార్ సర్టిఫికెట్ వచ్చిన నేపథ్యంలో రిలీజ్ డేట్‌లో మార్పు ఉంటుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. వాస్తవానికి ఈ మూవీ ఆగస్ట్ 11న థియేటర్లలో విడుదల కావల్సి ఉంది.
అమిత్ రాయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఓ మై గాడ్' సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన పోస్టర్లు సినిమాపై ఆసక్తిని రేకెత్తించాయి. షూటింగ్ పూర్తిచేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ సినిమా సెన్సార్ సర్టిఫికెట్ వద్ద ఆగిపోయింది. దీంతో చేసేదేం లేక మూవీ టీం సినిమా విడుదలను వాయిదా వేయాలని డిసైడ్ అయినట్లు కూడా టాక్ వచ్చింది. ప్రస్తుతం సెన్సార్ బోర్డు సూచించిన మార్పులన్నీ చేసేందుకు ఇంకాస్త సమయం పట్టున్నట్లు తెలుస్తోంది. మరి, విడుదల తేదీని మారుస్తారో, ముందుగా అనుకున్న తేదీకే విడుదల చేస్తారా అనేది తెలియాల్సి ఉంది.
ఇక 'ఓ మై గాడ్ 2' విషయానికొస్తే..2012 లో వచ్చిన 'ఓ మై గాడ్' సినిమాకి ఇది సీక్వెల్ గా తెరకెక్కింది. అక్షయ్ కుమార్, పంకజ్ త్రిపాటి, యామి గౌతమ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సెటైరికల్ కామెడీ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాని వియాకాం 18 స్టూడియోస్ నిర్మాణ సంస్థ సుమారు రూ.150 కోట్ల భారీ బడ్జెట్లో నిర్మిస్తోంది. భారీ అంచనాలతో రాబోతున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సక్సెస్ ను అందుకుంటుందో చూడాలి.
Read Also : Nora Fatehi: ఆఫర్ల కోసం స్టార్ హీరోలతో డేట్ చేయమని అడిగారు: నోరా ఫతేహి షాకింగ్ కామెంట్స్
Also Read: విజయ్ సినిమాపై రజినీ ఓపెన్ కామెంట్స్ - మళ్లీ ఫ్యాన్ వార్ షురూ!