అన్వేషించండి

Border 2 Trailer: ట్రెండింగ్‌లో 'బోర్డర్ 2' ట్రైలర్... పాక్‌లో కాదు, ఇండియాలో ఈద్‌కు ఎక్కువ మేకలు కోస్తారు - కాంట్రవర్సీకి దారి తీసేలా డైలాగ్

Border 2 Trailer Trending News: సన్నీ డియోల్ ప్రధాన పాత్రలో నటించిన 'బోర్డర్ 2' ట్రైలర్ విడుదలైంది. ఇందులో వరుణ్ ధావన్ మరొక పాత్ర చేశారు. ప్రజెంట్ ఈ ట్రైలర్ ట్రెండింగ్ అవుతోంది.

‘గదర్ 2’ ఘన విజయం సాధించడంతో సన్నీ డియోల్ తన 1997 దేశభక్తి చిత్రం 'బోర్డర్' సీక్వెల్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఆయన ‘బోర్డర్ 2’తో మళ్ళీ తెరపైకి రాబోతున్నారు. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. జనవరి 15న ఆర్మీ డే సందర్భంగా మేకర్స్ ఈ సినిమా ట్రైలర్‌ విడుదల చేశారు. ట్రైలర్ చూసిన తర్వాత ప్రేక్షకుల్లో దేశభక్తి భావన కలుగుతుందని చెప్పవచ్చు.

దేశభక్తితో నిండిన బోర్డర్ 2 ట్రైలర్!
'బోర్డర్ 2'లో సన్నీ డియోల్‌తో పాటు దిల్‌జిత్ దోసాంజ్, వరుణ్ ధావన్, అహాన్ శెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మోనా సింగ్, సోనమ్ బజ్వా, ఆన్యా సింగ్, మేధా రానా మహిళా ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాలో మేజర్ హోషియార్ సింగ్ నిజమైన కథను చూపించారు. ఆ పాత్రను వరుణ్ ధావన్ పోషించారు. సినిమా ట్రైలర్ సన్నీ డియోల్‌తో ప్రారంభం అవుతుంది. ఇందులో సన్నీ డియోల్ మాట్లాడుతూ "ఒక సైనికుడికి సరిహద్దు అనేది కేవలం ఒక గీత కాదు. ఇది తన దేశానికి ఇచ్చిన వాగ్దానం. అతను ఎక్కడ నిలబడితే అక్కడకు ఎవ్వరూ రాలేరు. శత్రువు కానీ, తూటా కానీ, అతని ఆలోచన కానీ, ఏది కూడా రాకూడదు. ఏది ఏమైనా ఈ వాగ్దానాన్ని మేము నెరవేరుస్తాము" అని చెప్పారు.

Also Read'రాజా సాబ్' ముందు కాలర్ ఎగరేసిన మెగాస్టార్ సినిమా... ఇండియాలో నాలుగు రోజుల నెట్ కలెక్షన్ ఎంతంటే?

అనంతరం వరుణ్ ధావన్, అహాన్ పాండే, దిల్‌జిత్ దోసాంజ్‌లను పరిచయం చేశారు. సినిమా సంగీతం కూడా మనసుకు హత్తుకునేలా ఉంది. ట్రైలర్‌లోని ప్రతి సన్నివేశం దేశభక్తి, భావోద్వేగాలతో నిండి ఉంది. 1997లో వచ్చిన బోర్డర్ సినిమా ఫీల్ ఈ ట్రైలర్‌లో ఉంది. సన్నీ డియోల్ ట్రైలర్‌లో మొత్తం కనిపించారు. మిగిలిన నటీనటులు కూడా బాగా నటించారు. ట్రైలర్‌లోని చివరి డైలాగ్ చర్చనీయాంశంగా మారింది. సన్నీ డియోల్ మాట్లాడుతూ "మీరు మమ్మల్ని ఎలా ఓడిస్తారు? మీ పాకిస్తాన్‌లో కంటే మా దగ్గర ఈద్ పండుగకు ఎక్కువ మంది మేకలను కోస్తారు" అనేది వైరల్ అవుతోంది.

Also ReadThe Raja Saab Box Office Collection Day 7: రాజా సాబ్ విడుదలై ఏడు రోజులు... 400 కోట్ల బడ్జెట్‌లో ఇండియా నుంచి సగమైనా వచ్చిందా?

ట్రైలర్‌ను ఇక్కడ చూడండి...

సన్నీ డియోల్ పోస్ట్ చేసి ట్రైలర్‌ను ప్రకటించారు
సన్నీ డియోల్ తన అధికారిక X ఖాతాలో బోర్డర్ 2 ట్రైలర్ విడుదల గురించి ప్రకటించారు. పోస్ట్‌లో, "ఈ కథ కంటే గొప్ప కథ లేదు, ఈ విజయం కంటే గొప్ప వేడుక లేదు. బోర్డర్ 2 ట్రైలర్ ఈరోజు, జనవరి 23, 2026న థియేటర్లలో విడుదలవుతుంది." జనవరి 14న రాత్రి, సన్నీ డియోల్ నౌకాదళ సిబ్బందితో కొంత సమయం గడిపారు. అతను సోషల్ మీడియాలో సైనికులతో తీసుకున్న సెల్ఫీని కూడా షేర్ చేశాడు, "హిందుస్థాన్ మేరీ జాన్, మేరీ ఆన్, మేరీ షాన్, హిందుస్థాన్, గౌరవం, మర్యాద మరియు వీరత్వం." అని రాశారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sunny Deol (@iamsunnydeol)

గతేడాది డిసెంబర్ 16న విజయ్ దివస్ సందర్భంగా సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ఆ టీజర్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. ఇప్పుడు ట్రైలర్ చూసిన తర్వాత అభిమానులు బోర్డర్ ఫ్రాంచైజీ తిరిగి రావడానికి చాలా ఆసక్తిగా ఉన్నారు. ఈ సినిమా నుండి 'సందేషే ఆతే హై'తో సహా నాలుగు పాటలు విడుదలయ్యాయి. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 23న ‘బోర్డర్ 2’ ప్రపంచ వ్యాప్తంగా సినిమా థియేటర్లలో విడుదల కానుంది. అనురాగ్ సింగ్ దర్శకత్వంలో భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, జెపి దత్తా, నిధి దత్తా నిర్మించారు. ఈ సినిమాను 1971లో జరిగిన భారత్-పాకిస్తాన్ యుద్ధం ఆధారంగా రూపొందించబడింది.

Also Read: Avatar Fire And Ash OTT Release: ఓటీటీలో 'అవతార్ 3' రిలీజ్... థియేటర్లలో విడుదలైన ఆరు నెలలకు?

టాప్ హెడ్ లైన్స్

Bigg Boss Winner Wedding: తమిళ నటుడిగా బిగ్ బాస్ విన్నర్ పెళ్లి... సింపుల్‌గా గురువాయూర్ టెంపుల్‌లో!
తమిళ నటుడిగా బిగ్ బాస్ విన్నర్ పెళ్లి... సింపుల్‌గా గురువాయూర్ టెంపుల్‌లో!
Irumudi Censor Review: 'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
Love or Control : Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Jana Nayakudu OTT: జన నాయకుడు ఓటీటీ రిలీజ్ డేట్... అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన జీ5 ఓటీటీ
జన నాయకుడు ఓటీటీ రిలీజ్ డేట్... అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన జీ5 ఓటీటీ

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Irumudi Censor Review: 'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Shiva Srishti Vyakaranam: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
Love or Control : Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Uppal Balu Navdeep: ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
Embed widget