By: ABP Desam | Updated at : 19 Aug 2023 09:13 PM (IST)
Image Credit: Annapurna Studios/Twitter
తెలుగు ప్రేక్షకులు భాషతో సంబంధం లేకుండా సినిమాలను ఆదరిస్తుంటారు. కంటెంట్ నచ్చితే చాలు.. అది చిన్న సినిమానా, డబ్బింగ్ మూవీనా, హీరో ఎవరు అనేది ఏమాత్రం పట్టించుకోకుండా తమ నెత్తినపెట్టుకుంటారు. ఇటీవల కాలంలో అనేక ఇతర భాషల చిత్రాలకు టాలీవుడ్ జనాలు బ్రహ్మరథం పట్టారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు 'బాయ్స్ హాస్టల్' అనే కన్నడ డబ్బింగ్ సినిమా తెలుగు ఆడియన్స్ ను అలరించడానికి రెడీ అవుతోంది. తాజాగా ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేసారు.
ఈ ఏడాది కన్నడలో బ్లాక్ బస్టర్స్ గా నిలిచిన చిత్రాలలో ‘హాస్టల్ హుడుగురు బేకాగిద్దరే’ (Hostel Hudugaru Bekagiddare) ఒకటి. నితిన్ కృష్ణమూర్తి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యూత్ పుల్ క్రేజీ కామెడీ ఎంటర్‌టైనర్... చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. అదే చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ మరియు చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ కలిసి 'బాయ్స్ హాస్టల్' (Boys Hostel Telugu Movie) పేరుతో తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. 2023 ఆగస్టు 26న థియేటర్లలోకి తీసుకురానున్నట్లు ఇటీవలే ప్రకటించారు. ప్రమోషన్స్ లో భాగంగా శనివారం 'బేబీ' మూవీ టీమ్ తో గ్రాండ్ గా ట్రైలర్ ను లాంచ్ చేయించారు.
ట్రైలర్ లోకి వెళ్తే, బాయ్స్ హాస్టల్ లైఫ్ నేపథ్యంలో ఆద్యంతం యూత్ ఆడియన్స్ ను ఆకట్టుకునే అంశాలతో ఆసక్తికరంగా సాగింది. అద్దంలోని వస్తువులు మనకు కనిపించే దానికంటే దగ్గరగా ఉంటాయి.. రియాలిటీలో కొందరు వ్యక్తులు మనకు కనిపించే దానికంటే తెలివితక్కువవారు' అనే ఇంట్రెస్టింగ్ లైన్ తో ఈ ట్రైలర్ ప్రారంభం అవుతుంది. అందరిలాగే హాస్టల్ లైఫ్ ను జాలీగా ఎంజాయ్ చేస్తున్న నలుగురైదుగురు కుర్రాళ్లకు, స్ట్రిక్ట్ గా ఉండే వార్డెన్ వల్ల ఇబ్బందులు ఎదురవుతుంటాయి. అయితే ఒక రోజు ఆ హాస్టల్ వార్డెన్ అనుమానాస్పద స్థితిలో శవమై కనిపిస్తాడు. అల్లరి చిల్లరిగా తిరిగే ఆ యువకులు.. నేరం తమ మీదకు రాకుండా ఆ శవాన్ని మాయం చేయాలని అనుకుంటారు. దీని కోసం వాళ్ళు ఏమి చేసారు? వార్డెన్ డెడ్ బాడీని దాచిపెట్టడానికి ఏం ప్లాన్ చేసారు? ఈ క్రమంలో ఎలాంటి ఇబ్బందులు పడ్డారు? అనేది ఈ సినిమా స్టోరీ అని తెలుస్తోంది.
