Shah Rukh Khan: బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్‌కు గాయం - ఆ వార్తల్లో నిజమెంత?
Shah Rukh Khan: బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ ఓ మూవీ షూటింగ్‌లో గాయపడినట్లు తెలుస్తోంది. చికిత్స కోసం ఆయన టీంతో కలిసి అమెరికాకు వెళ్లినట్లు బాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

Shah Rukh Khan Injury In King Movie Shooting Set: బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ షూటింగ్ సెట్‌లో గాయపడినట్లు తెలుస్తోంది. ఆయన లేటెస్ట్ మూవీ 'కింగ్' షూటింగ్ సెట్‌లో షారుక్ ప్రమాదానికి గురైనట్లు అక్కడి మీడియాలో వార్తలు వస్తున్నాయి. ముంబైలోని గోల్డెన్ టొబాకో స్టూడియోలో భారీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తుండగా షారుక్ గాయపడ్డారని సమాచారం.
అమెరికాకు ప్రయాణం
భారీ సెట్‌లో యాక్షన్ సీక్వెన్స్ కోసం షారుక్ డూప్ లేకుండా స్టంట్ వేస్తుండగా ప్రమాదం జరిగి ఆయన గాయపడినట్లు టాక్ వినిపిస్తోంది. అయితే, దీనిపై అటు షారుక్ కానీ మూవీ టీం కానీ ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. అత్యవసర చికిత్స కోసం షారుక్ తన టీంతో కలిసి అమెరికా వెళ్లినట్లు తెలుస్తోంది. అది తీవ్రమైన గాయం కాదని... కండరాల గాయం అంటూ సినీ వర్గాలు తెలిపాయి. ఫ్యాన్స్ ఆందోళన చెందాల్సిన పని లేదని చెప్పాయి.
Also Read: పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - పవన్ బర్త్ డేకు 'ఉస్తాద్ భగత్ సింగ్' నుంచి సాలిడ్ ట్రీట్!
షూటింగ్ వాయిదా...
షారుక్‌కు గాయం నేపథ్యంలో 'కింగ్' మూవీ షూటింగ్ కూడా వాయిదా పడినట్లు వార్తలు వస్తున్నాయి. సెప్టెంబర్‌కు షూటింగ్ షెడ్యూల్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ మూవీలో షారుక్ ఆయన కుమార్తె సుహానా ఖాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్‌గా సిద్ధార్థ్ ఆనంద్ ఈ మూవీని తెరకెక్కిస్తుండగా... సుహానాకు మదర్ రోల్‌లో రాణీ ముఖర్జీ కనిపించనున్నారు. దీపికా పదుకోన్, అనిల్ కపూర్, జాకీ ష్రాఫ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. త్వరలోనే సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి. కాస్త బ్రేక్ తర్వాత షారుక్ 'కింగ్' మూవీతో ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేసేందుకు రాబోతున్నారు. పఠాన్, జవాన్, డంకీ చిత్రాలతో హ్యాట్రిక్ సక్సెస్ అందుకున్న ఆయన... 'కింగ్' మూవీతో మళ్లీ హిట్ కొట్టాలని ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు.





