మూడున్నర నిముషాల నిడివి ఉన్న ఈ వీడియో ఓ వైపు నవ్విస్తూనే మరోవైపు ఉత్కంఠకు గురి చేస్తోంది. ప్రజ్వల్ బిపి, మంజునాథ్ నాయక, రాకేష్ రాజ్‌కుమార్, శ్రీవత్స, తేజస్ జయన్న ఉర్స్ వంటి కన్నడ నటులు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. 'కాంతారా' ఫేమ్ రిషబ్ శెట్టి గెస్ట్ రోల్ లో కనిపించారు. తెలుగు నేటివిటీ కోసం యాంకర్ రష్మీ గౌతమ్, డైరెక్టర్ తరుణ్ భాస్కర్ లను భాగం చేస్తూ కొన్ని సన్నివేశాలను రీ షూట్ చేసినట్లుగా తెలుస్తోంది. లెక్చరర్ గా నటించిన రష్మీ, 'ఇది ప్యాంటసీ కదా.. ఏమైనా జరగొచ్చు' అంటూ కాలేజీలో వయ్యారాలు ఒలకబోస్తూ కనిపించింది. 'మేం ఆంధ్రా వాళ్ళం.. పక్కా తెలుగోళ్ళం.. తోపు కాపులురా ఇక్కడ' అని ఒక కుర్రాడు అంటుండగా, 'ఒరేయ్ తప్పు తప్పుగా మాట్లాడకు.. ఆంధ్రా అంటే కాపులే కాదు, కమ్మోళ్ళు కూడా..' అని మరో అబ్బాయి అనడంతో ఈ ట్రైలర్ ముగుస్తుంది.
ఇందులో 'విరూపాక్ష' ఫేమ్ అజనీష్ లోకానాధ్ మ్యూజిక్ మరియు అరవింద్ ఎస్ కశ్యప్ సినిమాటోగ్రఫీ సినిమా మూడ్ కు తగ్గట్టుగా ఉన్నాయి. మొత్తం మీద చాలా రోజుల తర్వాత హాస్టల్ బ్యాక్ డ్రాప్ లో వస్తోన్న మూవీ కావడంతో యూత్ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయ్యేలా కనిపిస్తోంది. రక్షిత్ శెట్టి సమర్పణలో గుల్ మోహర్ ఫిల్మ్స్ & వరుణ్ స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. అన్నపూర్ణ స్టూడియోస్ & చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ కలిసి 'బాయ్స్ హాస్టల్' సినిమాని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు.
Also Read: చిన్న సినిమాలకు శాపంగా మారుతున్న రీ రిలీజులు?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
శివకార్తికేయన్ 'అయలాన్' టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్ - ఎప్పుడంటే?
'డబుల్ ఇస్మార్ట్' కి మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్ - మరో మాస్ ఆల్బమ్ పక్కా!
అల్లు అయాన్ ఆవిష్కరించిన అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహం - హాజరైన కుటుంబ సభ్యులు, కనిపించని ఐకాన్ స్టార్!
‘ఘోస్ట్’ ట్రైలర్ రిలీజ్, ‘భగవంత్ కేసరి’ సింగిల్ అప్‌డేట్ - నేటి టాప్ సినీ విశేషాలివే!
Raveena Tandon : పిల్లల దగ్గర ఏదీ దాచను, నా ఎఫైర్స్ గురించి కూడా చెప్పేశా - రవీనా టాండన్
Kadiam Srihari: స్టేషన్ ఘనపూర్ టికెట్ తనకేనని ముందే తెలుసు!- కడియం శ్రీహరి ఆసక్తికర వ్యాఖ్యలు
బండారు సత్యనారాయణ మూర్తి ఇంటి చుట్టూ పోలీసులు - అనకాపల్లిలో ఉద్రిక్తత
Pawan Kalyan: వైసీపీ పతనం మొదలైంది, వచ్చేది టీడీపీ- జనసేన ప్రభుత్వమే - పవన్ కళ్యాణ్ ధీమా
KTR Counter PM Modi: నమో అంటే నమ్మించి మోసం చేయడం! అదానీ చేతిలో బీజేపీ స్టీరింగ్- ప్రధాని వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్
/body>